- అచ్చంగా తెలుగు

నేర్చుకుంటే జీవితాన్ని మార్చుకోవచ్చు.
బి.వి.సత్య నగేష్ , ప్రముఖ మానసిక నిపుణులు,
మైండ్ ఫౌండేషన్ అధినేత.

ఏదైనా నేర్చుకుని నేర్చు, మెప్పు పొందాలంటే ఓర్పుతోబాటు నేర్చుకోడానికి కొంత భావోద్వేగం కావాలి. ఉద్వేగాలకు వయస్సు, కులం, మతం, ప్రాంతం అనే వివక్ష లేదు.
నిచ్చెన ఎక్కడానికి, దిగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఆలోచనా సరళికూడా మన ఎదుగుదలకు, దిగజారుడుతనానికి తోడ్పడుతుంది. ఆలోచనా విధానమే భావోద్వేగాలను సృష్టిస్తుంది.
"కృషి వుంటే మనుషులు రుషులౌతారు... మహాపురుషులౌతారు" అంటారు. కృషి చెయ్యాలంటేముందుగా మన ఆలోచనా ప్రక్రియలో నేర్చుకోవాలి అనే ఆసక్తి పుట్టాలి. ఆసక్తి కలగాలంటే ఏదో ఒకవిధమైన ఉద్వేగం కలగాలి.
అభిరుచి, అవసరం, అభద్రత, ఆత్మాభిమానం, ఆగ్రహం, ఆకలి, జిజ్ఞాస, ఉబలాటం అనే భావోద్వేగాలు మనిషిని ప్రేరేపించి ఉన్నతఆశయాలవైపు పరుగులు తీసేటట్లు చేస్తాయి. ఈప్రేరణ సానుకూలంగా ఇంధనంలా మారితే అది సంకల్పశక్తిగా మారి ఎటువంటి లక్ష్యాన్నైనా..నేర్చుకుని సాధించాలనే ఆకాంక్షకు అంకురార్పణం చేస్తుంది. ఎటువంటి వనరులు లేని పరిస్థితుల్లో కూడా ఆ ప్రేరకాలు మనిషిని ఉన్నత స్థాయికితీసుకెళ్తాయి. ఈ క్రమంలో ఎంతోమంది ఎన్నో సాధించి ఊహించని స్థాయికి ఎదిగారు.
కొందరు చిన్నవయస్సులోనే నేర్చుకోవడం మానేస్తారు. మరికొందరు ఎంత వయసొచ్చినానేర్చుకుంటూనే వుంటారు. ఆర్థిక పరిస్థితులు,శారీరక లోపాలు, పరిమితులు, ఇతర పరిస్థితులుఅనుకూలంగా లేకపోయినప్పటికీ ఉన్నతస్థాయికి చేరిన వారున్నారు. మనిషిలో “నేర్చుకోవాలనే ఆసక్తి” అనే ఆ శక్తిని ఇంధనంగా వాడుకుని ఊహించని స్థాయికి ఎదిగిన వారెందరో వున్నారు. నేర్చుకోవాలనే తాపత్రయం లేనివారిలో వుండే లక్షణాలను పరిశీలిద్దాం.
నేర్చుకోనివారి మనస్తత్వం
          ఎన్నో రకాల రంగాల్లో ఎంతోమంది ఈ రకంగా స్ఫూర్తిని కలిగిస్తున్నప్పటికీ కొంతమంది ఏమీ నేర్చుకోకుండా జీవితాన్ని గడిపేస్తారు. చిన్నచిన్న పనులు కూడా నేర్చుకోరు. వీరి మనస్తత్వం గురించి పరిశీలిద్దాం.
1.     లక్ష్యాలు లేకపోవడం
2.    సంపాదించి పెట్టేవాళ్ళుంటే ఫాల్స్ ప్రిస్టేజ్తో , బ్రతకడానికి సిద్ధపడడం.
3.    ఆత్మ పరిశీలన చేసుకోకపోవడం,
4.    ఎదుటివారి సలహాను ఖాతరు చెయ్యకపోవడం,
5.    నేనింతే. నేను ఇలాగే వుంటానని చెప్పడం.
6.    నిర్లక్ష్యవైఖరి, మొండితనం, మూర్ఖత్వం
7.    తప్పులు సరిదిద్దుకోకపోవడం
8.    వేరే వాళ్లదే తప్పు అనే గురివింద గింజ ధోరణి.
9.    కష్టపడదానికి దూరం, సుఖసంతోషాలకు దగ్గరగా వుండడం (పెయిన్&ప్లెజర్ ప్రిన్సిపాల్) నిచ్చెన
10.  ఏదో ఒకటి చేసి నా జీవితానికి అర్థాన్నివ్వాలనే కోరిక లేకపోవడం
11.   ఆత్మాభిమానం లేకపోవడం
12.  కాలక్షేపం పనులతో సమయాన్ని గడపడం
13.  బలహీనతలు
14.  నాకు ఏదీ రాదు. నేను చెయ్యను అనేమొండితనం
15.  కుంటిసాకులు
నేర్చుకోవడం అంటే కేవలం చదువు, ఉద్యోగం నంపాదించుకోవడమే కాదు.నాకు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం రాదు, నాకుమోటార్ సైకిల్ నడపడం రాదు, నాకు ఫలానా భాషరాదు, నాకు వంట సరిగ్గరాదు, నాకు ఇంతకంటే బాగా మాట్లాడడం రాదు. అనేవాక్యాలను వింటూనే వింటాం.
          ఇటువంటి 'మనస్తత్వంతో వుండి పద్దతిమార్చుకోలేని 60 మంది స్టూడెంట్స్ నుకాన్పూర్ ఐఐటి తొలగించింది. అందులో 46 మంది బి.టెక్, 8 మంది ఎం.టెక్., 6 మందిపిహెచ్.డి. విద్యార్థులు వున్నట్లు వెల్లడించారు.నేర్చుకోవాలనే తాపత్రయంలో వుండేవారి లక్షణాలను పరిశీలిద్దాం.
ఆసక్తిని పెంచుకునే మార్గాలు
నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుకోవడమెలా?అలా పెంచుకున్న ఆసక్తి నశించకుండా ఉండేలా  ఎలా చూసుకోవాలి? అనే అంశాలను పరిశీలిద్దాం.
          నేర్చుకోవాలనే ఆసక్తి కలగాలంటే ముందుగా నేర్చుకోవడం వల్ల కలిగే ఫలితమేంటో తెలియాలి. ఆ ఫలితాన్ని మనం సాధించినప్పుడు కలిగే తృప్తి, అనందం,సంతోషం అనబడే ఉద్వేగాలు అనుభూతిలోకి .రావాలి. అప్పుడే మన మనస్సు ముందడుగువేస్తుంది. ఇటువంటి ఉద్వేగాలు కలగాలంటేఆలోచనా ప్రక్రియ మారాలి, ఆలోచనాప్రక్రియలో మార్పుకు మన ప్రయత్నం కావాలి. అందుకని కోరిక అనే దానితో ఈ చర్యంతా మొదలౌతుంది. ఈ కోరిక లేకపోవడం వల్లనేపైన పేర్కొన్న 15 లక్షణాల్లో కొన్ని కన్పిస్తాయి.
          కోరిక" అనే పదం 'అవసరం' అనే సాధారణ పదంలా అవ్వాలి. అవసరం అనేది బ్రతకడానికి ఆహారం వుండాలి' అనే లాంటిది. కోరిక అనేది బ్రతకడానికి ఖరీదైన పోషకాహారం వుండాలి" అనే లాంటిది.
          'ఏదో బ్రతికేద్దాంలే! మనకిది చాలులే!" అనుకునే వారు 'అవసరం' అనే స్థాయిలోనే ఉంటారు."నేను ఫలానాది సాధించాలి, నాకు హక్కు అర్హత వుంది, కేవలం నేను కృషి చెయ్యాలి, నేను చెయ్యగలను... చేస్తాను.. నాకోసమే కదా!... నా జీవితానికి అర్థం వుండాలి. సింపుల్గా బ్రతికేయడానికి నేను ఇష్టపడను.. నా లక్ష్యం ఫలానా... అది నేను సాధిస్తాను" అనుకుంటే అది కోరిక అవుతుంది. ఈ కోరిక అవసరంగా మారాలి, నీటిలో మునిగిపోతున్న వాడికి పైకి రావడం అవసరం. కోరిక కాదు. అలాగే మన లక్ష్యం అనే 'కోరిక' 'అవసరం'గా మారి నీటిలోంచి పైకి రావడానికి చేసే ప్రయత్నంలా వుండాలి.
          నెసిసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్" అనే ఒక గొప్ప లోకోక్తి వుంది. నిజమే! అవసరం మనిషికి దారిని చూపిస్తుంది. ఈ అవసరం అనేది ప్రేరణ కలిగించేది అనుకుందాం. ఈ ప్రేరణ రెండు రకాలుగా కలుగుతుంది. 1. తనకు తానే ప్రేరణ కలిగిఇచుకోవడం (ఇంట్రెన్సిక్) 2 వేరే వ్యక్తులు, పరిస్థితులు ప్రేరణ కలిగించడం (ఎక్స్ట్రిన్సిక్) కొన్ని సందర్భాలలో రెండు రకాల ప్రేరణలూ ఉంటాయి.
·         'అవసరం' అనేది ఒక ఉ ద్వేగం. అలాగే అభిరుచి, అవమానం, అభద్రత, ఆత్మాభిమానం, ఆకలి, ఆగ్రహం, జిజ్ఞాస,ఉబలాటం అనేవి మనిషిని కార్మోన్ముఖుడుగా చేసే ఉద్వేగాలు.
