ఓ పశ్చాత్తాపమా! - అచ్చంగా తెలుగు
ఓ పశ్చాత్తాపమా!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


ముందుచూపు లేక చేయరానివెన్నో చేశాక
అసలుచూపుతోచూడరానివెన్నోచూశాక
ఫలితంగాజరుగరానివెన్నో  జరిగాక
మసనంతా అశాంతితో మరిగాక
వయసులోని వన్నెలన్నీ తరిగాక
మనసులోనితీపిగుర్తులనీ చెరిగాక
కనులుకన్న కలలు కన్నీళ్ళై కరిగాక
ఈజీవితంజడమై,సంతోషాలకు ఎడమై  ఒరిగాక
చివరిలోచేతులు కాలాక 
బ్రతుకుపైబొబ్బలు తేలాక
అసలు విషయాలు ఎరిగాక
ఇంకేమీ చేతకాకమూలను చేరాక
నిర్లిప్తతతో ముడుచుకు పోయాక
అనుభావించాల్సినది అంతా అయిపోయాక
ఓ పశ్చాత్తాపమా! ఇప్పుడెందుకువచ్చావిలా?
విమర్శకా?పరామర్శకా?
ప్రకర్షకా?పరవశానికా?
పరాచికానికా?పైశాచికానికా?
  ***

No comments:

Post a Comment

Pages