పుష్యమిత్ర - 36 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 36
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: పుష్యమిత్రుడి కాలంలో దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది.  పాకిస్తాన్‌లోని ఉప్పుగనులకు టెండర్ వేసిన సుకేశ్ సుభానికి టెండర్ వచ్చిందని ఫోన్‌లొ మన ప్రధానికి పాక్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్తాడు. పంచాపకేశన్‌ను అనుచరుడు వెంకటేశన్ ప్రభుత్వానికి లొంగిపోయి సాక్ష్యాధారాల్తో సహా పట్టించగా ఆర్ధికమంత్రి జైలుపాలవుతాడు. ఇండియన్ గ్లోబల్ఐ రహస్య విషయం అక్కడపనిచేసే అసాఫాలి ద్వారా సలాలుద్దీన్ తెలుసుకుని పాక్ ఆర్మీ జెనరల్‌కు చేరవేస్తాడు. (ఇక చదవండి)
డ్యూటీ ముగించుకుని వెళ్తున్న అసాఫాలీని ఒక కొండ మలుపు వద్ద కారాపి ఎక్కాలని యత్నిస్తాడు సలాలుద్దీన్.
"సలాలుద్దీన్... మాఫ్‌కీజీయే! ఆప్కో ఇన్ఫర్మేషన్ మిలా... హంకో క్యాష్ మిలా. డీల్ ఖతం హోగయా! ఆప్ బార్ బార్ మిల్నేకేలేలియే జరూరత్ నహీ హై"
"ఏక్‌బార్ మేరా బాత్‌సునో ఆలీభాయ్!"
"క్యా..హై.... జల్దీ బోలో" 
"ఔర్ ఏక్ డీల్ హై"
"దూసరా డీల్ నైమాంగ్‌తే. సబ్ లోగ్ అబ్జర్వ్ కర్తాహై"
"హా ఇసీలియే ఆప్ ఛుట్టీ మే పాక్ ఆయీయే - దస్ దిన్ బస్"
"క్యోం"
"ఆప్ ఏక్‌బార్ ఆయీయే! జాయీయే హపీలీ"
"మీట్ మీ ఇన్ హోటల్ నాజ్ టు నైట్ ఎట్ 11 పీ.ఎం." అంటూ కార్ వేగంగా తోలుకుంటూ వెళ్ళిపోయాడు.
చిక్కాడు వలలో అనుకుంటూ సంతోషంగా వెనుదిరిగాడు సలాలుద్దీన్.
*    *    *

