ఈ దారి మనసైనది -17 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 17
అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి వెళ్తారు అందరూ.)  
ఉదయం లేచేసరికి ట్రైన్ మహారాష్ట్ర కొండల్ని దాటుతోంది.

కాలకృత్యాలు తీర్చుకొనిటిఫిన్ చేసి .... మళ్లీ అదే సందడి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పడు ఆడబోయే గేమ్లో ... మెడిసిన్తో టన్ లేని క్వొశ్చన్స్ వేసుకుంటూ ఆన్సర్లు చెప్పకోవాలనుకున్నారు.
'ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అన్నది ఎవరు?" అని ప్రశ్నించాడు దినేష్
అక్కడున్న వాల్లెవరూచెప్పలేకపోయారు.
త్యాగరాయిఅంది దీక్షిత
క్లాప్స్ కొట్టారు....
మన జాతీయగీతం రచించిన కవి?" అడిగాడు అనురాగ్ మన్విత వైపు చూస్తూ ఆమె చెప్పలేకపోయింది.
రవీంద్రనాద్ఠాగూరు” అన్నది దీక్షిత.
మళ్లీ క్లాప్స్ .
"మహమ్మద్ ప్రవక్త ఏ తెగకు చెందిన వాడు?"అన్నాడు ఆకాశ్ సౌమ్య కానిమన్విత కాని చెప్పలేక పోయారు.
కురైష్తెగకి చెందినవాడుచెప్పింది దీక్షిత
"వజ్రాలు ఏ ఎడారిలో దొరుకుతాయి?" అడిగాడు దినేష్
సౌమ్య ఏదో చెప్పింది. అది తప్పు అయింది. మన్విత కూడా తప్పే చెప్పింది.
“కలహారి ఎడారిలో దొరుకుతాయి.అంటూకరక్ట్ ఆన్సరు చెప్పింది దీక్షిత
“కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లోని ఏ గ్రామంలో అవతరించింది?” అడిగాడు అనురాగ్,
సౌమ్య ఆలోచిస్తుంటేమన్విత నా వల్ల కాదన్నట్లుగాచూసింది.
వెంటనే "కుచేలపురంఅంటూ దీక్షిత చెప్పింది.
అనురాగ్ ముఖం అదోలా అయింది."ఏమెందిమన్వితా నీకుఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేక పోయావ్?” అన్నట్లుగా చూశాడు. అదేదో గ్రూప్స్ రాసి పోయినట్లుగా బాధపడ్డాడు. అతను దీక్షిత ఆన్సరు చేసినందుకు సంతోషించకుండామన్వితచెయ్యలేనందుకు బాధ పడున్నాడు. మన్విత అతని కళ్లకి యింకా స్కూల్లో చదువుతున్న రెండు జళ్లఅమ్మాయిలాగే వుంది.
సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీ చేరుకున్నారు.
ముందే మాట్లాడుకున్న టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి రెండు బస్లు రైల్వే స్టేషన్కిదగ్గరలో ఆగి ఉండడంతో సూడెంట్స్ అందరు ఎక్కి పాయిల్ ట్రావెల్స్ వాళ్లు ఏర్పాటు చేసిన హోటల్లో బస చేశారు.
అబ్బాయిలకిఅమ్మాయిలకి ఎదురెదురు రూంలు ఇచ్చారు. ఆ రూమ్స్ చాలా హైలెట్గా ఉన్నాయి.
ఆ రూమ్స్ లో  వున్న ఫోన్ ద్వారా అమ్మాయిల రూములకి డయల్ చేసి వాళ్లను ఏడ్పించడంనవ్వించడం చేశారు.
ఈ విధంగా రాత్రి పన్నెండు గంటలు అయింది.
అనురాగ్ మాత్రం వాళ్లందర్ని పల్స్ లో రిజిస్టేషన్ చేయించే పని విూద బిజీగా తిరిగి రాత్రి గంటలకి వచ్చాడు. ఇదంతా దీక్షిత గమనిస్తోంది.
అతను కనిపించనపుడుఆమెకేదో వెలితిగా ఉంటోంది.
మన్విత అలిసిపోయిన దానిలా తినగానే పడుకొంది.
ఆ రోజు రాత్రి అలా గడచిపోయింది.
*****

ఉదయం నాలుగు గంటలకి లేచి జైపూర్ కి అదే పాయిల్ ట్రావెల్స్ లో బయలుదేరారు.

మద్యాహ్నం 1కి జైపూర్ చేరుకున్నారు.
బస్లో కూడా అదే సందడి.
జైపూర్లో అంబార కోట,పింక్ సిటీ,వాటర్ ప్యాలెస్,చూసి సాయంత్రం వరకు అక్కడే గడిపారు.
అక్కడే డిన్నర్ పూర్తి చేసుకొనిరాత్రి ఎనిమిది గంటలకి జైపూర్ నుండి ఆగ్రాకి బయలుదేరారు.
లాంగ్ జర్నీ కావటం వల్ల బస్లో బాటరీస్వేడెక్కి ఒక్కసారిగా పొగలు కమ్మకున్నాయి.
సూడెంట్స్ లో  అబ్బాయిలు మెలుకువతో వుండటంతో బస్సుని ఆపి అందర్నిక్రిందకి దించిరోడ్డు విూద వున్న మట్టిని తెచ్చి నిప్పును ఆర్పారు.
అందరిలో భయాందోళన.
దీక్షిత భయంతో వణకటం గమనించాడు అనురాగ్
ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
దీక్షిత అభ్యంతరం చెప్పకుండా అతని పక్కన కూర్చుంది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages