ఎందుకని? - అచ్చంగా తెలుగు
ఎందుకని?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


అనుగ్రహ(అమ్మానాన్నల)రూపంలో కనిపించే దేవుళ్ళను 
అజ్ఞానంతో వదిలి,
విగ్రహరూపంలో కనిపించే దేవుళ్ళని 
అవివేకంతో దర్శించే,
ఈ మూర్ఖులైన మానవులను చూసి 
పకపకా నవ్వుకొనే ఆదేవుడి నవ్వు 
ఈ మందమతులకు వినబడటం లేదెందుకని?

గుళ్ళు,గోపురాలు అంటూ తిరుగుతూ,
తీర్దాలు,క్షేత్రాలు అంటూ అరుగుతూ,
తనువును కష్టపెడుతున్నారే తప్ప,
మనసును మభ్య పెడుతున్నారే తప్ప,
అమ్మకు మించిన దేవత లేదని,
నాన్నకు మించిన దేవుడు లేడని,
అర్ధం చేసుకోలేక పోతున్నారెందుకని?

వారున్న చోటే క్షేత్రమని,వారి పాదాలే తీర్ధమని,
వారి సేవే పరమార్ధమని,వారి మాటే వేదమని,
వారి మమతే మోదమని,
వారిరూపే కాంతి అని,వారిచూపే శాంతి అని,
వారి సన్నిధే తమ పెన్నిధని,
వారి ఒడులే తమకు గుడులని,
వారి ప్రేమలే తమకు గోపురాలని,
తెలుసుకోలేక పోతున్నారెందుకని?

జ్ఞానం అరయలేని భక్తి ఎందుకు?
నిజం తెలియలేని జీవితమెందుకు? 
 ***  

No comments:

Post a Comment

Pages