నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"బదిలీ అయ్యిందే భామామణి!"   - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"బదిలీ అయ్యిందే భామామణి!"  

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) - "బదిలీ అయ్యిందే భామామణి!"
శారదాప్రసాద్ 

చిరంజీవి లలితా జ్యోత్స్న నా తల్లి తండ్రులకు మొదటి మనవరాలు కానప్పటికీ ,కుమారుడి కూతురు హోదాలో  చిన్న జమిందారిణి లాగా పెరుగుతుంది, పెంచుతున్నారు.నాకు పసిపిల్లలను ఎత్తుకొని ముద్దాడటం అలవాటే!మా అక్కయ్య పిల్లలను,అంటే మేనకోడలిని,మేనల్లుళను కూడా బాగా ఎత్తుకొని ఆడించేవాడిని!ఒకవారం రోజులు నా చిన్నారి కూతురితో ముద్దు ,మురిపాలను తీర్చుకొని,సెలవు అయిపోవటం వలన ,గుండె నిండా బరువుతో మళ్ళీ ఉద్యోగ నిమిత్తం ముమ్మిడివరానికి వెళ్లాను!అప్పుడు మా దంపతుల వయసులు 23,20 ఏళ్ళు మాత్రమే!నా కూతురు మా అమ్మగారికి ముద్దుల మనవరాలు అయింది!ఆమె ఒళ్లోనే పెరిగింది.నేను ఎక్కువకాలం సమిష్టి కుటుంబంలోనే ఉండటం చేత ,నా చెల్లెళ్లు  కూడా జ్యోత్స్న ను బాగా చూసుకునేవారు .తండ్రి అనే కొత్త హోదా వచ్చింది!బాధ్యత పెరిగిన భావన దానంతట అదే వచ్చింది!ఇప్పటిలాగా ఫోన్స్ లో మాట్లాడటానికి అప్పుడు సౌకర్యం లేదు!బ్యాంకు కు ఫోన్ చేసినా ,అంత స్వేచ్ఛగా మాట్లాడటం కుదిరేది కాదు!ఎక్కువగా,ఉత్తరాల ద్వారానే క్షేమ సమాచారాలను తెలుసుకునే వాళ్ళం !నేను వ్రాసిన ఉత్తరాలన్నిటినీ నా భార్య చాలా కాలం పదిలంగా దాచుకుంది!తర్వాతి రోజుల్లో ,పిల్లలు పోస్ట్ ఆఫీస్ ఆట ఆడుకుంటామని,ఆ ఉత్తరాలన్నీ ,నా భార్యకు తెలియకుండా చుట్టుపక్కలవారికి బట్వాడా చేశారు! కొంతమంది నవ్వుతూ తిరిగి ఇచ్చారు!నవ్వటం ఎందుకంటే,అందులోని విషయాలను చదివి ఉంటారు కనుక!ఇంటి మీద ధ్యాస ఎక్కువైంది!ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను!నా పరిస్థితిని గమనించిన మేనేజర్ గారి భార్య,మేనేజర్ గారికి చెప్పి ప్రతి పదిహేను రోజులకు నన్ను గుంటూరు పంపించేది!ఆమె పేరు శ్రీమతి సూర్యకాంతం !ప్రఖ్యాత రచయిత,ప్రయోక్త ,మిత్రుడు శ్రీ జంధ్యాల గారి తల్లి పేరు కూడా సూర్యకాంతమ్మ గారు!జంధ్యాలను ఎవరైనా,మీ అమ్మగారి పేరేమిటి అని అడిగితే చెప్పటానికి భయపడేవాడట!ఆ రోజుల్లో సినీ నటీమణి సూర్యకాంతం గారి పేరు అలా హడలెత్తించింది!మా మేనేజర్ గారి భార్య పేరుకు మాత్రమే సూర్యకాంతం!ఆమె తత్త్వం సూర్యకాంతం వేసే గయ్యాళి వేషాలకు పొంతన ఉండేది కాదు !నిజానికి ఆమె చంద్రకాంతం!ఆ చల్లని చూపుల్లో కనిపించే ప్రేమామృత వర్షం ఎక్కువగా నా పైనే కురిపించేవారు!ఇంతలో మేనేజర్ గారి పెద్దమ్మాయి పెళ్లి నిశ్చయమైంది!ప్రతి చిన్న విషయానికి నన్ను పిలిపించేవారు.