మేనక
(ఓ ఆధునిక కన్యక)
లక్ష్మణ్ భరద్వాజ్
ఆ తరగతి గదిలో దాదాపు ఓ ఇరవై, ఇరవైఐదు మంది వరకు ఉన్నారు అందరూ బాగా తెలివైనవాళ్ళు. వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా తర్ఫీదునిస్తున్నారు. ఆయా సబ్జక్టులలో నిపుణులైన అధ్యాపకులు.
వాళ్ళను తరచుగా చూస్తూ వీళ్ళు అందరూ మన కోచింగ్ సెంటర్ కి మంచిపేరు తీసుకువస్తారు.దాదాపుగా వీళ్ళంతా,చాలాబాగా చదువుతారు కూడాను, కాబట్టి మా సంస్థకి ఈ సంవత్సరం ర్యాంకుల పంటేనని అనుకుంటున్నాడు, డైరక్టర్ ధనంజయ్.
ఎలాంటి సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించగలరు, ఎంత క్లిష్టమైనా బాగానే అర్ధం చేసుకుని చదవగలరు, కావున వీరు తమ జీవితాలలో అత్యుత్తమ ఉద్యోగాలు పొందగలరని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహకుడు ధనంజయ్ ఆనందపడుతుంటాడు.ఆ హాలులో విద్యార్ధులను చూసినప్పుడల్లా !
ఒకరోజు ఉదయం ఆ క్లాసు ఆరు గంటలకే ప్రారంభించారు, కానీ ప్రారంభించిన గంట తర్వాతకు గానీ మహర్షి రాలేదు.చాలా ఆలస్యంగా వచ్చాడు అయినా అంతకముందు గంటసేవు చెప్పిన విషయం తాను ముందే చదువుకు రావడం వల్ల సునాయాసంగా అర్ధంచేసుకోగలిగాడు. మిగిలిన ఆలస్యంగా వచ్చిన కొంతమందికి కూడా సులబంగా అర్దమయ్యేలా వివరించ గలిగాడు.
ఆ రోజు మేనక కూడా చాలా ఆలస్యంగా వచ్ఛింది.ఉదయం విరామ సమయం పది గంటలకి. ఆ విరామం తర్వాత వచ్చింది కాబట్టి తనకి విరామం ముందు చెప్పిన విషయమేది అర్ధంగాక చాలా విచారంగా కూర్చుని ఉంది.
మేనకను గమనించిన ఇంద్రవదన్ నేనున్నాగా ! నీవెందుకలా? డల్ గా ఉన్నావు ? నేను ఆ క్లాసు వివరంగా చెబుతానని మాట ఇచ్చి, చాలా బాగా వివరించిచెప్పాడు. అప్పటినుండి వాళ్ళిద్దరు కొంచెం సన్నిహితంగా ఉంటూ,చాలామంచి స్నేహితులు అయ్యారు.
ఇంద్రవదన్ కి ప్రతీవిషయంలో తనకన్నా ముందుంటున్న వాడు టాపర్ అనిపించుకుంటున్నవాడు అయిన "మహర్షి" మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం రోజు, రోజుకి పెరిగిపోతున్నాయి.
ఈసారి ఎలాగైనా మహర్షిని ఓడించాలనుకుంటూ ప్రయత్నించడమే గానీ,ఇంద్రవదన్ వల్ల కావడం లేదు. అప్పుడే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.తను చేస్తున్న పని మంచిదా? చెడ్డదా? అని కూడా ఆలోచించకుండా? మేనకను ఆశ్రయించాడు ఇంద్రవదన్ !
మేనకతో , తనకీ మహర్షిమీద ఈర్ష్య ఉందనే,విషయం తెలియ నీయకుండా చాలా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు.
అవసరం,అవకాశం వచ్చినప్పుడు మాత్రమే చెబుదామని,అనుకుని మేనక ఏ విషయంలో డౌట్లు అడిగినా,గత కొద్దిరోజులుగా , నాకేం తెలియదని, ముభావంగా ఉంటున్నాడు.ఇంద్రవదన్.
అడిగిన ఏ విషయానికి సమాధానం చెప్పకుండా,దూరంగా ఉంటున్న ఇంద్రవదన్,మన టాపర్ మహర్షి ఉన్నాడుగా, అతన్ని అడుగొచ్చు కదా ! నా కన్నా తను చాలా బాగా చెబుతాడని సలహా కూడా ఇచ్చాడు.