"పుష్యమిత్రాజీ! ఉప్పుగని పూర్తిగా మనవశం అయింది. కానీ ఒకరిద్దరు మాత్రం ఎంతడబ్బిచ్చినా వెళ్ళమని మొండికేస్తున్నారు"
"వాళ్ళు ఎవరో తెలుసా?"
"పూర్వం ఇండియా నుండి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు"
"పొరబడ్డావు పీ.ఎం. వాళ్ళు పంచాపకేశన్ మనుషులు"
"ఓ గాడ్. ఆ యాంగిల్ లో నేను ఆలోచించనే లేదు"
"అందుకే తక్షణం వాళ్ళ యిళ్ళు, వాళ్ళ డాక్యుమెంట్స్ సోదా చేయించండి రహస్యంగా! మినిస్టర్ సామాన్యుడు కాదు"
"యెస్! వెంటనే చేయిస్తాను"
ప్రక్క క్యాబిన్లోకి వెళ్ళి ఫోన్‌చేసి అవసరమైన ఆదేశాలు జారీ చేసాక ఐదు నిముషాల తర్వాత వచ్చి కూర్చున్నాడు.
"డన్"
"సంతోషం పీ.ఎం. సాబ్"
"ఇంకో అతిముఖ్యమైన విషయం. మన ఇండియన్‌గ్లోబల్-ఐ విషయం, మనవారే పాక్ అధికారులకు అమ్ముడుపోయి మన రహస్యాలను చేరవేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం"
"ఎస్. లీక్ అయినట్టు ఇంతకు ముందు మీరు చెప్పారు"
"అవును. యిప్పుడు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని మన సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. వాడిని అనుక్షణం ఫాలో చెయ్యమని చెప్పాను. ఉప్పు గనుల విషయం చెప్పండి. ఎలా చేద్దాం!"
"ముందు ఆ ఒకరిద్దరి సంగతి చూడండి. ఋణశేషం శతృశేషం ఉండకూడదు. వాళ్ళు ఇండియా వాళ్ళా లేక పాక్ వాళ్ళే  మన చర్యలపై నిఘా కోసం అలా నటింపజేస్తున్నారో తెలుసుకోవాలి కదా! తొందర పడవద్దు"
"నిజమే! వారిని ఎలాగైనా పంపేయాలి. వారికి ఇండియాలో పెద్ద ఉద్యోగం ఇస్తాం అనే సాకు చెప్పి దిల్లీ తీసుకు వచ్చి తర్వాత వారి కధ ముగించాలి".
ఆ విషయం అంత సులభం అనుకోకండి. వాళ్ళను బార్డర్ దాటించడం అంత సులువు కాదు"
"ప్రయత్నిచడంలో తప్పులేదుగా!"
"కానీ వాళ్ల మనుషులను తేలిగ్గా కంట్రీ వదలి బయటకు వెళ్ళనియ్యరు. మొన్న నేను పాక్ వెళ్ళినప్పుడు అవన్నీ గమనించాను"
*    *    *
ఇంక్విలాబ్ జిందాబాద్! అంటూ గని ముందు ధర్నా చేస్తున్న యిద్దరు వ్యక్తులను ఇండియన్ ఆర్మీ స్వాధీనంలోకి తీసుకుని జీప్ ఎక్కించుకుని ఇండియా బార్డర్ దాటిస్తుండగా పాక్ అధికారులు వారితో ఘర్షణపడి అడ్డగించారు. వారి భధ్రత విషయం ఏమిటని ప్రశ్నించారు. వారిని మళ్లీ గని వద్దకు తీసుకువెళ్ళి బేరం సాగించారు.
"మీ డిమాండ్లు ఏమిటి?"
"మాకు రెండు సంవత్సరాలకు బదులు పది సంవత్సరాల జీతం ఇవ్వాలి."
"మీ డిమాండ్లను పేపర్‌పై రాసివ్వండి. మాట్లాడి పరిష్కారం చేస్తాం"
పేపర్ రాసిచ్చాక వారిని వదలి వేసి, వారిని ఫాలో అవడం మొదలెట్టారు.
*    *    *
హోటెల్ నాజ్ లో ఒక టేబులు ముందు కూర్చుని విస్కీ మెల్లిగా తాగుతున్న సలాలుద్దీన్,  అసాఫాలీ రావడంతో సంతోషం వ్యక్తం చేసి స్వాగతం పలికి షేక్‌హ్యాండ్ ఇచ్చి ఇష్టమైన బ్రాండ్ తెప్పించి యిచ్చాడు. మందు మెల్లిగా గొంతు దిగుతోండి. మ్యూజిక్ మంద్రంగా వినిపిస్తోంది. పబ్‌లో జంటలు డ్యాన్సులు మొదలెడుతున్నారు. మెల్లిగా మాటలు మొదలయ్యాయి వారిద్దరి మధ్యన.
