శ్రీధరమాధురి - 62
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )
ఒకసారి షుజో శిష్యుడైన షింజి గురువు అయ్యాడు. చాలా ఏళ్ళ తర్వాత షుజో, షింజి కలిసారు. వారు అనేక గంటల పాటు నవ్వుకున్నారు.
షుజో శిష్యుడు ఇలా అడిగాడు – మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు?
షుజో – ఇతను నా శిష్యుడిగా ఉన్నప్పుడు, నేను నవ్వేవాడిని, ఇతను మౌనంగా ఉండేవాడు. ఇప్పుడు ఇతనికీ నాలాగా జ్ఞానోదయం అయ్యింది కనుక, మాకు ఇక చేసేందుకు పనేమీ లేదు, అందుకే నవ్వుతున్నాము.
ఆత్మజ్ఞానం పొందినవారు కలిసినప్పుడు, నవ్వడం కంటే ఇక మాట్లాడుకునేందుకు ఏమీ ఉండదు. వారు సమస్త సృష్టినీ చూసి నవ్వుకుంటారు.
ఆత్మజ్ఞానం పొందినవారు కలిసినప్పుడు బుద్ధి ఆటలాడదు. కేవలం స్వచ్చమైన హృదయమే మాట్లాడుతుంది.
ఒక శిష్యుడిగా, ఈ రోజున మీ పాత్ర గురించి చింతించండి. ఆ తర్వాత మీకు జ్ఞానోదయమయ్యాకా మీరు నాతో ఏ పాత్ర పోషిస్తారన్నది చూద్దాము.
జ్ఞానోదయం అయినప్పుడు, మీరు పగలబడి నవ్వుతారు. ఇన్నేళ్ళుగా మీరు ఎంత మూర్ఖంగా వ్యవహరించారన్న విషయం ,మొట్టమొదట మీ మనసులోకి వస్తుంది. ఇది మిమ్మల్ని పగలబడి నవ్వేలా చేస్తుంది.
నాలుగు రకాల శిష్యులు...
ఉత్తమోత్తమన్ – గురువు అవసరాలను ముందే కనిపెట్టి, తన పూర్తి సామర్ధ్యంతో పనులు చేస్తాడు.
ఉత్తమన్ – తన విధులను సక్రమంగా పాటిస్తాడు.
అధమన్ – పని చెయ్యాలంటే అతనికి ఇష్టం ఉండదు, అందుకే ఏమీ చెయ్యడు.
అధమోధమన్ – ఇతను గురువుగారు స్నానం చేసే వేన్నీళ్ళలో కారం కలుపుతాడు.
ఉదయం వంటింట్లో, కుటుంబ సభ్యుల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కోరి అత్తగారు, కోడలు ఎన్నడూ పోట్లాడుకోకూడదు. అటువంటి విపరీత స్థితిలో హాల్ లో పోట్లాడుకోవాలి, అప్పుడు మావగారు, కొడుకు వంట వండవచ్చు. కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరి ఈ సూచన జారీ చెయ్యడమైనది.
***
No comments:
Post a Comment