పెళ్లి వైభవంగా జరిగింది! పెళ్లి కొడుకు వాళ్ళది ర్యాలీ!ర్యాలీలో నిద్ర చేస్తే ,వెంటనే అనుకున్న చోటికి బదిలీ అవుతుందని అక్కడి ప్రజల నమ్మకం!పెళ్లి సందర్భంలో నేను కూడా ర్యాలీకి వెళ్ళటం జరిగింది!నిద్ర కూడా చేయాల్సి వచ్చింది!అంతా కాకతాళీయంగా జరిగింది.పెళ్లి పనులు కాగానే,ముమ్మిడివరానికి వచ్చాను!ఆశ్చర్యం!నన్ను గుంటూరు రీజియన్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా బదిలీ ఉత్తర్వులు వచ్చాయి!నా ఆనందానికి అవధులు లేవు!రిలీవ్ అవయ్యేలోపల తూ .గో. జిల్లా మొత్తం ఒక చుట్టు చుట్టి  వచ్చాను!కోటిపల్లి,మురమళ్ళ రేవులు ,కొబ్బరి తోటలు ....అవన్నీ నన్ను మురిపించాయి!వదిలి వెళ్లాలంటే బాధ,వెళ్లకపోతే భార్య,పిల్ల మీద బెంగ !ఆఖరికి మే నెలలో నన్ను గుంటూరు రీజియన్ కు రిలీవ్ చేశారు!ఒక వారం రోజులు జాయినింగ్ టైం ఉండేది!దాన్ని పాత మిత్రులతో కలుస్తూ హాయిగా కాలం గడిపాను.గుంటూరు రీజినల్ మేనేజర్ నన్ను పొన్నూరు శాఖకు బదిలీ చేశారు!రోజూ గుంటూరు నుంచి పొన్నూరుకు shuttle సర్వీస్ చేసేవాడిని!నెమ్మదిగా యూనియన్ కార్యకలాపాల్లో చురుగా పాల్గొనే వాడిని!మా నాయకుడు శ్రీ దువ్వూరి కృష్ణమూర్తి గారు ,నా అవసరాన్ని గుర్తించి ఆనతి కాలంలోనే గుంటూరు ,కొరిటెపాడు శాఖకు బదిలీ చేయించారు.శ్రీ దువ్వూరి కృష్ణమూర్తి గారి మీద భయమో లేక భక్తో నాకు తెలియదు కానీ,అప్పటి మేనేజర్ బలరామమూర్తి గారు నన్ను అతి గౌరవంగా చూసేవారు!అప్పుడు నాకు ఇంకా 25 ఏళ్ళు నిండలేదు!హేమాహేమీలున్న గుంటూరు రీజియన్ కు నన్ను కోఆర్డినేషన్ committee చైర్మన్ గా ఎన్నుకున్నారు .అప్పుడు నేటి ప్రకాశం జిల్లా కూడా గుంటూరు రీజియన్ లోనే ఉండేది. నేనంటే దువ్వూరి కృష్ణమూర్తి గారికి అమితమైన ప్రేమ!ఆ రోజుల్లో నేను చాలా shy గా ఉండేవాడిని. కృష్ణమూర్తిగారు ఏదైనా సమావేశాల్లో చెబితే,అది నాకు నచ్చకపోతే ,విడిగా ఉన్నప్పుడు  ఆయనకు అదే విషయాన్ని చెప్పేవాడిని!అందుకు కృష్ణమూర్తి గారు,"నలుగురిలో చెప్పలేని అభిప్రాయం ఉండటం వలన ప్రయోజనం ఏముండదు!ఆ అభిప్రాయం నీలోనే చచ్చిపోతుంది!"అని చెప్పారు.ఆ మాట నాకు జీవితాంతం ఇన్స్పిరేషన్ ఇచ్చింది!అప్పటినుంచే ,నేను సిగ్గులేకుండా (అదేనండి!సిగ్గుపడకుండా) మాట్లాడటం నేర్చుకున్నాను!నా వెనక జనం పెరుగుతున్నారు,నన్ను ఒక నాయకుడిగా గుర్తించారు! నాయకుడంటే ముందు ఉండేవాడని కొందరు చెబితే,మరికొందరు నాయకుడంటే నడిపించేవాడని మరికొందరి అభిప్రాయం!నేను రెండినీ అనుసరించేవాడిని!మనం చెబితే జనం వినాలి,అది నాయకత్వ లక్షణం!జనం చెబితే మనం వింటే జనం నాయకులవుతారు!బదిలీ అయ్యిందే కానీ ,భామామణితో ఎక్కువ టైం గడపటానికి టైం ఉండేది కాదు.మరికొన్ని కబుర్లు ,మరొక సారి!

***

2 comments:

Pages