భారత దేశములో టివి ప్రసారాలకు ఆద్యుడు -శ్రీ పి వి కృష్ణమూర్తి (డిడి మొదటి డైరెక్టర్ జనరల్)
అంబడిపూడి శ్యామసుందర రావు
ప్రస్తుతము ప్రజలు టీవీకి ఎంత అడిక్ట్ అయినారో మనము గమనించవచ్చు మొదట మనదేశములో టివి ప్రసారాలు పద్దతిగా ఎక్కడ అస్లీలత లేకుండా ప్రోగ్రాముల తో ప్రారంభించింది దూరదర్శన్ (డిడి) క్రమేణా కేబుల్ టివి డిష్ టివి ల ద్వారా ప్రయివేట్ చానళ్లు అధికమై డిడి ప్రభావము తగ్గింది కానీ టివి ప్రసారాలు మొదటిసారిగా ప్రారంభించింది మాత్రము డిడి యే ఈ ప్రసారాల వెనుక ఉన్నవ్యక్తి డిడి మొదటి డైరెక్టర్ జనరల్ అయిన పివి కృష్ణమూర్తి గారు అయన కృషి పట్టుదల దీక్ష వలన భారతీయులు టి వి ప్రసారాలను నిరంతరము నిరాఘాటముగా చూడ గలుగు తున్నారు అటువంటి 97 ఏళ్ల వ్యక్తి 2011 లో హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూ లో "టివి సంభాషణలకు అతి పెద్ద శత్రువు "అని అంటాడు నిజమే కదా ప్రస్తుతము ఇంటిల్లిపాది మాటలు లేకుండా టివి చూస్తూ గడిపేస్తున్నారు.
1976లో ఆకాశవాణి నుండి విడదీసి దూరదర్శన్ అనే సంస్థను ప్రజలలోకి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక అంశాలను తీసుకువెళ్లాలి అన్న తలంపుతో ప్రారంభించి పివి కృష్ణ మూర్తి గారిని మొదటి డైరెక్టర్ జెనరల్ గా నియమించారు. ఈయన ఏప్రిల్ 1, 1921లో మయన్మార్ లోని రంగూన్ లో జన్మించారు రెండవ ప్రపంచ యుద్ధము సమయములో జపాన్ సేనల బాంబు దాడులకు దడిచి 1942లో భారత దేశము పారిపోయి రావలసి వచ్చింది కృష్ణమూర్తి గారి తండ్రి రుక్మిణి దేవి అరండేల్ నిర్వహించే కళాక్షేత్రానికి మేనేజర్ గా ఉండేవాడు AIR లో ఉద్యోగానికి వెళుతున్నాను సిఫార్స్ లేఖ ఇమ్మని తండ్రిని అడిగితె అయన," PVK సంస్కారవంతమైన కుటుంబము నుండి వచ్చాడు అతనికి బ్రాడ్ కాస్టింగ్ అనుభవము ఉంది "అని రెండే రెండు లైన్ల సిఫార్స్ లెటర్ ఇచ్చాడు ఆ విధముగా పివికె 1944లో తమిళ న్యూస్ అనౌన్సర్ గా AIR లో చేరాడు నిజానికి ఈయన కెరీర్ "గెట్ అవుట్ "అనే మాటతో మొదలయింది
ఎలాగంటే కోయంబత్తూరు నుండి ఢిల్లీ వచ్చిన ఈయన ఆఫీసుకు అరగంట ఆలస్యముగా చేరి పై అధికారిచేత గెట్ అవుట్ అనిపించు కొన్నాడు ఆ తరువాత ప్రోగ్రాం అసిస్టెంట్ గాను,ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ ,అసిస్టెంట్ స్టేషన్ డైరైక్టర్ , స్టేషన్ డైరెక్టర్ ,డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ చిట్టచివరికి డైరెక్టర్ జనరల్ గా అంచెలు అంచెలు గా ఎదుగుతూ వచ్చాడు ఈయన అభివృద్ధిలో ఏరకమైన సిఫార్సులు లేవు కృషి పనిపట్ల అంకితభావం మాత్రమే ఉన్నాయి
