నెత్తుటి పువ్వు - 8
మహీధర శేషారత్నం
(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను ఏదైనా పనిలో పెట్టాలని చూస్తూ ఉంటాడు రాజు.)
“ఎంతయినా పోలీసోడితో పనులు ఉంటాయిగా అనుకున్నాడు ఆదినారాయణ మనసులో, అనుకోకుండా ప్రాబ్లమ్ సాల్వయిందనుకున్నాడు నాగరాజు షాపింగు ముగించుకుని ఇంటికి వెడుతూ.
"నీకు సైకిల్ తొక్కడం వచ్చా!" లోపలి కొస్తూనే అన్నాడు
“ఆ నా కలవాటే" వెంటనే ఉఙ్సాహంగా అంది సరోజ
"అమ్మయ్య, ఇన్నాళ్ళకీ ఒక మంచి మాట అన్నావు."అన్నాడు నాగరాజు,
“ఆ మరే మూతి తిప్పుకుంది సరోజ. ఆ అమ్మాయికిప్పుడు నాగరాజంటే భయం పోయింది. కాస్త నమ్మకం చిక్కింది. తాము చూసిందే ప్రపంచ మనుకుంటున్న సరోజ దృష్టిలో నాగరాజు అమాయకుడు, మంచివాడు.
జీవితాన్ని అందరూ ఒకేవిధంగా చూడందే విషయం ఆ అమ్మాయికి ఇంకా అనుభవంలోకి రాలేదు. మగాళ్ళందరూ ఆడదాని శరీరాన్ని చూడ్డానికే ఎగబడతారన్నది సరోజు అనుభవం, అభిప్రాయం.
"ఆ సైకిల్ నీ కోసమే వాకిట్లో ఉన్న లేడీస్ సైకిల్ చూపెడుతూ అన్నాడు.
“నా కెందుకు?
"ఎందుకేమిటి? పనికెళ్ళడానికి."
పనికా? ఎక్కడికి?
“ఓ బట్టలకొట్లో వచ్చిన వాళ్ళకీ బట్టలు చూపెట్టాలి. కనిపించాలి. అంతే! ఇలా చేసినందుకు డబ్బిస్తారు. హాయిగా బతకొచ్చు.." అరచేతిలో స్వర్గం చూపిస్తూ అన్నాడు..
“నా మీద నీ కెందుకింత శ్రద్ధ?”
“ఎందుకేమిటి? నేను ఎన్నాళ్లు పెట్టగలను? నాకూ పెళ్ళాం బిడ్డలున్నారు..." విసుగ్గా అన్నాడు.
“మరెందుకు తెచ్చావు?..." మళ్ళీ మొదటికొచ్చింది.
"బుద్ధిలేక విసుక్కొన్నాడు.
"రేపు తొమ్మిదింటికి వస్తాను. ఏదైనాతిని రెడీగా ఉండు. తీసికెడతాను." వెళ్ళిపోయాడు.
మర్నాడు తీసికెళ్ళాడు. భార్య నడిగి నాలుగుచీరలు,జాకెట్లు తెచ్చాడు.
మర్నాడు తీసుకెళ్ళాడు.భార్య నడిగి నాలుగుచీరలు,జాకెట్లు తెచ్చాడు, ఒక పేద అమ్మాయికి కావాలని, జీతం వచ్చేదాకా వాడుకో. కొత్తవి తరువాత కొనుక్కోవచ్చు అన్నాడు సరోజతో. మొదటిసారిగా సరోజ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతను చూపిస్తున్న శ్రద్దకి మాట్లాడకుండా తీసుకుంది.
గిర్రున నెలతిరిగింది. నాగరాజే తీసుకురావడంవల్ల ఆదినారాయణ పనికుర్రాళ్ళకి ముందే హెచ్చరిక ఇచ్చేడు.'ఎర్రగా, బుర్రగా అందంగా ఉందని పళ్ళికిలించేరు. పోలీసాయన తాలుకా అని
ఇంత అందముగా ఉందేవిట్రా బాబూ! దీనివల్ల లాభము, నష్టము రెండూ ఉన్నాయి అనుకున్నాడు మనసులోనే. అతను అసలు ఊహించలేదు. ఏదో పేద పిల్లవస్తుంది అనుకున్నాడు అంతే.
సరోజ నెమ్మదిగా పనిలో పడింది. సూరిబాబు అనే కుర్రాడు కాస్తఉత్సాహము ఎక్కువై “రోజా!” అంటూ పిలవడం మొదలెట్టాడు. సరోజ మొదట్లోనే కట్చేసింది”నా పేరు రోజా కాదు, సరోజ అని, అలాగే పిలవమని.
అది గమనించిన ఆదినారాయణ సూరిబాబుకి వార్నింగ్ ఇచ్చేడు ఒళ్ళు దగ్గర పెట్టుకు జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యోగం ఊడుతుంది అని.
(సశేషం)
No comments:
Post a Comment