నెత్తుటి పువ్వు - 6
మహీధర శేషారత్నం
(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను ఏదైనా పనిలో పెట్టాలని చూస్తూ ఉంటాడు రాజు.)
“అదేం లేదక్కా ! అందుకే నీ సాయం కావాలంటున్నా ఆ పిల్ల నన్ను నమ్మటం లేడు. భయమో తెలియదు, పెంకితనమో తెలియదు. గొడవ చేస్తోంది. ఇరుగు పొరుగు చూస్తే నా పరువు పోతుంది. అందుకని నువ్వు నచ్చ చెబుతావేమోనని"....నడిగాడు.
'ఆడ కూతురు కదా! బయముంటుందిలే బాబూ! నేను చూసుకుంటాలే! రేపు వస్తా హామీ ఇచ్చింది రాములమ్మ
"జాగ్రత్తగా చూడక్కా! నాకు తరచూ రావడం కుదరదు. ఏదైనా పని చూసి వస్తాను, ఎప్పుడూ తెచ్చి పెట్టాలంటే నాకూ కుదరదు."
జేబులోంచి వెయ్యి రూపాయలు తీసి ఇచ్చాడు.
రాములమ్మ అన్నమాట ప్రకారం సరోజ దగ్గరకు వెళ్ళింది. ఆ కబురు ఈ కబురు చెప్పి భయం పోగొట్టింది. రాజు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చింది.
సరోజు డబ్బు తీసుకోడానికి భయపడింది. అనుమానంగా చూసిందిరాములమ్మ వైపు
రాములమ్మకి అర్ధమయింది, ఆ అమ్మాయి అనుమానం ఏమిటో! "చూడమ్మా! రాజబాబుకి పని ఉందిట. రావడానికి కుదరదన్నాడు. నాకూ కుదరకపోతే నీకాడ తినడానికైనా డబ్బుండాలిగా! వీధి చివర కిరాణా కొట్టుంది. ఏదైనా కావల్సి ఉంటే కొనుక్కోనీకేదైనా పనిచూపిస్తాన్నాడు. పెళ్ళాం బిడ్డలున్నోడు. ఎన్నాళ్ళు పెట్టగలడు, నేనెళ్ళిస్తా."
సరోజ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయింది.
* * *
నాగరాజు ఆలోచనలో పడ్డాడు. ఈ పిల్ల ఏం పనిచేయగలదు? నాలుగిళ్ళల్లో పాచిపనా? ఆ పనికయితే తానుగొప్పగా దారి చూపిస్తానంటూ తీసుకురావడం ఎందుకు?ఇబ్బంది లేనిపని... ఆలోచించాడు. కాంట్రాక్టర్ల దగ్గర తట్టలో,వాళ్ళ మోసే కూలిపనా? ఊహూఁకి లాభం లేదు. చెయ్యలేదు. కుట్లో... అల్లికలో... ఏదో చెయ్యాలి. అవేమైనా నేర్చుకోవాలంటే కొన్ని నెలలు తాను పోషించగలడా? తన జీతంలో... ఆలోచన తేమలలేదు.సైకిలేసుకొని ఆ గదికి పోయాడు. ఆ గది ఒక ఫ్రెండుది.. వర్క్ పర్మిట్ వీసా మీద దుబాయ్ వెడుతూ ఎవరికైనా అద్దెకిమ్మని చెప్పివెళ్ళాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు అద్దె కట్టక్కర్లేడు, గుడ్డిలో మెల్ల.
"ఇదిగో! నన్నిలా ఒకదాన్నీ పడేస్తే భయంతో చేస్తున్నాము. మంచో, చెడో మందిలో ఉండొచ్చినదాన్ని జైలులా ఇదేంటి? రోజుల తరబడి ఒకదాన్ని బిక్కు బిక్కుమంటూ..."గయ్యమంది.
నిజమేకదా! అనుకున్నాడు.
“నువ్వేం పని బాగా చెయ్యగలవు?"
“భోజనం”
సీరియస్గా చూసాడు.
"హరి నాకేం వచ్చు ఆడడం తప్పింది..."
“ఊహూఁ ! ఆలోచన రావటం లేదు. ఆలోచిద్దాం...
ఆలోచన వాయిదా వేసాడు.
“సరేగాని నీ పేరు ఏంటి?”
"అంతవసరమా? మొండిగా ఉంది.
"పిచ్చివేషాలెయ్యకు, చెమడాలు లూడదీయగలను..."కయ్యి మన్నాడు.బెదిరింది.
"సరే! నీ పేరేదయితే నాకెందుకు? నేనే ఏదో ఒక పేరుతో పిలుస్తా, దాని పనికిచావు... "కసిగా" అన్నాడు.
రాములమ్మ చెప్పిన పేరు జ్ఞాపకం వచ్చింది.
ఊc! సరోజ. అర్ధమయిందా? కసిరాడు.
భయం భయంగా "ఊఁ!" అంది.
“నేను రేపు వస్తాను..." వెళ్ళబోయాడు.
"ఇదుగో....." బెదురుగా పిలిచింది.
“నా పేరు” ఇదుగో కాదు నాగరాజు రాజు అని పిలువు”
“ఏమో! నేనిట్టానే పిలుస్తా!.... ఇదుగో...."
సీరియస్ గా చూసాడు.
(సశేషం )
No comments:
Post a Comment