మత సామరస్యాన్ని తెలియజేసే కొన్ని సంఘటనలు - అచ్చంగా తెలుగు

మత సామరస్యాన్ని తెలియజేసే కొన్ని సంఘటనలు

Share This
మత సామరస్యాన్ని తెలియజేసే కొన్ని సంఘటనలు
అంబడిపూడి శ్యామసుందర రావు 

భారత దేశములో మతసామర్యసము లేదు మైనారిటీలు అయినా ముస్లిం క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టె రాజకీయనాయకులు ఉన్నారు ఇది అబద్ధము కాదు కానీ దాని వెనుక కారణాలు పూర్తిగా రాజకీయ మైనవే తరతరాలు గా భారతదేశములో వివిధమతాల వారు కలిసి జీవిస్తున్నారు  అనేది జగమెరిగిన సతాయిము కానీ బ్రిటిష్ పాలనలో వారి విభజించు పాలించు అన్న దమన నీతికి కొందరు స్వార్థపర రాజకీయ వేత్తలు ఆకర్షితులై మాట సామరస్యాన్ని పరమత సహానాన్ని వారి వారి మతాల తూటాలతో చెడగొడుతున్నారు వాటికి తార్కాణమే అక్కడక్కడా జరిగే మతకలహాలు. వీటిలోఅమాయకులైన  ప్రజలు బలి అవుతున్నారు సాధారణ ప్రజల ప్రమేయము ఏమి లేకుండా ఈ కలహాలు జరుగుతున్నాయి ఇవన్నీ పూర్తిగా రాజకీయ నాయకుల గుండాల ప్రమేయముతో  జరిగేవే. ప్రస్తుతము భారతదేశములో మతసామరస్యాన్ని మతసహనాన్ని తెలియజేసేకొన్ని అబ్దుతమైన  సంఘటనలను కొన్ని తెలుసు కుందాము ఈ సంఘటనాళ్ళింటిలో మతాల ప్రమేయము లేకుండా మానవత్వము సాటి మనిషి పట్ల చూపే ఆదరణ కనిపిస్తుంది.అందుచేతనే ఇండియాలో భిన్నత్వములో ఏకత్వము ను ప్రపంచము గమనిస్తుంది ఇది నచ్చని పొరుగు దేశాలు వీలైనంతవరకు మతకలహాలను ప్రోత్సహిస్తున్నాయి మతసామరస్యాన్ని పరమత సహనాన్ని తెలియజేసే ఈ సంఘటనలు తెలుసుకుంటే ప్రజలలో విస్వాసము నమ్మకము పెరుగుతుంది. 

1. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని 73 ఏళ్ల షేక్ రియాజుద్దీన్ అబ్దుల్ గని (రాజుబాబా కీర్తనకార్ గా ప్రజలకు తెలుసు) నీరు నింపిన కుండను నెత్తిమీద పెట్టుకొని మీరా భజనలను గానము చేస్తూ కనిపిస్తాడు ఈయన బాల్యము నుండే హిందూయిజం పట్ల ఆకర్షితుడై ఆలయాల వెలుపల కూర్చుని భజనలు పాడటం విని నేర్చుకున్నాడు ఇది చుసుని హిందువులు ఆయనను గుడిలోకి ఆహ్వానించి గుడిలో పాడమనేవారు ఈయన పాడుతున్నప్పుడు శ్రోతలు నిద్రలోకి జారొకోవటాన్ని గమనించి కీర్తనలు పాడటంతో పాటు వాటికి అనుగుణముగా నృత్యము కూడా చేసి ప్రజలను సంతోషపెట్టేవాడు. నది నీరు నీళ్లు తెచ్చేటప్పుడు కీర్తనలు పాడుకుంటూ తెచ్చేవాడు అప్పటి నుంచి నీళ్ల బిందె నెట్టి మీద పెట్టుకొని ఎందుకు పడకూడదు అన్న ఆలోచనను కార్య సాధనలో పెట్టాడు. ఈ మధ్యనే ఈ మహానుభావుడు ఐఐటి ముంబాయిలో స్పిక్ మెకే ఫెస్టివల్ లో తన కీర్తనల ప్రోగ్రాం ఇచ్చాడు 
2.రాజీవ్ శర్మ అనే హిందూ వ్యక్తి మహమ్మద్ ప్రవక్త బోధనలకు ఆకర్షితుడై మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను రాజస్టాన్ ప్రాంత భాష అయినా మార్వారీ భాషలో 112పేజిల  పుస్తకంగా వ్రాసాడు ఈ పుస్తకము పేరు పైగంబర్ రో పైగామ్ అంతేకాకుండా మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర గురించి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఈ పుస్తకాన్ని ఉచితముగా పాఠకులు శర్మ ఈ లైబ్రరీ ద్వార చదువుకోవచ్చు.శర్మ  ఈ లైబరీలో సుమారు 300 పుస్తకాలు పాఠకులకు లభ్యమవుతాయి. 
3. ఉత్తర ప్రదేశ్ లోని జాన్పూర్ లోని అబిద్ అల్వి అనే ముస్లిం యువకుడు హనుమాన్ చాలిసాను ఉర్దూలోకి తర్జుమా చేశాడు ఈ రకమైన చర్య హిందూ ముస్లిం లను కలుపుతుంది అని అతని ఆశాభావం రెండు మతాలవారు హిందూ ముస్లిం సంస్కృతీ, నమ్మకాలను అర్ధము చేసుకుంటే  సఖ్యముగా ఉండగలరు అని అతని భావన,అబిద్ కు హనుమాన్ చాలీసా ఉర్దూలోకి తర్జుమా చేయటానికి మూడు నెలలు పట్టింది.ఇలాగే ఉర్దూ పుస్తకాలను హిందీ లోకి,హిందూ మతగ్రంధాలను ఉర్దూలోకి  తర్జుమా చేస్తే బావుంటుంది అని అతని అభిప్రాయము.
4.లూథియానా జైలులోనిఅన్ని కులాల ఖైదీలు ముస్లిం సోదరులకు సంఘీభావాన్ని తెలియజేయటానికి రంజాన్ నెలలో ఉపవాసదీక్షలో పాల్గొన్నారు అలాగే ముస్లిం ఖైదీలు హిదూ సోదరులతో పాటు దీపావళి సిక్కు సోదరులతో గురుపూరబ్ పండుగలను జరుపుకొని సర్వమత సౌభ్రాతుత్వాన్నిజైలు వెలుపల ప్రజలకు చాటిచెప్పారు
5. కొలాబాలోని గణేష్ ఉత్సవ్ మండల్ సభ్యులు వినాయక చవితి సందర్భముగా వేసిన పందిళ్ళలో ముస్లిం సోదరులు వారి బక్రీద్ ప్రార్ధనలు చేసుకోవటానికి అనుమతించారు ఎందుచేతనంటే ప్రక్కనే ఉన్న మదారస రహమతియ తాలిముల్  ఖురాన్ మసీదు ముస్లిం సోదరులు ప్రార్ధనలు చేసుకోవటానికి సరిపడినంత చోటు లేకపోవటము గమనించి వినాయక చవితి పందిళ్లలో ముస్లిం లు రార్ధన జరుపుకోవటానికి ఆహ్వానించారు ఈ విధముగా మతసామరస్యాన్ని కొలాబా ప్రజలు చాటి చెప్పారు. 
6. నిజమైన స్నేహానికి మతాలూ అడ్డుకాదని ఛత్తీస్ ఘడ్ లోని ఒక ముస్లిం యువకుడు ఋజువు చేశాడు సంతోష్ సింగ్ మరియు రజాక్ ఖాన్ తికారి ఇద్దరు మంచి స్నేహితులు దురదృష్టవశాత్తు సంతోష్ సింగ్ అనారోగ్యము పాలై చనిపోయినాడు అప్పుడు స్నేహితుడైన రజాక్ తన మిత్రుడి అంత్యక్రియలను హిందూ సాంప్రదాయము ప్రకారము నిర్వహించాడు అంతేకాకుండా స్నేహితుడి మరణానంతరము స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి పలువురికి ఆదర్శముగా ఉన్నాడు. 
