ఉత్సాహం - సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు

ఉత్సాహం - సుబ్బుమామయ్య కబుర్లు

Share This
సుబ్బుమామయ్య కబుర్లు 
ఉత్సాహం

పిల్లలూ!
ఎలా ఉన్నారూ..
మనం ఇప్పుడు ఉత్సాహం గురించి మాట్లాడుకుందామే..
ఏదైనా మనకు ఆనందం కలిగించే పననుకోండి ఉత్సాహం చూపిస్తాం. అదే ఆసక్తి కలిగించేది కాదనుకోండి, నిరుత్సాహంగా ఉంటుంది. అర్థమయ్యేట్టు చెప్పనా?
మీరు స్కూలు నుంచి ఇంటికి రాగానే మీ అమ్మ హోం వర్క్ చేసి ఆడుకోమందనుకోండి మీకు ఎక్కడి లేని హుషారూ వస్తుంది. అదే హోం వర్క్ చేసి ఆడుకోమన్నారనుకోండి, అంతే మనం గాలి తీసిన బెలూన్ అయిపోతాం. ఉత్సాహం అన్నది మన మనసు గారడి. చేసే పనిపట్ల ఆసక్తిని కలిగి ఉండే ఉత్సాహం అదే ఉరకలేస్తుంది. మీకు తెలుసా? సైంటిస్ట్ లు చాలా సమయం తమ పరిశోధనల కోసం ల్యాబ్ లలోనే గడుపుతారు. మనం గనక వాళ్ల జీవన విధానం చూస్తే, చిరాకు, విసుకు కలుగుతాయి. మరి వాళ్లకెందుకు కలగడం లేదు. వాళ్లలా అనుకుంటే మనకు టీవీలు, ఫ్రిజ్జులు, సెల్ ఫోన్లు వచ్చేవా..వాటితో ఈరోజు ఎంత సౌకర్యవంతంగా జీవిస్తున్నాం. అలాగే మీ టీచర్లు మీ సీనియర్లకి పాఠాలు చెప్పారు. మీకూ చెబుతున్నారు. మీ జూనియర్లకీ చెబుతారు. మరి ప్రతి సంవత్సరం అవే పాఠాలు చెబుతుంటే వాళ్లకి విసుగనిపించదా? అలా వాళ్లకి గనక అనిపిస్తే మీ బుజ్జి బుజ్జి పిల్లలు రేపు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఎలా అవుతారు?
ఏపనైనా సరే చెయ్యాల్సివస్తే మన మనసును దానికి సంసిద్ధం చేసుకోవాలి. అందులో కొత్తదనాన్ని చూడగలగాలి. అప్పుడే పనిని చెయ్యాలన్న ఉత్సాహం మనసులోంచి శరీరమంతా ప్రవహిస్తుంది. మీకు తెలుసా? ఉత్సాహంతో చేసే పని అలసట కలగనివ్వదు. ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది.
ఉదాహరణకు మీ అమ్మ షాపులోంచి ఏదైనా వస్తువు కొనుక్కు రమ్మందనుకోండి. మీరు నే వెళ్లను అని చిరాకుపడే బదులు, సంచి తీసుకుని ఓ నాలుగైదు షాపుల్లో దాని ధర అడిగి తెలుసుకుని, నాణ్యమైన వస్తువు సరసమైన ధరకు తీసుకు వెళ్లారనుకోండి. మీ అమ్మ ఎంత ఆనంద పడుతుందో చూడండి. మీరు ఏ వస్తువు కొనడానికి వెళుతున్నారూ దాని గురించే కాకుండా మీ ఇంటికి దగ్గర్లో ఏయే షాపులు ఉన్నాయో వాటిలో ఏం దొరుకుతాయో కూడా గమనించండి. తర్వాతెప్పుడన్నా ఆయా వస్తువులు అవసరం పడితే వెతుక్కోకుండా సరాసరి అక్కడికి వెళ్లి తెచ్చుకోవచ్చు. 
ఇప్పట్నుంచి మీరు ఉత్సాహంగా ఉంటారు కదూ..
ఉంటారు నాకు తెలుసు మీరు మంఛి పిల్లలు కదా!
ఉంటానర్రా మరి.
మీ సుబ్బు మామయ్య.

No comments:

Post a Comment

Pages