శ్రీధరమాధురి - 64
(పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
***
మంచి – చెడు, తప్పు – ఒప్పు, దోషం – నిర్దోషత్వం
వీటన్నిటికీ అతీతమైనదే దయ. దైవం మనపట్ల చాలా దయను చూపారు, అందుకే మనం మనుషులుగా
పుట్టాము. కాని, దురదృష్టవశాత్తూ మనం వంకలు వెతుకుతూ, అందరినీ విమర్శిస్తూ ఉంటాము.
ఆ విధంగా మానవాళి దయ యొక్క స్పర్శను కూడా కోల్పోయింది.
తర్కాన్ని, కారణాలను వెతకడాన్ని వదిలేస్తే తప్ప
దాన్ని ‘విశ్వాసం’ అనలేము.
అలాగే
తర్కాన్ని, కారణాలను వెతకడాన్ని వదిలేస్తే తప్ప
దాన్ని దయ అనలేము.
ఏమి జరిగినా కాని... దయ విషయంలో రాజీ పడద్దు. ఎవరైనా మీకు హాని చేసినా
కూడా, మీరు వారికి హాని చెయ్యాలన్న తలపు కూడా మీలో రానివ్వద్దు. మనిషిగా బ్రతకడమే
కీలకం. దయ మీ దైనందిన చర్యలో భాగమవ్వాలి.
చెడును చంపడం కంటే, చెడు యొక్క సిద్ధాంతాలను
చంపడం సమంజసమైనది. మనలోని ప్రతి ఒక్కరిలో చెడు అనేది కోపం, అహంకారం, గర్వం, అసూయ,
స్వార్ధం, లోభం, కామం ఇటువంటి వాటి రూపంలో ఉంటుంది. మీలో ఉన్న ఈ చెడును చంపేందుకు
మీరేమి చర్యలు తీసుకుంటున్నారు? అందుకే మనం ఇతరుల గురించి విచారించడాన్ని
తగ్గించి, మన గురించి మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. అప్పుడు మనం ఎక్కడ నిలబడతామో
మనకే తెలుస్తుంది.
No comments:
Post a Comment