రాజుకన్నా - రైతు మిన్న
వాసుదేవమూర్తి శ్రీపతి
నేలనేలే రాజుకన్నా
హలం పట్టిన రైతు మిన్న
అన్నదాతల కన్ను తడిసిన
నరుల మనుగడ నిండు సున్నా
రైతు మేలుని కోరుకుంటూ
నమ్ము వేల్పుకి మొక్కుమన్నా
మన్ను నమ్మిన వాని నవ్వులో
అవని మేలు దాగెనన్నా
కర్షకేంద్రుని కడుపు మండిన
ఆకలి విలయం తప్పదన్నా
ఉరికి రైతు ఉసురు విడిచిన
మనిషి భవిత శూన్యమన్నా
రైతు దేశపు వెన్నుముక కాదురన్నా
రైతు జగతికే వెన్నుముక ఇది నిక్కమన్నా
***
No comments:
Post a Comment