"మీరు చెప్పింది నాకు అర్ధం కాలేదు. నేను సెలవు పెట్టి పాకిస్తాన్ ఎందుకు రావడం"
"మా గెస్టుగా రండి మీకు స్వర్గం అంటే ఏమిటో మొదటి సారి చూపిస్తాను. ఒక పది రోజులు కోరుకున్న అమ్మాయిలతో ఉండొచ్చు. ఇష్టం వచ్చినంత తాగొచ్చు. తినొచ్చు. జీవితంలో ఆ సంతోష సమయాన్ని తలుచుకున్నప్పుడల్లా నేను గుర్తుకొస్తాను"
"అవన్నీ సరే! అసలు విషయం ఏమిటి?"
"భాయ్! నీకు 10 కోట్లు ఇస్తానంటే ఏమి చేయడానికైనా సిద్ధమే కదా!"
"ఎస్....కానీ.. నా లిమిట్స్ నాకున్నాయి. నాకు అన్ని రహస్యాలు తెలీదు కదా!"
"నీకు వీలైన పనే చెయ్యొచ్చు. ముందు సెలవు పెట్టి పాక్‌కు రండి. అక్కడ అన్ని విషయాలు మా వాళ్ళు మాట్లాడుతారు. జీవితంలో  ఈ పనికిమాలిన  ఉద్యోగం చెయ్యకుండా దిల్లీ లో ఒక పెద్ద బంగళా కొనుక్కుని హాయిగా సెటిల్ అవుదురుగాని"
"అలాగే! ఎలాగూ పై వారం సెలవు అడిగాను. అప్పుడు వెళ్దాం. ఈలోపు నన్ను కలవొద్దు. నా మీద నిఘా ఉంది. నా సహచరులే అనుమానంగా చూస్తున్నారు. నేను ఎక్కడికి రావాలో చెప్పు. ఇవాళ  తారీకు 10. 20వ తేదీ శ్రీనగర్ దగ్గర ఉన్న "గురిపోరా" విలేజ్ లో ఉన్న ఖాదర్‌మస్తాన్ హోటెల్‌కు వచ్చి నా ఫ్రెండునని చెప్పు. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు. నీ వేషం కూడా మార్చి తీసుకెళ్తారు. ఎవ్వరూ గుర్తుపట్టరు. భయం ఏమీ ఉండదు. బై" అంటూ వెళ్ళిపోయాడు. 
టేబిల్ క్రింద అoటించబడిన రెమోట్ రికార్డర్‌ను దూరంగా కూర్చున్న ఇండియన్ అధికారి ఆఫ్ చేశాడు.
*    *    *
ధర్నా శిబిరం నుండి బయటకు వచ్చిన గని ఉద్యోగులు యిద్దరు పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయంలో దూరారు. ఇండియన్ సీ.ఐ.డీ పోలీసులు లోనకు వెళ్ళి అనవసర విషయాలు, ఇన్‌ఫర్మేషన్ అడుగుతూ కొంత కాలయాపన చేస్తుండగా వారు బయటకు రావడం చూసి వారిని వెంబడించారు. మెల్లిగా వారి వెనుకగా నడవ సాగారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. "రెండు దేశాలవాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో మనం యిరుక్కున్నాం" అన్న మొదటివాడి మాటకు రెండో వాడు. "అవును. మన వుద్యోగం మనిష్టం. వీళ్ళు ఎలాగైనా అక్కడే ఉద్యోగంలో ఉండాలి. ఇండియా వాళ్ళ విషయాలు చెప్పాలి అని ఆర్డర్ వేస్తారేమిటి?" అనగా మొదటి వాడు జోక్యం చేసుకుంటూ.. "అయినా మనం 10 సం.జీతం తీసుకుని బెలూచిస్తాన్‌కు ఉడాయిద్దాం. ఈ గోల మనకెందుకు?" అనగానే పాక్ వారి గూఢచర్యం అర్ధమైన ఇండియన్ అధికారులు వెంటనే ఈ విషయం చేరవేశారు. 10 సం. జీతం వెంటనే యిచ్చి పంపివేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఆవిధంగా వారిని బెలూచిస్తానుకు పంపే ఏర్పాట్లు సైతం మన వాళ్ళే చేశారు. వారి కధ సుఖాంతం అయింది. (సశేషం)

*    *    *

No comments:

Post a Comment

Pages