శ్రీధరమాధురి -60
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
ఈ ప్రపంచం రచించబడడానికి ఐక్యమైన పంచభూతాలనేవి, ఎండమావిలో నీటిలా కేవలం ఒక భ్రాంతి మాత్రమే... అటువంటప్పుడు నేను శిరసు వంచి ఎవరికి నమస్కరించాలి?
నేను, నేనే, మచ్చలేని వాడిని...
అహం బ్రహ్మస్మి...
అతను – జీవితమంటే ఏమిటి?
గురువు – ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతనికి పేరు ఉండదు, శ్వాస ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి పేరు ఉంటుంది, కాని శ్వాస ఉండదు. ఈ శ్వాసకీ, పేరుకీ మధ్య ఉన్న ఖాళీనే ‘జీవితం’ అంటారు.
సంతోష్ తాటి - ప్రణామాలు గురూజీ. ఈ కర్మ చక్రం నుంచి బయటపడడం ఎలాగ? మన ప్రతి చర్యను దైవేచ్ఛకే వదిలివేస్తే, మనం ఈ చక్రం నుండి బయటపడగలమా? అటువంటి శరణాగతి సులభం కూడా కాదనుకోండి, మీ దయ.
గురూజీ : మనం విజయం సాధించగలమా అన్న ప్రశ్న ఒకసారి ఉదయించగానే సంపూర్ణ శరణాగతి అన్న భావన పోతుంది. మీరు ఇందులో కృతకృత్యులు కాలేరు. మీరు ఎటువంటి విశేషణాలు లేకుండా శరణాగతి వేడడం అలవర్చుకోవాలి. ఏ ఉద్దేశాలు ఇందులో ఉండకూడదు.
మీరు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు అంతర్గత ప్రగతి అనేది సాధ్యం కాదు మీరు ఒక బోన్సాయ్ మొక్కల ఉండిపోతారు. ఎన్నటికీ ఎదగరు. ఎదుగుదల, అభివృద్ధి అనేవి ఒకసారి మీరు ఆ సౌకర్యమైన ప్రాంతాన్ని వదిలాకే జరుగుతాయి. ఒకవేళ మీరు సౌకర్యవంతంగా జీవిస్తూ ఉంటే దేన్నీ సహజంగా చూడలేరు. మీ అంతర్గత ప్రగతి కి అడ్డు పడుతుంది. ఒకరు ఎదగడానికి, అధిగమించడానికి అన్నింటినీ సహజంగా చూడని అలవర్చుకోవాలి. కాబట్టి 'సౌకర్యవంతమైన ప్రాంతం' అనేది ప్రగతికి, అంతర్గత శాంతికి కూడా అవరోధంగా పరిణమిస్తుంది.
బుద్ధికి ఆశ్చర్యపోవడం తెలియదు. అది విశ్లేషిస్తుంది. విశ్లేషణ ఉన్నప్పుడు ఆశ్చర్యపోలేము. బుద్ధి కారణాలు వెతుకుతూ ఉంటుంది. బుద్ధి గతంలోకాని, భవిష్యత్తులో కాని తిరుగుతూ, ప్రస్తుతంలో ఎన్నడూ ఉండదు. అది ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉండదు కనుక, కారణాలు వెతుకుతూనే ఉంటుంది. దాన్ని ఒప్పించేలా చెయ్యాలి కనుక, కారణాలు వెతకాలి. మీరు కారణాలు వెతుకుతూ ఉన్నప్పుడు, ఆశ్చర్యపోవడం అనేది మిధ్య అవుతుంది. కేవలం హృదయమే ఆశ్చర్యపోగలదు. హృదయం ఎన్నడూ కారణాలు వెతకదు. అద్భుతాల్లో హృదయం తనను తాను ముంచుకుంటుంది. అది ఆ అద్భుతంలో తనను తాను కరిగించుకుంటుంది. హృదయం కేవలం ప్రస్తుతంలో జీవిస్తుంది. ఆశ్చర్యపోవాలంటే మనం అమాయకంగా ఉండే హృదయంతో, పసిపాపల కళ్ళతో ఉన్న రోజులకు వెనక్కు వెళ్ళాలి. మన ప్రయత్నం లేకుండానే వెనక్కు వెళ్లి, మనం పసికందులుగా ఉన్న రోజులకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది...
మీ అనుభవాల నుంచి మీరు నేర్చుకున్నప్పుడు, మీరు మరింత పరిపూర్ణంగా, మరింత పరిణితి ఉన్నవారిగా, మరింత ఆరోగ్యకరంగా తయారౌతారు. మీరు ఈ అనుభవాలనే మంచి- చెడుగా, తప్పు-ఒప్పుగా, సంపూర్ణం- అసంపూర్ణంగా వేరు చెయ్యడం మొదలుపెట్టి, విభజిస్తూ పొతే, దీన్నే ఖచ్చితంగా ‘నరకం’ అని పిలుస్తారు.
మీ వ్యక్తిగత విషయాల్లో మీ హృదయం చెప్పిన మాటనే వినండి, బుద్ధి చెప్పే మాటని కాదు. వ్యక్తిగతం కాని విషయాల్లో బుద్ధి మాటనే వినండి, హృదయం మాటను కాదు. దేన్నీ మీరు వ్యక్తిగతంగా, దేన్నీ మీరు వ్యక్తిగతం కాని అంశంగా వర్గీకరిస్తారు అనేది ,ముఖ్యంగా ఏది మీ మనసుకు దగ్గరగా ఉండే అంశమో, లేక ఏది మీ బుద్ధికి దగ్గరగా ఉండే అంశమో అన్న దానిపై ఆధారపడుతుందనుకోండి.
***
No comments:
Post a Comment