నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"శారద "
శారదాప్రసాద్
అది నాకు 24 వ సంవత్సరం.యూనియన్ ఆక్టివిటీస్ లో పూర్తిగా involve చేశారు,అయ్యాను కూడా!కాలం తొందరగా పరుగెత్తుతుంది.సరిగ్గా ఇదే సమయంలో అంటే 23-08-1975 న నాకు ద్వితీయ పుత్రిక జన్మించింది.పెద్ద శాంతి,జపాలు చేశారు.మా నాన్న గారు అన్నీ పద్ధతుల ప్రకారం జరిపేవారు.నామకరణ మహోత్సవం దగ్గరకు వచ్చింది.మా నాన్న గారే పేరును నిర్ణయించారు.'వేంకట శారద ' అనే పేరును నిర్ణయించినట్లు నాకు చెప్పారు.' వేంకట శారద యామిని' గా మార్చితే బాగుంటుందేమో అని నెమ్మదిగా నసిగాను.మొదటి అమ్మాయి పేరులో 'జ్యోత్స్న 'ఉందిగా,యామిని అన్నా వెన్నెల అనే అర్ధం కదా!అందువల్ల యామినిని తొలగిద్దాం!దాని జాతక ప్రకారం శారదాదేవి లాగా చదువుల తల్లి అవుతుందని ,నన్ను సముదాయించి--ఆఖరికి వేంకట శారద అనే పేరును నిర్ణయించారు.నా పిల్లలందరికీ పేర్లు పెట్టింది మా నాన్నగారే !నేను నాన్నగారు జీవించినంత కాలం ,తండ్రి చాటునే పెరిగాను. శారదా దిన దిన ప్రవర్ధమానమౌతుంది.పెద్ద కూతురు వాళ్ళ మామ్మ ఒళ్ళో పెరిగింది!చిన్న కూతురు నాన్న ఆలనాపాలనలో పెరిగింది.అమ్మానాన్నలు మనవరాళ్ల దగ్గర కొన్ని సార్లు ఘర్షణ పడేవారు."మీ మనమరాలు నా మనవరాలిని కొడుతోంది!జాగ్రత్తగా పెంచు!' అని ఒకరినొకరు నిందించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.ఇవేమీ నాకు పట్టేవి కాదు!శారదకు త్రిపురాంతకంలో అన్నప్రాసన జరిగింది!అందుకే దానికి చిన్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉండేదేమో!అక్షరాభ్యాసం జరిగింది.ఒక ముక్క అక్షరం రాలేదు.అప్పుడే నేను నాన్న గారిని --దీనికి శారద అని పేరు పెట్టావు,పొట్టకోస్తే అక్షరం ముక్క లేదు.ఇప్పుడైనా పేరు మార్చరాదండి అని అడిగాను.శారద రూపు రేఖలన్నీ నావే!అది నాకు xerox కాపీలా ఉండేది.కొద్దిగా వయసొచ్చిన తర్వాత,దానికి అమోఘంగా విద్య ప్రాప్తిస్తుంది,నేను పెట్టిన పేరు వృధా కాదని ఘంటా పదంగా నాన్న గారు చెప్పారు.దాన్ని చూద్దామా--పుస్తకాల సంచిని,బాక్స్ ను ,పుస్తకాలను కూడా అందరు పగటిపూట నిద్రించేటప్పుడు వాటిని అమ్మేసి మిఠాయి కొనుక్కునేది!నాన్న గారు ఇంటికి రాగానే చెప్పినప్పుడు,దాని తెలివి తేటలకు మెచ్చుకోకుండా నిందలేమిటి?ఆ వయసులోనే దానికి వస్తు మార్పిడి సిద్ధాంతం తెలిసింది, సంతోషించండి అని దాన్ని దగ్గరగా తీసుకొని ముద్దాడే వారు.దాని గోల భరించటం కష్టంగా తయారయింది,ఈ ఇద్దరు పిల్లలు నాకు చాలు ,ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని నాన్న దగ్గర నసిగాను.అందుకు ఆయన--ఈ సారి సూర్యప్రభసమానుడైన పుత్రుడు జన్మిస్తాడు.వాడు నీ కుటుంబానికి ఒక పెద్ద అసెట్ అవుతాడని చెప్పి,ఆపరేషన్ ప్రయత్నాన్ని విరమింపచేశారు!శారద అలానే పెరుగుతుంది.ఇంతలో 11-12-1977 న ఆదివారం నాడు పుత్రోదయం కలిగింది.వాడికి వేంకట భాస్కర్ అని నాన్నగారే పేరును నిర్ణయించారు.అక్క చెల్లెళ్లు ఇద్దరూ తమ్ముడిని గారాబంగా చూసుకునే వారు. పిల్లలందరికీ నాన్నగారంటే వల్లమాలిన ప్రేమ.నాన్న గారు 30-04-1983 న retire అయ్యారు!17-01-1986 న స్వర్గస్తులయ్యారు. అప్పుడు ఆయన వయసు 59 సంవత్సరాలే !శారద బాగా దిగులుపడింది,రోజూ తాతయ్య దగ్గరే పడుకునేది. చాలా కాలం ఒంటరిగా,దిగాలుగా కూర్చునేది.అది దోవలోకి రావటానికి దాదాపుగా 6 నెలలు పట్టింది. ఆయన చెప్పినట్లే శారద B.com 1 st class లో ఉత్తీర్ణురాలైంది.తాతయ్య చెప్పిన జోస్యాన్ని నిజం చేసింది!ఇప్పుడు ఆ చిరంజీవి భర్త ,పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటూ Detroit లో ఉంటుంది.పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ వృధా కావు!ఈసందర్భంలో సౌభాగ్యవతి శారదను,భర్తను,పిల్లలను ఆశీర్వదిస్తూ ,మా నాన్న గారికి స్మృత్యంజలి సమర్పిస్తున్నాను.మరికొన్ని విశేషాలతో మరొకసారి!
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
***
No comments:
Post a Comment