శివం - 49 - అచ్చంగా తెలుగు
శివం - 49
రాజ కార్తీక్      

భక్తులారా ! ఇప్పటిదాకా కొన్ని కథలు విన్నారు కదా.  మరికొంతమంది భక్తుల కథలు మీకు చెప్తాను. శ్రద్దగా విని వారి వలె నన్ను చేరుకోవటానికి దారులు వెతకండి.
మీ జీవితంలో ఏదో జరిగిందని బాధపడకుండా ,నా పై నమ్మకం ఉంచి నన్ను శరణ వేడి, మీ జన్మ సార్ధకం చేసుకోండి.  అటువంటి నమ్మకముంచిన మరొక భక్తురాలి కధే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.‌

అవును తను కూడా నా భక్తురాలే, తన పేరు కల్పనభారతి .....చిన్ననాటి
దురదృష్టాలు తనని వెంటాడినా ,తను అనుకున్నది నిజమన్న ఒక మొండి వైఖరి తో తన జీవితమంతా బ్రతికింది. పరులను తన ఆత్మ గౌరవం అనే పేరుతో అవమానిస్తూ ఉండేది.
తనకున్న సంగీత సాహిత్య పాండిత్య౦తో సాటి వారికీ సహయం చేస్తానని వారి అభ్యర్ధలను  అవహేళన చేసేది. నిండా గర్విష్టి, తన లౌక్యం తో తెలివితో ఎదుటివారినజ ఇరకాటంలో పెట్టేది. తన అవసరాల కోసం నా మీద ప్రమాణం చేసి కూడా నేను ఎప్పుడూ చేయలేదు అని  అబద్దాలు ఆడేది. తన మీద ప్రేమ పెంచుకున్న వారిని చులకనగా చూసేది. తనకి ఒక నీతి, బయటవారికి ఒక నీతి అని అనేది. తనకి  సహాయం చేసిన వారిని కూడా నువ్వు చేసింది ఏముంది అని అవహేళన చేసేది.

ఒకరోజు అక్కడ ఒక సంఘటన జరుగుతోంది...
"ఇలా చేయటం సబబా అమ్మ "అని ఒకతను అంటున్నాడు.
కల్పన మాత్రం "అది నాకు సంబధించిన విషయం ..నా ఆత్మ గౌరవం అది " అనేది.
అతను మాత్రం "తల్లి చిన్నప్పటి నుండి నీకు సరియైన తల్లి దండ్రులు లేకపోవటం వల్ల నువ్వు ఇలా అయ్యావు ,నీవు మాట్లాడుతున్నది తప్పు ఒప్పో కూడా తెలియని స్తితి లో ఉన్నావు. ఎదుట వారికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి చూడాలి తల్లి ,నువ్వు చేసిన పొరపాటు వల్ల వేరొకరు బాధపడకూడదు. నీ చర్యలవల్ల లాభం నీది ఐనప్పుడు, నీ ఇష్టం కూడా నీదే కావాలి కానీ వేరొకరికి అది వర్తించదు." అన్నాడు.

ఐనా కల్పన మాత్రం తన సహజ ధోరణే సరైనదని వాదించి, ముర్ఖంగా మాట్లేది గెలిచేది.
అతను "తల్లి, నాకు నీ మీద కోపం లేదు. జాలి మాత్రమే ఉంది. గుర్తుంచుకో అమ్మ ఈరోజు నువ్వు చేసింది నీకు అర్ధం కాకపోతే, అది నీ బిడ్డ కు జరిగితే తెలుస్తుంది ,ఇది శాపం కాదు.  అమ్మ ,నీలాంటి వాళ్ళకి తెలియలింటే అలా
జరిగితేనే తప్పు అర్ధం అవుతుంది,మరొకరికి చేయకుండా ఉంటారు. " అన్నాడు‌.

కల్పన మాత్రం " నన్ను అంటావా, నా బిడ్డను అంటావా , నా మీద జాలి చూపించటం ఏంటి "అని కటువుగా అనేది.

అతను "నీ లాంటి మానసిక వికలాంగుల మీద జాలి చూపించటమే నాకు తెల్సు " అన్నాడు.
కల్పన భర్త మధ్యలో వచ్చి ఏదో అనబోయేసరికి ..
"నీలాంటి తల్లిని కొట్టినవాడిని చూస్తేనే సర్వ పాపాలు వస్తాయి. గుర్తు ఉందా, నీవు నీ తల్లిని కొడుతుంటే, అడ్డు వచ్చిన వాడిని నేను .మేము కల్పన తల్లిని ఏమి అనలేదు," అన్నా కానీ, "పోరా కామాంధుడా ,శునకమా ,"అంటూ ఎదో
తెలిసిన వాడిలా తిట్టసాగాడు.

