ఈ దారి మనసైనది - 15 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 15
అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.)  
“మీరు దాన్ని చదివిస్తే నేను ఉరిపోసుకొనిచస్తాను". అంది ….ఆ మాటలకి భయపడి విశ్వనాద్ మాట్లాడలేదు. బక్కెట్ల నీళ్లు నెత్తిన కుమ్మరించినట్లు. చల్లబడిపోయాడు. ఇది తెలిసి  ప్రియబాంధవి మేడమ్ ని తన యింటికి పంపాడు అనురాగ్.
ఆమె వాళ్లకి నచ్చచెప్పటానికి, వాళ్లని ఒప్పించటానికి,  ఎంత కష్టపడిందో మన్వితకి తెలుసు.
ఇంట్లోనే వుండి డే స్కాలర్ గా  కాలేజీకి వెళ్లి చదువుకోవచ్చు కానీ ఇంట్లో వుండి చదివితే ఆ ఇంటి వాతావరణం ఎలా వుంటుందో తెలిసిన అనురాగ్ విశ్వనాధంతో మాట్లాడి తనను కాలేజిలోనే లేడిస్ హాస్టల్లో వుంచి చదివించే ఏర్పాటు చేశాడు.
ఈ విషయంలో అనురాగ్ ఋణం ఏ రూపంలో తీర్చుకున్నా తీరదు. అలా అని అతని ప్రేమలో దీక్షిత తడిసిపోతుంటే చూస్తూ తట్టుకోలేదు. ఎందుకంటే?
అనురాగ్ నిక్కర్లలో నుండి ప్యాంట్లలోకి మారి, వచ్చీ రాని నూనూగు మీసాలతో కన్పించటం మొదలైన క్షణం నుండి తన మనసులో ప్రేమ బీజం మొలకెత్తింది. అదెలా అంటే? గుండె భూమినిచీల్చుకుంటు మొలకెత్తే మొక్కలా ... అతి సహజంగా మొలకెత్తింది. ఒక వైపు సీరియస్ గా  చదువుకుంటున్నా. కళ్లముందే వయసుకి మించి ఎదుగుతున్న అనురాగ్ తన గుండెను లాగటం మొదలు పెట్టాడు.
తనకి తెలియకుండానే తన హృదయాన్నిస్పశించి, సంతోషపు కల్లోలాన్ని సృష్టించాడు. అంతరాంతరాల్లోకిచొచ్చుకు పోయాడు. అనిర్వచనీయంగా, అవ్యక్తంగా తన గుండెలో అమరిపోయాడు. తన ప్రమేయం లేకుండానే కవ్విస్తూ కదిలిస్తూ, మరిపిస్తూ మురిపిస్తూ, స్పందించటం ఎలాగో తన గుండెకు నేర్పాడు. తన అణువణువును తట్టి చైతన్య పరిచాడు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యాక - సెలవుల్లో ఇంటికెళ్ళాక పరధ్యానం ఎక్కువైంది. ఒకసారి పిలిస్తేపలికేది కాదు. ఎక్కువసార్లుపిలిస్తేతపోభంగం కలిగినట్లు కోప్పడేది. ఎవరు ఫోన్ చేసినా తనకే అనిపరిగెత్తేది-నిజానికి అనురాగ్ తనకి ఫోన్ చేస్తే ఎక్కువగా చదువు గురించే మాట్లాడతాడు. అతను ఏది మాట్లాడినా ఆ గొంతు వింటూ అమృతంలో మునకేసినట్లుమురిసిపోయేది. అందం విూద, అలంకరణ మీద ఆసక్తి పెరిగి అవసరం లేకున్నా ఒకటికి రెండు సార్లు ముఖం కడుగుతుంటే తల్లి చూసి ముఖం వాచేట్లుతిట్టేది. నానమ్మేమో దీనికి పిచ్చిపట్టిందిఅనుకునేది. సరిగా తినేది కాదు. సమయానికి నిద్రపోయేది కాదు. అనురాగ్ గురొచ్చినప్పడు తనలో తాను నవ్వుకునేది. మరిచిపోయినప్పడు గుర్తు చేసుకునేది. ఏదిలేనప్పడు శూన్యంలోకి చూస్తూకూర్చునేది ఒక్కోసారి ఉత్సాహం.... అంతలోనే చెప్పలేని నీరసం....
అయినా కూడా.... అతని కోసం తనెప్పడులేడిస్ హాస్టల్ గోడ దూకలేదు. అతని పక్కన కూర్చొని రొమాంటిక్ సినిమాలు చూడలేదు. పార్క్లో, బేకరీల్లో గంటలు, గంటలు కూర్చోలేదు. తెల్లవారే వరకు ఫోన్లో స్వీట్ నధింగ్స్ చెప్పకోలేదు. వాలెంటైన్స్ డే రోజు  వర్ణనలతో కూడిన ఉత్తరాలు రాసుకోలేదు. మనసుతో చూసి, కళ్లతో అనుభవించి, గుండెలో నింపుకొంది.
కానీ ప్రేమించడంలోని మధురిమ స్వర్గాన్ని చూపిస్తే .... ఆ ప్రేమను ఎలా గెలవాలో తెలియక ఇప్పుడు నరకాన్ని చూస్తోంది.
ఎలాగైనా అతన్ని గెలవాలి !
గెలవాలి అంటే తనేంటో అతనితో చెప్పాలి. తనలో ఏముందో చెప్పాలి. ఎవరూ చెప్పని, చెప్పలేనంత అపురూపంగా చెప్పాలి. అలా చెప్పేంత వరకే తనకీ ఒంటరితనం. ఆ తర్వాత అనురాగ్ పరిపూర్ణంగా తన మనిషి అయిపోతాడు.
ಇನ್ನಿరోజులు చెబితే ఏమంటాడోనని చెప్పలేక పోయింది కాని, చెప్పక తప్పు చేశానేమోనని ఇప్పడనిపిస్తోంది.
ఈ నిర్ణయానికి వచ్చాక మన్విత మనస్సు బయటకురిసే చల్లని వెన్నెల్లా హాయిగా అన్పించింది.
(సశేషం )
*****

No comments:

Post a Comment

Pages