స్పూర్తి శిఖరాలు - అచ్చంగా తెలుగు
స్పూర్తి శిఖరాలు – మరికొందరి స్పూర్తి కథనాలు వచ్చేనెల
బి.వి.సత్య నగేష్, ప్రముఖ మానసిక నిపుణులు,
మైండ్ ఫౌండేషన్ అధినేత.


కోరికలు అందరికీ ఉంటాయి. కోరిక ఉంటే చాలదు. దానికి తగ్గ ఆచరణ ఉండాలి. సక్సెస్ అవ్వాలంటే కొంత 'రిస్క్ తీసుకోవాలంటారు అనుభవజ్ఞులు. 'రిస్క్' అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో 'సాహసం' అని అర్థం. సాహసం అంటే.. ఏదో అపాయాన్ని ఎదుర్కోవడమే అనుకుంటే పొరపాటు. 'రిస్క్ అనే పదాన్ని వేరే విధంగా అర్థం చేసుకుందాం. ఈ 'RISK' అనే నాలుగు ఇంగ్లిష్ అక్షరాలతో తయారు చేసిన ఏక్రోనిమ్ ని  గమనిద్దాం.
R= Ready to
| = Involve émotionally with
S= Skills and  K = Knowledge - 'రిస్క్ అంటే.. జ్ఞాన సంపద, నైపుణ్యాలతో పాటు తగిన స్థాయిలో ఉద్వేగంతో తయారుగా ఉండటం అన్నమాట. ప్రగతిని సాధించి | ప్రతిభావంత-లైన వారికి ఉండవలసిన లక్షణాలన్నీ 'RISK' అనే పదంలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
R అంటే Readiness.. అంటే సంసిద్దత. ఇది Attitude కు సంబంధించింది. 1 అంటే ఉ ద్వేగంతో లీనమైపోవడం. ఇది Emotional Intelligenceకు సంబంధించినది. S అంటే నైపుణ్యాలు ఇది మానవ నైపుణ్యాలకు సంబంధించినది. K అంటే జ్ఞాన సంపద. ఇది సమాచారం, డేటా లాంటి వాటికి సంబంధించినది. 'RISK' అనేపదంలో Attitude, Skills, Knowledge, Emotional Intelligence ఉన్నాయని తెలుస్తుంది. 'RISK' అనే పదంలో ఉన్న ఈ అర్థంతో ఎంతో ఎదిగి సమాజానికి ఎంతగానో దోహదపడుతున్నారు. 'రిస్క్ అంటే 'సాహసం' అనే పదానికి గుడ్ బై చెప్పి ఈ కొత్త అర్థమే అసలు అర్థం అని నమ్మి ప్రయత్నిస్తే విజయం తప్పనిసరిగా వస్తుంది. పరాజయానికి అవకాశమే లేదు. దీనిని నిరూపించిన వివిధ రంగాలకు చెందిన కొంత మంది తెలుగువారిని ఉదాహరణగా తీసుకుందాం.
ఈ ప్రపంచంలో చాలా మంది పుడతారు. కాని కొంతమంది మాత్రమే వారి జీవితాలను ఫలవంతంగా చేసుకుని మరెంతో మందికి వెలుగును చూపిస్తారు. ఒక రోల్ మోడల్గా నిలుస్తారు. అటువంటి వారు... పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ వారి పనిని వారు చేసుకుపోతుంటారు. అనుకున్నవి సాధిస్తారు. కోరిక/ లక్ష్యాలను కనీస అవసరాలుగా మార్చుకుంటారు. సక్సెస్ అవుతామో లేదో అని తాత్సారం చెయ్యరు. ఉన్నది కూడా పోతుందేమోననే అనుమానం, భయం స్థాయి దాటి సక్సెస్ వైపు ఆలోచిస్తారు. ఈ విధంగా సమాజంలో ఎంతోమంది ఉన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి చేరి వారికే కాక సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా ఎంతగానో దోహదపడుతూ ఉంటారు.
