ఈ దారి మనసైనది - 18
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ.)
ఆ రాత్రంతా అలాగే అతని భుజంమీద తలపెట్టుకొని పడుకుంది దీక్షిత.
మన్విత అటు, ఇటు చూసి ఆలోచిస్తున్నంతలోనే బస్ కదలడంతో ఎక్కి కూర్చుని, ఆ కంగారులో,ఆ భయంలోఎవరెక్కడన్నారో చూసే ఓపిక లేనట్లు కళ్ళు మూసుకొంది.
దీక్షితకి అనురాగ్ స్పర్శలో ఆకులపచ్చదనంపై వెన్నెల కురుస్తున్న అనుభూతి, నిర్మలమైన నీటిసరస్సుపై తేలివస్తున్న గాలి ఒక్క ఉదుటున చుట్ట ముట్టిన హాయి .... ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోయి - ఎప్పటికి ఇదే ఆనందం శాశ్వతం అయితే బావుండన్న భావన, కలిగింది.
*****
ఉదయం పది గంటలకి ఆగ్రా చేరుకున్నారు.
ట్రావెల్స్ వాళ్లు ఏర్పాటు చేసిన హోటల్లో వారి, వారి లగేజీలతో వెళ్లి రిలాక్స్ అయ్యారు.
మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆగ్రా నుండి బయలుదేరి మధురై చేరుకున్నారు.
అక్కడ శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకొని మళ్లీ ఆగ్రాకు చేరుకున్నారు.
ఆగ్రాలో ముందుగా ఆగ్రా ఫోర్ట్ కెల్లి షాజహాన్, ఔరంగ జేబు గురించి తెలుసుకుంటూ అక్కడున్న కోటను, ఆ నిర్మాణమును చూసుకుంటూ ముందుకెళుతూ కోటపైకెక్మారు.
సూర్యాస్తమయం కావడంతో, ఎర్రనికాంతిలో యమునానది ఒడ్డున వున్న తాజ్మహల్ అందంగా కన్పిస్తోంది. తాజ్ మహల్ని ఆనుకొని ప్రవహించే యమునానది చూసేవాళ్లకి కనువిందు చేస్తోంది. అక్కడి వాతావరణం వర్ణనాతీతంగా వుంది.
అదే కోటలో - ఉస్మానియా మెడికల్ కాలేజి, గాందీ మెడికల్ కాలేజి, కర్నూల్ మెడికల్ కాలేజి నుండి వచ్చిన ఫ్రెండ్స్ని పలకరించి, తాజ్ మహల్ చూడటానికి అటునుండి అటే బయలుదేరారు. బస్ ప్రయాణం తాజ్ మహల్ పరిసరాల వరకు లేకపోవడంతో ఒంటెల మీద బయలుదేరారు.
*****
తాజ్ మహల్ కి వెళ్లగానే .
ఎంట్రీ లోంచి లోపలికి ప్రవేశించారు.
అక్కడికి వెళ్లే ముందు సూడెంట్స్ అంతా శాంతికి చిహ్నమైన తెలుపరంగు డ్రస్లు వేసుకున్నారు.
అమ్మాయిలు మాత్రం వైట్ సూట్స్ అందరిని అలరించారు.
లోపలకి వెళ్ళాకఆ అందాన్ని చూసి పరవశిస్తూ మొత్తం తిరిగి చూస్తున్నారు.
ఎదురుగా తాజ్మహల్.... దానికి ఇరు వైపుల తాజ్ మహల్ కోటలు, దాన్ని ఆనుకునే యమునానది పరవళ్ళు....
తాజ్ మహల్ లోపల వున్న ముంతాజ్, షాజహాన్ సమాధుల దగ్గరికివెళ్లి - ఒక్క నిముషం నిలబడి తిరిగి బయటకొచ్చారు.
తాజ్మహల్ వెనుక వైపునున్నయమునానదిని తిలకిస్తూ ఒంటిరిగా నిలబడి వున్న దీక్షితను చేరుకున్నాడు అనురాగ్.
(సశేషం)
No comments:
Post a Comment