·         అవసరం లక్ష్యంగా మారాలి. లక్ష్యం గురించి మాత్రమే ఆలోచిస్తూ మార్గాలను వెతుక్కుంటూ
·         అదే మార్గంలో లక్ష్యం చేరేవరకు ప్రేరణతో ప్రయాణాన్ని సాగించడం. మార్గంలోఇబ్బందులుంటే మార్గాన్ని మార్చాలి కాని లక్ష్యాన్ని మార్చకూడదు. - - -
·         బలమైన కోరిక, సడలని పట్టుదల ఇంధనంలా లక్ష్య సాధనకు ఉపయోగపడాలి. –
·         సమయాన్ని జాగ్రత్తగా లక్ష్యం కొరకు ఉపయోగించుకోవాలి.
·         'నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారి కుండే 15 అవలక్షణాలను దరిచేరకుండా జాగ్రత్తపడాలి.
·         'నేర్చుకోవాలనే ఆసక్తి వుండాలంటే ప్రేమపిపాసిలా లక్ష్యంపైనే మొత్తం దృష్టి పెట్టాలి.
·         నిత్య స్ఫూర్తితో వుండాలి. లేదంటే ప్రేరణ నిర్వీర్యం అయిపోతుంది. - - -
·         ఆత్మపరిశీలన చేసుకుంటూ వుండాలి. లోపాలను సరిచేసుకోవాలి. ,
·         నేర్చుకోవాలనే ఆసక్తి పెంచుకోవాలనుకునేవారు తమమీద తాము జాలిపడకూడదు. ''అవసరం' అనే ఫలితం పొందడంలో మమేకమైపోవాలి. పెయిన్/షైజర్ అనే ప్రిన్సిపుల్లో ' పెయిన్ ని వదిలేయాలి. చేసే పనిని ఇష్టపూర్వకంగా చెయ్యాలి. పైనున్న అన్ని ఉదాహరణలను పరిశీలిస్తే దివ్యాంగులు, పేదవారు, కష్టాలున్నవారు వారిమీద జాలిపడుతూకృంగిపోయినట్లు అనిపించదు.
·         నో పెయిన్ - నో గెయిన్ అంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి కష్టాలను తట్టుకునే శక్తి పెంచుకోవాలి. కష్టాలు, నష్టాలు, పాఠాలు నేర్పి మరింత బలంగా తయారు చేస్తాయని నమ్మాలి.
·         నేర్చుకోవాలి... జీవితాన్ని కావలసిన విధంగా తీర్చి దిద్దుకోవాలి. ఇది నా జీవితం. నేను భవిష్యత్తులో సంతోషంగా వుండాలనుకుంటున్నానుఅనుకుంటూ ముందుకు సాగాలి.
చివరిగా... మనిషి తన జీవితాన్ని తానే శిల్పిలా తీర్చిదిద్దుకోవాలనేది నిర్వివాద అంశం. ఏ మనిషి సంతోషంతో పుట్టడు. కాని జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి కావలసిన అన్ని మానసిక శక్తి సామర్థ్యాలతో పుడతాడు. వాటిని సరియైన మార్గంలో ఉద్వేగాలతో సానుకూలంగా మార్చుకోవాలి. అత్యున్నత స్థాయిలోకి వెళ్ళాలనే జిజ్ఞాస (అవసరం)తో సాధన చేస్తే అది సాధ్యమే! దివ్యాంగులు కూడా అద్భుతాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో సర్వాంగాలు ఆరోగ్యం వున్న వారు సాధించకపోవడానికి కారణం... నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవడమే! మానసికమైన ఆ శక్తితో మన సత్తాను నిరూపించుకోకపోతే జీవితం నిస్సత్తువగా మారిపోతుంది. ప్రతి వ్యక్తి తన శక్తియుక్తులను వీలైనంత వాడుకుంటూనేర్చుకోవాలనే ఆసక్తి"తో ముందడుగు వేస్తే అది సాధ్యం చేయొచ్చు. ప్రయత్నించి, ఆచరించి ముందడుగు వేద్దాం. ఆలశ్యమెందుకు? - పదండి ముందుకు.
 ***

No comments:

Post a Comment

Pages