60 సంవత్సరాల వయసు దాటాకా కొత్త వృత్తిలోకి ప్రవేశించి అఖండమైన విజయం  సాధించిన వారెవరైనా ఉన్నారా? అని అడిగితే నేటి యువత KFC కల్నల్ సాండర్స్ పేరు చెప్తారు. కానీ... మన మధ్యనే అంతకన్నా గొప్ప అత్యున్నత స్థాయి వ్యక్తి ఉన్నారు. కొన్ని వేల మందిని గొప్పస్థాయికి చేరేటట్లు చేసి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగును నింపారు. ఐఐటిపై రామ'బాణం
వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో పుట్టారు. ఆయనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడే తండ్రి చనిపోయారు. గ్రామంలోనే 3వ తరగతి వరకు చదువుకున్నారు, పై చదువులకు పక్కగ్రామం వెళ్లారు. తల్లి ప్రోత్సాహంతో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మేథమెటిక్స్ అంటే ఇష్టం. సమాజంలో మార్పులు రావాలి. అంటరానితనం పోవాలి అనే భావజాలంతో ఆ దిశగా కృషి చేస్తుండేవారు. నైజాం పాలనలో రజాకర్లను ఎదుర్కొని జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కులం, మతం అనే తేడా లేకుండా అందరిని దగ్గరకు చేర్చుకునేవారు. టీచర్ ఉద్యోగంలో చేరారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూలుకు ప్రిన్సిపాల్గా పనిచేసారు. రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 55 సంవత్సరాలకు హఠాత్తుగా ప్రభుత్వం తగ్గించిన కారణంగా 1983లో పదవీ విరమణ చేశారు. కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాదని ప్రభుత్వం తెలియజేసింది. ఏం చెయ్యాలి?
ప్రతీ నెల సంపాదన ఎలా అనేది సమస్య. వెంటనే సరస్వతీ దేవి పరివేష్టిత క్షేత్రం బాసర వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే జనంలో గడిపి తర్వాత హైదరాబాద్ వచ్చి ఐఐటి - ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న కొంతమంది పిల్లలకు మేథమెటిక్స్ లో ట్యూషన్ చెప్పడం ప్రారంభించారు. కాని ప్రారంభంలో మంచి ఫలితాలు రాలేదు. తనకున్న జ్ఞాన సంపద, నైపుణ్యాలను ఉపయోగించి 1985లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు గురించి ఒక విద్యాసంస్థను ప్రారంభించారు. అద్భుతమైన ఫలితాలొచ్చాయి. అలా మొదలైన ఆ విద్యా సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఐఐటీలో సీటు వచ్చేలా తర్ఫీదునిచ్చి అత్యున్నత స్థాయి విద్యాధికులను ఈ ప్రపంచానికి అందించారు.
ఆయన విద్యార్థులు అనేక దేశాల్లో ఉన్నతమైన పదవుల్లో రాణిస్తున్నారు. ఆ తర్వాత అదే మార్గంలో వెలిసిన విద్యాసంస్థలకు మార్గదర్శిగా నిలిచిపోయారు. ఆయనే మన ‘ఐఐటీ రామయ్య అంతకుముందు ఎన్నడూ లేనంత మంది తెలుగు విద్యార్థులు ఐఐటీలో సీట్లు ప్రతీ ఏడాది సంపాదించుకోవడం పరిపాటి అయిపోయింది. ఆయన విద్యార్థులే ఎక్కువ శాతం ఐఐటీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. తెలుగు విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు రావడానికి మూల కారకుడు, పితామహుడు ‘ఐఐటీ రామయ్య' అని నిస్సందేహంగా చెప్పొచ్చు. 90 సంవత్సరాల వయసుకు చేరుతున్నప్పటికీ ఈ రోజుకీ తన విద్యార్థులకు తనదైన శైలిలో తర్ఫీదునిస్తున్నారు. 2007 సంవత్సరంలో టీచర్ల తరఫున ఎంఎల్ సీగా ఎన్నుకోబడ్డారు. బాసరలో ఐఐటీని స్థాపించడానికి కారకుడయ్యారు. 16 పుస్తకాలను రాస్తారు. 