అతను "ఏదో పోలిక చెప్పాడు, అదేంటి అమ్మా నువ్వు చెప్పేది నీకే చెపితే నచ్చలేదా ?..నీవు రాజు అయితే గనక నీ కుటుంబానికి మాత్రం వేరే శిక్ష స్మృతి అమలు చేస్తావా " అన్నాడు‌.

ఇక ఏమి మాట్లాడలేని కల్పన ఆత్మ గౌరవం అని మొదలెట్టి అతన్ని అవమానించి పంపింది.
మరొకామె  " కొద్దిపాటి పాండిత్యం ఉందని  నీతులు మాట్లాడి, అవి మాకు మాత్రమే నీకు కాదా అంటున్నావు "అని రగడ చేసి వెళ్ళింది.
ఇవి ఏమి పట్టించుకోని కల్పన ...తనకున్న అహంకారాన్ని ఆత్మగౌరవం అనుకుంటూ బతకసాగింది.
"కల్పన భారతి నీకు స్వార్ధం ఎక్కువ. అంతా నీకే  తెల్సు అని అంటావు. మనిషిని గిల్లి నా మానన నేను ఉన్నా, నీకేంటి అంటున్నావు. ఇది తెలివి అనుకోకు," అని తన అక్క లాంటి ఒక ఆమె అంటున్నా ..అదే ధోరణి.
రోజురోజుకి కల్పన  ధోరణి ఇంకా భరించలేనట్లు తయారయ్యింది.
"ఏదో చిన్నపాటి  కొలువు ఉన్నందుకే ఇంత గట్టి స్వభావం ఉంటే ,ఇక ఈమెకు దేవుడు అన్ని ఇచ్చి ఉంటే  రాజుగార్ని సైతం ఒక ఆట ఆడించేది "అంటున్నారు ఎవరో.

"స్వార్ధం ఉండవచ్చు గాని ఏదీ కూడా ఒప్పుకోలేని మనసు ఎవరికి కావాలి ?
,ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి దేవుడే చేస్తాడు ,ఒక మంచివాడి కన్నీరుకు
కారణం తను. ఆ కన్నీటికి సమాధానం చెప్పాలి తను "అంటున్నారు మరికొంతమంది.

కానీ కల్పనది తీయని స్వరం. అక్కడే ఉన్న నా ఆలయం లో సంగీతం నేర్పడం తన కొలువు. తన గానానికి ఎన్నో సార్లు పరవశించాను. గానంలో లీనమయితే తను నాకు స్వరభిషేకం చేసేది. తను పాడటమే కాకుండా, తన విద్యార్దులను సైతం శ్రావ్యంగా పాడించేది.

నేను ఎప్పుడూ భక్తులలో మంచి మాత్రమే చూస్తాను. అది పెంపొందించుకుంటూ ఉండాల్సిందే మీరే. తన కచేరిలతో, తన స్వర సమ్మేళనంతో ,ఎంతో శ్రావ్యంగా పాడేది. తన పాట ఎక్కడ ఉన్నా నేను వింటాను. అందుకే  నా యందు నిమగ్నo అయ్యినందున తన భక్తి మధురిమకు పరవశించే వాడిని. 
 కానీ మళ్ళీ కచేరి అవ్వగానే మాములుగా తన పద్దతిలో మొండి కఠిన వైఖరి అవలంబించేది. ఎదుటవారు చెపితే వినే లక్షణం లేనందువల్ల తనకు ఉన్న కొద్దిపాటి ఆత్మీయులను కూడా దూరం చేసుకున్నది. కానీ తనకు ఎక్కడో నేను అంటే చాలా భక్తి‌. ఆ భక్తిని తన మూఢ వైఖరి తో మూసివేసింది. తెలిసో తెలియకో నా పూజ చేసిన వారికీ ఫలితం రాక మానదు.  తను చేసిన తప్పులను క్రమేణా తెల్సుకుంటూ అర్ధం చేసుకున్నా, యధాతథంగా మళ్ళీ తన స్వభావాన్ని వీడ కుండా ఉండేది.

ఇంతలో వచ్చింది హఠాత్తుగా తన జీవితంలో కోలుకోలేని కబురు.
ఒక ప్రమాదంలో  తను కట్టుకున్న భర్త ,తన సంతాన్ని పోగొట్టుకుంది.
గుక్కపట్టి ఏడ్చినా, గుండెలు బాదుకున్న, ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఇప్పుడు తాను ఒంటరి.
తనకి దూరమైనా తన కుటుంబాన్ని తలచుకొని ముభావంగా ఉండేది. తన కోసం ఉన్నది నేను ఒక్కడినే.
(సశేషం)

No comments:

Post a Comment

Pages