కావాలంటే...
పారనంది శాంతకుమారి
ఆహారం కావాలంటే అమ్మను అడగాలి
ఉద్యోగం కావాలంటే నాన్నను అవలోకించాలి
వికాసం కావాలంటే గురువును ప్రార్దించాలి
శాంతి కావాలంటే అమ్మను పూజించాలి
సౌఖ్యం కావాలంటే నాన్నను ధ్యానించాలి
వెలుగు కావాలంటే గురువును విశ్వసించాలి
ప్రేమ కావాలంటే అమ్మను అనుసరించాలి
ధైర్యం కావాలంటే నాన్నను అనుకరించాలి
సహనం కావాలంటే గురువును సేవించాలి
వెన్నెల కావాలంటే అమ్మఒడి చేరాలి
వేకువ కావాలంటే నాన్నజత చేరాలి
వివేకంకావాలంటే గురువుచెంత చేరాలి
***
No comments:
Post a Comment