7. 27 ఏళ్ల ఇలియాజ్ షేక్ తన భార్య నూర్జహాన్ పురిటి నొప్పులు పడుతుంటే ఒక ట్యాక్సీలో హాస్పిటల్ కు తీసుకు వెళుతున్నాడు  కానీ మార్గ మధ్యములోనే ఆవిడకు నొప్పులు అధికము అయినాయి అప్పుడు ఆ ట్యాక్సీ ద్రవర్ ఆవిడ  తన కారులో ప్రసవం అవటం ఇష్టము లేక బలవంతముగా వారిని దింపేశాడు ఆ దంపతులు అక్కడకు దగ్గరనే ఉన్న వినాయకుడి గుడికి వచ్చారు అక్కడి గుడిలోని ఆడవారు ఆవిడ పరిస్థితిని గమనించి వెంటనే గుడిలోనే మరుగు ఏర్పరచి ఆవిడ  సుఖ ప్రసవం అయేటట్లు సహాయము చేశారు ఆ సహాయానికి ప్రతిగా వినాయకుడి మందిరములో కాన్పు జరిగింది కాబట్టి  ఆ ముస్లిం దంపతులు పుట్టిన మగబిడ్డకు గణేష్ అని పేరు పెట్టారు
8 .లూథియానా కు సమీపములోని నాతోవాల్ గ్రామములో గల మసీదును హిందువులు సిక్కులు కలిసి బాగుచేయించారు ఖర్చు లో దాదాపు 65% హిందువులు సిక్కులు భరించారు అంటే మరమ్మత్తులకు అయ్యే కార్చి 25 లక్షలు అయితే అందులో 15 లక్షలు హిందూ, సిక్కు సోదరులు చందాలు వసూలు చేసి మసీదు మరమ్మతు కు  సహాయపడ్డారు ఆ ఊరిలో హిందూ,ముస్లిం సిక్కు మతాలవారు సఖ్యతగా కలిసి మెలిసి జీవిస్తారు అనటానికి ఇదే తార్కాణము. అలాగే హిందూ ముస్లిం లు గురుద్వారా మరమ్మత్తులకు సహకరిస్తారు. ఆ ఊరివాళ్ళు అన్ని పండగలను అంటే దీపావళి ఈద్, గురుపూరబ్ వంటి అన్నిపండుగలను అందరు కలిసి జరుపుకుంటారు.
9. కేరళ లోని మలప్పురం లో 18వ శతాబ్దము నుండి హిందు మతము కోసము ప్రాణాలర్పించిన అమరజీవికి  నివాళులర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ అమరజీవి పేరు కున్ హెలు ఆతను కోజికోడ్ ను పాలించే రాజు 290 సంవత్సరాలక్రితము మలబార్ పై దాడి చేసినప్పుడు ముస్లిం సోదరులతో కలిసి యుద్దములో పాల్గొన్నాడు పన్నుల వసూళ్లపై వచ్చిన విబేధాల వల్ల ఈ యుద్ధము ప్రారంభమయింది ఈ యద్దములో 42 మంది ముస్లిములతో పాటు హిందువైన కున్ హెలు కూడా మరణించాడు. అప్పటి నుండి ముస్లిములు ప్రతి సంవత్సరము వలియన్ గాడి  జుమ్మా మసీదు వద్ద పోగై ఈ అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటిస్తారు ఈ అమరవీరుని ఆ మసీదు లోనే సమాధి చేశారు ప్రార్ధనల సమయములో కున్ హెలు వారసులు కూడా హాజరు అవుతారు. 
10. మధ్య ప్రదేశ్ బర్వాని జిల్లాలోని సిన్ధవార పట్టణములో 75 ఏళ్ల సీతారాం అనే వ్యక్తి చనిపోతే ఆ ఊరిలోని హిందువులు ముస్లిములు కలసి అయన అంతక్రియలను గౌరవ ప్రదముగా నిర్వహించారు ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోయినా ఊరి  వారే సొంత కుటుంబ సభ్యులకన్నా ఏంతో  ప్రేమతో అయన అంత్యక్రియలను నిర్వహించారు. 
ఇవండీ మన దేశములోని వివిధప్రాంతాలలో మతసామరస్యము,మాట సహనమును ఎలియజేసే కొన్ని సంఘటనలు కానీ మీడియా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పబ్లిసిటీ చేయకపోవటం వల్ల ఇటువంటి గొప్ప సంఘటనలు అందరికి తెలియకుండా పోతున్నాయి కానీ మీడియా వారు రాజకీయవేత్తలు ఎక్కడైనా ఏ చిన్న కారణము చేత వివిధ మతాల మధ్య కొద్దిపాటి గొడవ జరిగినా దానిని భారీగా చిత్రీకరించి మైనారిటీలకు రక్షణ లేదు అని గగ్గోలు పెడుతుంటారు ఈ కలహాలను పెద్దవి చేయటానికి ప్రయత్నించేబదులు మతసామరస్యాన్ని చూపే పైన పేర్కొన్న సంఘటనలు లాంటి వాటికి ప్రచారము కల్పిస్తే మతసహనము మతసామరస్యము పెరుగుతాయి అన్ని మతాలవారు కలసి జీవించగలరు. 
***         

No comments:

Post a Comment

Pages