మేనకకు,మహర్షి అంటే చాలాభయం. బాబోయ్ ! మహర్షినా ?అడగటం పోయి,పోయి బండరాయినా?
"ఢీ " కొట్టమంటున్నావు. నువ్వు చెబితే చెబుతానని చెప్పు. లేదంటే మానెయ్ ! కానీ దయచేసి ,ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వకు.
"మహర్షి " మనిషిచాలా మెత్తనైనవాడే! కానీ చూడ్డానికి చాలా గంభీరంగా, కనబడతాడు. అందుకే అందరూ భయపడతారు.అతనితో ఎవరూ సరదాగా,ఉండటంగానీ,స్నేహం చేయడం,గానీ చెయ్యరు.
ఇంద్రవదన్ చెప్పినట్టుగా మహర్షిని అడగాలంటే భయం వేస్తోంది. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే, ముందు అతనితో స్నేహం చేస్తూ ,సరదాగా ఉంటే బాగుంటుందని, నిర్ణయించుకుంది మేనక.
ఇంద్రవదన్ సూచనలు,సలహాతో, మహర్షితో సన్నిహితంగా ఉంటున్న మేనక, అనవసరంగా అతని అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ దగ్గర అవడం ప్రారంభించింది.
మహర్షి గారు ఈరోజు నా లంచ్ బాక్సు తీసుకొండి. మీకు పొటాటో ప్రై ఇష్టమట కదా ! దాహం బాగా వేస్తున్నట్లుంది.ఇదిగోనండి! నా బాటిల్లో కూల్ వాటర్ ఉంది. మీ దగ్గర వాటర్ లేనట్టుగా ఉంది. మీరు ఈ రోజు లంచ్ కోసం,అన్నానికి బదులు, ఇడ్లీ తెచ్చుకున్నారా ? ఇంట్లో ఆడవాళ్ళెవరూ, లేరా ? అంటూ ఇలానే ప్రతీ విషయంలో కలుగ చేసుకుంటోంది.
వావ్ ! మీ షర్ట్ , చాలా బాగుంది. పుట్టినరోజా ? మాకు పార్టీ లేదా ? మీ వాకింగ్ స్టైల్ ,భలే ఉంటుందండీ. మీరు చాలా హేండ్సమ్,గా ఉంటారు. మీ గొంతు వింటుంటే మళ్ళి,మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇలా పొగడటం ప్రారంభించింది మేనక.
మహర్షి చాలా తెలివైనవాడే గానీ, ఆడవాళ్ళకు కొంచెం దూరంగా ఉండేరకం కదా ! అందుకే చాలా కాలం వరఠూ మేనకను పట్టించుకోలేదు. మేనక తనవెంట పడుతున్నా, అనవసరంగా తన ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ,జోకులు వేస్తున్నా,తనని ఆట పట్టిస్తున్నా, తనని కాదన్నట్టుగా ఉంటున్నాడు మహర్షి.
మేనక,తనని, మహర్షి అస్సలు పట్టించుకోవడంలేదనే కోపంతో, రగిలిపోతూ, ఇంద్రవదన్ తో నువ్వేమో !నా విషయంలో అన్యాయం చేస్తున్నావు. ఇదివరకు అన్ని విషయాలు బాగా వివరించి చెప్పేవాడివి.గానీ ఇప్పుడు ఏ విషయంలో ,డౌట్లు (అనుమానం) వచ్చినా నిన్నడుగుతుంటే, క్లారిఫై చెయ్యకుండా , ఆ మహర్షిని అడుగు అంటున్నావు.
ఆ మహర్షేమో ? నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు,సరికదా కనీసం నా వైపు కన్నెత్తి చూడనైనా చూడటంలేదు ఏ ఆళ్ళవాళ్ళుని, ఎప్పుడూ, చూడలేనట్టు అస్సలుఏదో ? ఆడవాసనే , తగలనివాడిలా ? ఉంటున్నాడు.
ఇలా ఐతే నేను బాగా చదవలేను.
నేనీ కాంపిటేటివ్ , పరీక్ష రాయలేను. నాకేం ఈ ఉద్యోగం రాదు.నేనలా ఫెయిలైతే, ఉద్యోగం రాకపోతే, దానికి కారణం నువ్వే,నువ్వే అంటూ ఇంద్రవదన్ మీద తన కోపాన్ని ప్రదర్శించి.ఇంద్రవదన్ తో గొడవపడి అక్కడ్నుండి దురుసుగా వెళ్ళిపోబోతోంది, మేనక.