స్వతంత్ర భారతములోని బ్రాడ్ కాస్టింగ్ చరిత్రలో మధురమైన క్షణాలన్నిటిలో పివికె పాలు పంచుకున్నారు మొట్టమొదటిసారిగా స్వాతంత్రము వచ్చినాక జవహర్ లాల్ నెహ్రు ప్రసంగానికి రికార్ద్ చేయటంలోనూ AIR ఢిల్లీ స్టూడియో లో సుచేత కృపాలాని పాడిన వందే మాతరం పాటను ప్రసారము చేయటంలోనూ పాల్గొన్నారు. ఆనాటి బ్రాడీకాస్టింగ్ ప్రపంచములో దిగ్గజము అయిన మెల్విల్ డి మెల్లో తో కలిసి పనిచేయటం ఏంతో సంతోషమైన విషయము అని పివికె ఆ ఇంటర్యూ లో చెపుతారు AIR కటక్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వేణుగాన(ఫ్లూట్) నిపుణుడు హరిప్రసాద్ చౌరాసియాను ప్రోత్సహించి వెలుగులోకి తెచ్చినది పివికె ఈయనకు దూరదర్శన తో అనుభందం 1960 లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా నియమించటము తో మొదలైంది ఆ విధముగా కటక్ నుండి ఢిల్లీ వచ్చిన పివికె, AIR లోని ఇతర ఇంజనీర్లు 1972లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన ఒక అంతార్జాతీయ ఎక్సిబిషన్ లో ఫిలిప్స్ కంపెనీ వారు వాడి వదిలివేసిన CCTV కెమెరాలతో TV స్టేషన్ ను ప్రారంభించారు 1972లో పివికె ను బొంబాయి బదిలీ చేసి భారత దేశపు మొదటి అన్ని హంగులతో TV స్టూడియో నిత్వహణ భాద్యతను అప్పజెప్పారు.ఈ స్టూడియో నిర్మాణములో జర్మన్ ఇంజనీర్ల సహాయ సహకారాలు ఉన్నాయి
బొంబాయి టివి స్టూడియో నిర్వహణలో అయన కెరీర్ లో కొన్ని అబ్దుత విజయాలను సాధించాడు వాటిలో బాగా ప్రజాదరణ పొందినవార్తల ఆధారముగా రూపొందించబడిన "పరిక్రమ "ప్రోగ్రామ్ దీనిని ప్రముఖ హిందీ రచయిత కమలేశ్వర్ నిర్వహించేవారు అలాగే మరో ప్రోగ్రామ్ "ఫ్యూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్" ఈప్రోగ్రామ్ లో ఒకప్పటి బాలనటి తబ్ సమ్ ప్రముఖులను,సినిమా నటులను పరిచయము చేస్తూ ఉండేది ఈ కార్యక్రమానికి పివికె స్వయముగా సౌండ్ ట్రాక్ కంపోజ్ చేసేవాడు .ఈ సమయములోనే బొంబాయి స్టూడియో లో స్మిత పాటిల్ వంటి ప్రముఖులకి అవకాశము కల్పించేవాడు మొదట న్యూస్ రీడర్ గా ఆడిషన్ కు వచ్చినప్పుడు స్మితాపాటిల్ ను తిరస్కరించారు ఆవిడా భాధ పడుతూ ఉండటం చుసిన పివికె మాల్;లి ఆవిడకు ఆడిషన్ ఛాన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు
తరువాత శ్యామ్ వెనిగర్ ఆవిడకు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు రెండేళ్ళ తరువాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పివికె ను DD డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నియమించి 1320 గంటల సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ భాద్యత అప్పజెప్పింది దీనివలన