జీవిత సత్యం!
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
జీవిత సత్యం!
నేటి మన కదలికలు
రేపటి మథుర స్మృతులన్నా అవ్వొచ్చు
పీడ కలలన్నా కావచ్చు
మనమే కారణం కాకపోవచ్చు
ఇతరులైనా నొచ్చుకోకూడదు
సమాజ మానవతోటలో
మంచి పూలతో పాటు
గడ్డిపూలూ ఉంటాయి
ఆకలితీర్చే పళ్లతో పాటు
పల్లేరు కాయలూ కనిపిస్తాయి
కోయిల కూతలే కాదు
కాకి గోలా వినిపిస్తుంది
ఆహ్లాదాన్ని పొందాలనుకుంటాం
ఏ ముళ్లో దిగి కళ్ల నీళ్లు నిలుస్తాయి
తప్పదు.. తోటలోకంటూ అడుగెట్టాక
అన్నింటికీ సిద్ధపడాలి
జీవితాన్ని కాచి వడబోసాక
అనుభవంలోకొచ్చే జీవిత సత్యం ఇదే!
***
No comments:
Post a Comment