ఆగు మేనకా ! ఆగు , నీకో సలహా! నీవు మన కోచింగ్ సెంటర్లో ఉన్న అందరి ఆడవాళ్ళకంటే చాలా,చాలా అందంగా ఉంటావు. కాబట్టి నీ అందంతో అతన్ని ఆకట్టుకోవచ్చు కదా?,చూడు ఎలాంటి మగవాళ్ళైనా అందానికి దాసోహం కానివారులేరు.
భారత,రామాయణ కాలంలో ఉన్న బ్రహ్మర్షి ,అన్ని ఇంద్రియాలను జయించినవాడు, "విశ్వామిత్రుడే " , దేవలోకపు అత్యంత సౌందర్య రాశి "అప్సరస " మేనకకు, దాసోహం అయ్యాడుగదా ? ఈ మహర్షి ఏ మాత్రం ఓ సారి ఆలోచింఛుకో అన్నాడు.
ఇంద్రవదన్ అలా అనగానే మేనకకు ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. శరీరం ఆపాదమస్తకం కంపించింది.గుండె వేగంగా కొట్టుకుంటూ ధైర్యం మరింత తగ్గింది.
ఎందుకంటే మహర్షి అలాంటివాడు కాదు. అందానికి,ఐశ్వర్యానికి లొంగేరకం అసలే కాదు.చాలా స్ట్రిక్ట్.నిత్య బ్రహ్మచర్యం పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ,సాత్వికాహారం మాత్రమే తీసుకుంటూ,భూశయనం, చేసే సాధువుల్లా, మాలధారణచేసి, దీక్షలో ఉన్న భక్తుడిలా ఉంటాడు.
అలాంటి,అతన్ని నా వశం, చేసుకోవడం చాలా కష్టం, అంత సులువేం కాదు.కానీ ఇంద్రవదన్ , నీ సహాయం,నీ సూచనలు, సలహాతో ప్రయత్నం చేస్తా ! నాకు ఉద్యోగం,చాలా అవసరం.తనని నేను లొంగదీసుకోడానికి నా ప్రాణత్యాగానికైనా వెనుకాడను అని శపధం చేసింది మేనక.
సభాష్!అలా ఉండాలి కసంటే అదీ తనవల్ల నీకు,నాక్కూడా ఉపయోగమే ! తనని , మనమేం పాడుచేయడం లేదుగదా...? ఏదో మన స్వార్ధంకొద్దీ తనని మన అనుచరుడిగా మార్చుకుంటున్నాం అంతే గదా ? ఇందులో తప్పేం లేదు. వెళ్ళు ప్రయత్నించు "ఆల్ ద బెస్టు "అని ఏదో పబ్లిక్ ఎగ్జామ్స్ కి వెళ్ళే వాళ్ళకి విషెష్ చెబుతాం కదా అలా చెప్పాడు
రేపే నా ప్రణాళిక అమలు చెయ్యి.అతను క్లాస్ ఐపోగానే ఎన్.టీ.ఆర్.మినీ స్టేడియం దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి ,చదువుకుంటూ ఉంటాడట. అని ఇంద్రవదన్ మహర్షి ఉండే , అడ్రస్సు గురించి చెప్పాడు.
ఆ పార్క్ , మన టౌన్ కి , చాలా దూరంలో ఉందని సాధారణంగా అక్కడకి ఎవ్వరూ రారని, చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టే తాను అక్కడ , ఒక్కడే ఏకాంతంగా చదువుకుంటూ ఉంటాడట.
నన్ను గతంలో రమ్మనమని అడిగాడు చాలాసార్లు . ఎక్కడికి అంటే ఆ పార్క్ ఎడ్రస్ నాతో చెప్పాడు. కానీ నేను ఎప్పుడూ, చూడలేదు. ఎప్పుడూ వెళ్ళలేదు కూడా !
నీ అవకాశం చూసుకుని వెళ్ళు. మేనకా ! అని మేనకకు, మహర్షి ఏకాంతంగా, చదువుకునే స్థలం , అడ్రస్ వివరంగా చెప్పాడు.
