"దైవ పుత్రుని గురించి నా మాటల్లో ...."
శ్రీమతి నల్ల కరుణశ్రీ
ఆది శంకరాచార్యులవారు సామాన్యులు కారు ..
అతి చిన్న వయస్సులోనే ఈ మయా జగత్తులో..
ఎంతో సాధించారు ...
ఇంతకీ ఎం సాధించారు అని ప్రశ్నించుకుంటే..
వారు విరచించిన సర్వదేవతా స్త్రోత్రాలను పరిశీలిస్తే
అందులో మ్యూజికల్ క్వాలిటీ (అంటే లయాత్మకమైన పాదాల పొందిక )
అలాగే పాదాల ఎంపిక (Elegant choice of Vocabulary ) కూడా పలకడానికి ..
స్తుతించటానికి అనుకూలంగా ఉంటుంది ..
ఈ మలయాళీ మాటల మాంత్రికుడు వివిధ దేవతలను స్తుతిస్తూ
వాడిన పద సముదాయాలను (word compound & phraceses ) మన సినీ కవులు
ఎంతో చాకచక్యంగా తమ రచనల్లో వాడుకున్నారు ..
అది శంకరాచార్యులవారి స్త్రోత్ర రచన శైలి నిజంగా ఓ సౌందర్య లహరి ..
సంస్కృత భాషను మృదుమధురంగా చెప్పిన మహానుభావుడు అయన ..
తరువాతి తరంలో ఆయనను అనుసరిస్తూ ..
ఎందరో మహా మహులు రచనలు చేసారు ...
బుద్ధిజం అత్యధికంగా ప్రభలిన సమయంలో అయన అవతారం
నిజంగా ఆ ఈశ్వరుడే శంకరుల రూపంలో అవతరించారేమో ..
బద్ధకించే జనులకి కర్మ తప్పని సరి అని బోధించిన మహానుభావుడు శంకరులవారు ..
ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే శంకరులవారు
తమ భోదనలని భారత దేశం అంతా సంచరిస్తూ వ్యాపింపజేశారు కాబట్టే
ఈనాడు మనం కొద్దో గొప్పో ఆధ్యాత్మికంగా జీవించగలుగుతున్నాము ...
శంకరులవారు అడ్డనామాలు పెట్టుకుంటారు అనుకుంటే పొరపాటే ...
అయన శైవులు ..వైష్ణవులు ..నే బేధాలు గాని ఇతర మాతాలవాళ్ళని చులకనగా చూసిన సంఘటనలు గాని లేవు ..అందరు సమానమే అన్న సమన్వయ వాది అయన ..
ముఖ్యంగా అంటరానివాళ్ళు అని ఎవరు ఉండరు ..ప్రతి హృదయంలో శివుడు కొలువై ఉంటాడు ..
అన్న సత్యాన్ని చెప్పారు ...శంకరులవారు ..
అద్వైతంతో ( Non Duality ) సంస్కరించిన Socio - cultural and Spritual reformer ఆది శంక రులవారు ...
ఈ అద్వైత భాస్కరుడు అవతార పురుషుడు ..అయన ఒక వర్గానికి ఒక మతానికి చెందినవారు కాదు ..
అయన మనకి జగద్గురువుగా లభించటం ..ఆ కర్మ భూమిలో మనం జన్మించటం ...కేవలం మనమే కాదు ..ఈ మట్టిపై పుట్టిన ప్రతి జీవి కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నదే అవుతుంది ..
అయన సూచించిన మార్గంలో నడుస్తూ..మన ముందు తరాన్ని కూడా నడిపిద్దాం ...
ఈ అమూల్యమయిన జాతి సంపదను కాపాడుకుంటూ ...
జై జై ..శంకర ...
ఓం శాంతి శాంతి శాంతి ...!
*************
No comments:
Post a Comment