మనం ఎంత సంపాదించామనేది సమాజానికి ముఖ్యం కాదు. సమాజానికి మనం ఏం చేసామనేది అతి ముఖ్యం. కొన్ని వేల కుటుంబాల్లో.. అటు టీచర్లు, ఇటు విద్యార్థుల కుటుంబాల్లో వెలుగు నింపి వారి జీవనశైలిలో మార్పు తీసుకొచ్చారు చుక్కారామయ్య.
చిన్నారులకు-తల్లులకు వరప్రసాదం నలభై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు సాధారణంగా అదే ఉద్యోగం, వృత్తిలోనే ఉండాలనుకుంటారు. కాని ఉద్యోగిస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యాపారానికి చేరి మానవజాతికి ఎంతో మేలు చేసిన మహెూన్నత వ్యక్తి గురించి తెలుసుకుందాం.
'అరచేత్తో సూర్యుడిని ఆపలేము' అనే నానుడికి తగ్గట్టుగా సంకల్పశక్తి ఉంటే ఆటంకాలు పటాపంచలై పోతాయని నిరూపించారు. నెల్లూరు జిల్లా పాపిరెడ్డి పాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి అనేక రంగాలకు సంబంధించిన చదువులను ఏ ఇబ్బంది లేకుండా చదివారు. సైన్సులో డిగ్రీ, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం అంత విరివిగా దొరకని రోజుల్లో 1970వ సంవత్సరంలో వెస్ట్ జర్మనీ నుంచి డిప్లమో, ఆ తర్వాత ఎంబీఏ చదివారు. డిఫెన్స్లో సైంటిస్టుగా పనిచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్ఓ) 1990వ సంవత్స రంలో అంతర్జాతీయ సంస్థ  నిర్వహించిన సదస్సు ద్వారా ఒక విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్య పోయారు. హెపటైటిస్-బి అనే వ్యాధివల్ల ప్రతీ సంవత్సరం మూడున్నర లక్షల మంది చనిపోతున్నారని, ఇంత అభివృద్ది చెందిన దేశాలున్నప్పటికీ ఆ వ్యాధి రాకుండా ఉండేందుకు వాక్సిన్ ను సగటు మనిషికి అందుబాటులో ఉండే ధరలో తీసుకురాలేకపోతున్నారని తెలిసి చలించిపోయేవారు. వాక్సిన్లను అతి తక్కువ ధరలో  తయారు చేయడం గురించి ఎన్నో రకాలుగా ఆలోచించి లక్షలు పెట్టు బడి పెట్టడానికి సిద్దమయ్యారు. ఆయన శ్రేయోభిలాషులు 'రిస్క్ తీసుకుంటున్నావు అని హెచ్చరించారు. కాని వెనుకడుగు వెయ్యకుండా 'శాంతా బయోటెక్' అనే సంస్థను 1993లో నెలకొల్పి అతి తక్కువ ధరలో అంతర్జాతీయ ప్రమాణాలతో వాక్సిన్ ను తయారు చేసి సగటు మనిషి కూడా భరించగలిగే ధరకు ఉత్పత్తి చేసి కొన్ని కోట్ల మందికి హెపటైటిస్-బి వ్యాధికి గురికాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కారకులయ్యారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 'పద్మభూషణ్' బిరుదుతో సత్కరించింది. 2009లో ఫ్రాన్స్ కు చెందిన సన్నఫీ కంపెనీకి 'శాంతా బయోటిక్’ ను అప్పగించారు.
(వచ్చే నెల మరో విజయ గాధ )

No comments:

Post a Comment

Pages