మేనక, ఇంద్రవదన్ చెప్పిన మాట ప్రకారం , చాలా అందంగా తయారై , మహర్షి ఉండే , పార్కుకి మద్యాహ్నం , రెండూ-మూడు గంటల ప్రాంతంలో వెళ్ళింది.
అది అసలే గ్రీష్మ ఋతువు. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. దానికి తోడు అంత చల్లని నీడనిచ్చే పచ్చని చెట్లు ఎన్ని ఉన్నా కనీసం ఒక్క ఆకు కూడా కదలడం లేదు. కనీసం చిరుగాలి కూడా వెయ్యడం లేదు.
రక రకాలు పూలమొక్కలు, పరిమళ భరిత, పరిమళాన్ని , వెదజల్లడానికి బదులు కనీసం కమ్మని సువాసన కూడా , రావడం లేదు.
ఏం మాయో ? తెలియదు గానీ, వినాశకాలం సమీపిస్తే విపరీత బుద్ధి పుడుతుందట. అలాగే తనకు మన్మధుని ఆశీస్సులో , లేక , ఆ దేవలోకపు ఇంద్రుని, ఆశీస్సులో తెలిరదుగానీ , ఆ సమయంలో వచ్చిన చిరు ఆలోచనను అమలు చేసింది మేనక !
పుస్తకంలో తలదూర్చి చాలా ఏకాగ్రతతో చదువుతున్న మహర్షిని, చూసి ఆనాటి కఠినమైన తపో దీక్షలోఉన్న , విశ్వామిత్రుడులా భావించి, మేనక చాలా దూరంగా ఉంటూ గమనిస్తోంది.
మేనక ,తనతో తెచ్చుకున్న మేకప్-కిట్ తీసి, పరిమళ భరిత సెంటు గాల్లోకి కొట్టింది. అదలా , మహర్షి ముక్కు వరకూ చేరేలా ప్రయత్నించింది. అలాగే బ్యాటరీ ప్యానును, ఆన్ చేసి చిరుగాలి అతనికి మాత్రమే తగిలేలా చూసింది.
తన చేతికున్న గాజులు,కాళ్ళకున్న అందెల మువ్వలు, మరింత శబ్ధం చేసేలా నాట్యం చేసింది.
ఏకాగ్రతతో పుస్తక పఠనంలో లీనమైన, మహర్షికి, సన,సన్నగా ఈ చప్పుళ్ళు, చెవులకి చేరుతున్నాయి. ఇంకేముంది,ముక్కుకి తాకిన సువాసనకు,చెవులకు చేరుకున్న ధ్వనులకు , మహర్షి ఏకాగ్రతకు భంగం ఏర్పడింది.
ఇంతలో ప్రక్రృతి సహకరించి, మేనక తనపై ఉన్న పై కండువా ఎగిరి దూరంగా పడింది.
మహర్షి మెల,మెల్లగా తన చేతిలో ఉన్న పుస్తకం , పక్కన ఉంచి తలెత్తి ఎదురుగా చూసాడు.
ఇంకేముంది ? తనకి అతి తక్కువ దూరంలో మేనక నిలబడి ఉంది.
మేనక, సిగ్గుతో వెనుదిరిగి పైకండువా, ( చున్నీ) కోసం, తడబడుతూ, అడుగులు వేస్తూ, తనని చూస్తున్నాడా ? లేదా ? అని వెనుదిరిగి చూస్తోంది. కనులు, మిల, మిలలాడిస్తోంది. పెదవులను,నాలుకతో తడుపుకుంటోంది. గాలి మరింత రేగింది. ఆమె పరికిణి, చక్రంలా తిరిగి పైకిలేచింది.
టాపర్ మహర్షి మనస్సు వివశమయ్యింది. తన స్వాధీనం తప్పిన మనస్సులో, కామ వికారం పుట్టింది. ఎంతో నియమంగా, ఉంటూ ఏకాగ్రంగా ,పట్టుదలగా , ఉద్యోగ సాధనకోసం ,తీవ్రంగా ప్రయత్నిస్తున్నానే? పరాయి ఆడపిల్లలవైపు , కనీసం కన్నెత్తి, చూడని నేను, మానవ సంచారం లేని , ఈ పార్క్ లో, ఏకాంతంలో, పైటజారిన సుందర కోమలాంగి మేనక కనబడే సరికి సర్వమూ మర్చిపోయి, ఈమె వశమయ్యానేమిటి, అనుకుంటూ మేనకను చేరపిలిచాడు.
