ఆయన దైవాంశసంభూతుడేమో
తనలో రగిలే భావాలను
కాగితాలపై వర్షిస్తాడు...
అవి విప్లవమై మొలకెత్తుతాయి
అతని వాక్సుద్ది మహిమేమో!
మైకులో మాటల మంత్రోపదేశం చేస్తాడు
జనసమూహంలో చైతన్యమౌతుంది
అతని గొంతు వశీకరిణేమో!
గొంతులో పిడిగిద్దుల పాటవుతాడు
ఆ గానం వ్యవస్థలో గాయాలను ఎరుకపరుస్తుంది
అతను విశ్వామిత్రుడేమో !
వేదిక మీద బొమ్మకట్టి
మనల్ని మనకే చూపిస్తాడు
అవి మన చెంప చెళ్ళుమనిపించి మేల్కొలుపుతాయి.
అతడు మనకు అద్దమేమో !
నిజానికతనేమీ కాడు
అతని ప్రతి చర్యలో
భాష జీవధాతువౌతుంది
అతనికి వరప్రసాదమౌతుంది.
***
No comments:
Post a Comment