కొత్త దంపతులు
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు.
ఆమె-
మాట నిలబెట్టుకోడు
అడిగినవి కొనిపెట్టడు
ఓ అచ్చటా ముచ్చటా లేదు
ఆయనకు నేనో వంటింటి కుందేలు అంతే
ఇష్టారాజ్యంగా తిరుగుతాడు..హుఁ..
అతడు-
అన్నింటికీ అలుగుతుంది
పర్సును చూసుకోకుండా కోరికల పడగ విప్పుతుంది
తనకేనా పండగలు..పబ్బాలు..చీరలు..నగలు..
తనకు నేనో ఏ టి ఎం ను అంతే
ఇంటికి రాణై నన్ను బంటును చేసింది..చ..ఛఁ
ఇద్దరూ-
నీ సమక్షంలో నన్ను మర్చిపోతా
నేనూ అంతే
నువ్వు లేకపోతే నేను శూన్యమే
నేను అంతే
పదమరి లోపలికి
పదండి.
కిల..కిల..గల..గల..
(పడగ్గది తలుపు మూసుకుంది)
***
Kottha dampathulu kavitha baavundhi
ReplyDelete