మేనక సిగ్గుతో, భయపడుతూన్నట్లు, రాజహంసలా, నెమ్మదిగా అడుగులో, అడుగు వేస్తూ, మహర్షిని సమీపించింది.
మహర్షి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు అంతే ఆ బలహీన క్షణం మొదలు ఇక మేనకను విడిచి పెట్టక ఆమే జీవితమని ఆమెలేని జీవితం వ్యర్ధమని చదివే చదువు మానేసి ఉద్యోగ సాధన లక్ష్యం కూడా మర్చిపోయి పిచ్చివాడిలా తిరగడం మొదలు పెట్టాడు.
చివరి పరీక్షలతో పాటు ఐ.ఏ.ఎస్.మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూ) కూడా నిర్వహించి, తుది ఫలితాలు ప్రకటించారు. ఇంద్రవదన్ జిల్లాకలెక్టర్ గా నియమించబడ్డాడు.
ఇంద్రవదన్,తర్వాత కాలంలో, తెలుసుకున్నాడు.తనకి దూరపు బంధువు, పిన్ని కూతురే, వరసకి చెల్లెలయ్యే ,మేనక ద్వారా తన శత్రువుని, తుది పరీక్షలకు వెళ్ళనీయకుండా చేసినందులకు సంతోష పడ్డాడు. కానీ తనవల్ల మేనక జీవితం నాశనమయ్యిందని బాధపడ్డాడు.
అందుకే, మేనకను, తన సొంత బావకి ఇచ్సి పెళ్ళి చేసాడు. ఆమెకు ఏ లోటు రాకుండా ,ఆర్ధిక అవసరాలలో ఆదుకుంటున్నాడు కూడా ! మేనక తన భర్తతో కలిసి, సంసార జీవనం ఆనందంగా సాగిస్తూ , పిల్లలను చూసుకుంటోంది. తన అర్హతలకి తగిన ఉద్యోగం చేసుకుంటోంది. చదివిన చదువుకి విలువనిస్తూ, ఉపాది సంపాదించింది.
టాపర్ మహర్షి పిచ్చివాడై, కోచింగ్ సెంటరు చుట్టూ, తిరుగుతున్నాడు. అతనలా , అవడానికి కారణం తెల్సుకుని, ధనంజయ్ కొంత ఆర్ధిక సహాయం చేసి వైద్య సేవలు పొందేలా, మహర్షి మరలా , మామ్మూలు మనిషీ కావడానికి చాలా ప్రయత్నం చేసాడు.
మొత్తానికి, చాలా కాలం పట్టింది. మహర్షి తేరుకున్నాడు.
కామాన్ని జయించలేక, తన జీవితాన్ని పాడు చేసుకున్నానని, చాలా బాధపడ్డాడు. తనతోనె ఉంటూ, తన శతృవుగా , ఉండే ఇంద్రవదన్ ని గుర్తించలేకపోయానని, విచారించాడు.
చివరికి తనకున్న, అపార పాండిత్యంతో , ధనంజయ్ ! గారి ప్రోత్సహంతో, గ్రూప్స్ కి, కోచింగ్ ఇస్తూ, కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ, జీవిస్తున్నాడు.
***
పాఠకులకు మనవి: మన దగ్గరే, ఉంటూ, మనకే, గోతులు తీసేవారి, విషయంలో , జాగ్రత్తగా, కనిపెట్టుకుని, వారిబారిన పడకుండా, జాగ్రత్త, వహించ గలరు.
"మేనక " (ఓ ఆధునిక కన్యక) లక్ష్మణ్ భరధ్వాజ్ గారి రచన చదువుతున్నంతసేపు ఏంటిలా పిల్లల ఆలోచనలు అనిపించింది ఉన్నత చదువులుచదువుతున్న మేనక మహర్షి స్నేహం కోసం ఇంద్రవదన్ చెప్పిన సలహా పాటించాలనుకోవటం అంత విచక్షణ మరచి ప్రవర్తించటం ఏంటో అనిపించింది..కానీ *పాఠకులకు మనవి * చదివినతరువాత కథద్వారా చక్కని మెసేజ్ ఇచ్చేందుకు ఆపాత్రలు అలా జీవించాయని అర్ధమయింది..బాగున్నదండి.అభినందనలు ..
ReplyDelete