ప్రభుత్వము సాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ (SITE) ను వాడుకోవచ్చు ఈ ప్రోగ్రాం ను అమెరికాలోని NASA మరియు ఇండియాలోని ISRO వారు సంయుక్తముగా నిర్వహించేది ,ఈ ప్రోగ్రామ్ మూడుభాషలలో గ్రామీణభారతానికి ఆరు రాష్ట్రాల ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు రుపొందించబడింది ATS 6ఉపగ్రహముద్వారా అమెరికాలోని కేప్ కెన్నడీ నుంచి 1974,మే 30న ఈ ప్రయోగము నిర్వహించబడింది ఈ కృషి అంతా కృష్ణమూర్తి గారిదే,ఆ రోజుల్లో ఉన్న తక్కువ సాంకేతికతతో వనరులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు , ఈ కార్యక్రమ నిర్వహణలో అయన కటక్ ఢిల్లీ,హైదరాబాద్ స్టూడియోలలో గడిపేవాడు సిబ్బంది సైన్స్ ,వ్యవసాయ కార్యక్రమాలను పిల్లల ప్రోగ్రాం లను,కుటుంబ నియంత్రణ,ఉపాధ్యా శిక్షణ వంటి కార్యక్రమాలపై ప్రోగ్రామ్ లను తయారుచేసి ప్రసారము చేసేవారు. జానపద కళలపై ప్రోగ్రాం లను కూడా ప్రసారము చేసేవారు ఈ ప్రసారాలను విద్యుత్ కూడా లేని మారు మూల పల్లెలలో కూడా బేటరీతో నడిచే సెట్ ల ద్వారా ప్రసారము చేసేవారు ఎమర్జెన్సీ కాలములో భారత దేశము అంతట టివి స్టేషన్లు ప్రారంభించే భాద్యత ఈయనకు అప్పజెప్పారు ఆ విధముగా నవీన బ్రాడ్ కాస్టింగ్ ఇండియాలో కృష్ణ మూర్తి గారి ద్వారా నే జరిగింది ఎమర్జన్సీ తరువాత మొరార్జి దేశాయి ఎమర్జన్సీ జుల్లోనే అకృత్యాలను విచారించటానికి నియమించిన షా కమిషన్ కృష్ణమూర్తి గారిపై తప్ప మిగిలిన AIR, DD అధికారులపై చర్యలు తీసుకున్నారు ఈయన ఎమర్జన్సీ కాలములో కూడా దేశమంతా తిరుగుతు DD విస్తరణ ,నిర్మాణ పనులలో పాల్గొన్నాడు నిజాయితీగా పనిచేశాడు కాబట్టి ఏ ప్రభుత్వము ఆయన పై ఎట్టి చర్యలు తీసుకోలేదు
ఇండియాలో మొదటిసారిగా టివిలో వాణిజ్య ప్రకటనలు 1978లో గ్వాలియర్షూ టింగ్స్ తో ప్రారంభించింది కృష్ణమూర్తి గారే ఒక సంవత్సరము తరువాత అయన పదవి విరమణ చేశారు అయన హయములోనే దేశమంతటా DD స్టేషన్లు ప్రారంభించబడ్డాయి 1982లో అయన చెన్నై చేరి అక్కడ యునిసెఫ్ తరుఫున వయోజన విద్య సలహాదారుడిగా పనిచేశారు పదవీవిరమణ తరువాత ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ వైస్ చైర్మన్ గా పనిచేసి టాగోర్ ఫెల్లో షిప్ కు ఎంపిక అయినాడు కోడి గ్రుడ్డు పెట్టి కోడిపిల్లను పొదిగితే గ్రద్ద ఆ కోడిపిల్లను తన్నుకు పోయినట్లు 1990 లో ప్రభుత్వ లిబరలై జేషన్ విధానము వల్ల అనేక ప్రయివేట్ చానళ్ళు ప్రారంభమయి ప్రేక్షకులను దూరదర్శన్ నుండి దూరము చేశాయి కానీ ఈ టివి ప్రసారాలకు పునాది వేసినవాళ్లు కృష్ణమూర్తి అయన బృందం.
***
No comments:
Post a Comment