అయాచిత వరం
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఓ అనుకోని అతిథీ
నా మనసులోకి ఎలా ప్రవేశించావోగాని
నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే గిరికీలు కొడున్నాయి
నా గురించి మాత్రమే ఆలోచించే నేను
అనుక్షణం నీకు సంబంధించిన ఆలోచనల్తో
తలమునకలవుతున్నాను.
నీకిష్టమైనది
నువ్వభిమానించేది
నీకునచ్చేదీ
నా అభిరుచులైపోయాయి.
దీన్ని ఆకర్షణ అంటారు కొందరు
ప్రేమంటారు మరి కొందరు
అలౌకికం, అనిర్వచనీయం అంటారు ఇంకొందరు
ఏదైతేనేం నాకిదో అదృష్టం
భగవంతుడు నాకు మాత్రమే ఇచ్చిన అయాచిత వరం!
***
No comments:
Post a Comment