శివం - 53 - అచ్చంగా తెలుగు
శివం - 53
రాజ కార్తీక్ 


(కల్పన భారతి దూరం నుండి తన భర్త, బిడ్డల మృతదేహాలను చూసి మోకాలి మీద పడి  ఏడుపు మొదలుపెట్టింది .)
అందరికీ గుండె తరుక్కుపోతోంది. 'ఏదైనా మరీ అలా జరగకూడదు,' అని అందరూ అనుకుంటున్నారు పైపైన ..
ఇన్ని అడుగులు వేసిన కల్పన భారతి మరి కొన్ని అడుగులు వేసి వారి మృత దేహాలను చూడాలంటే, ఆమెకు బెరుకుగా ఉంది.
పాపం ఆ చిట్టి తల్లి మనసు పడే ఆవేదన అంతా ఇంతా కాదు.
చావు పుట్టకలు నా అధీనమే ,వారి కర్మానుసారం వారికి అన్నీ జరుగుతూ ఉంటాయి.ఇందులో చెడ్డవారికి మంచి జరుగుతుంది అని లేదు, మంచి వారికీ చెడు జరుగుతుంది అని లేదు. ఎవరి ప్రారబ్దం, ఎవరి పాపం ఎవరి పుణ్యం వారిది. నేను మాత్రమే మీకు శాశ్వతమైన వాడిని. ఆది నుండి  ఉన్నవాడ్ని . మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎన్నటికి వమ్ము చేయను. నిశ్చితంగా నమ్మకం  గా నన్ను స్మరించండి. ఏది ఏమైనా నన్నే చేరుకుంటారు. ఇదే అన్ని వేదాంతల తాత్పర్యం.
అక్కడికి చేరుకున్నాడు మరొకతను. అతను కూడా కల్పన భారతి  ఆత్మాభిమాన బాధితుడే. కల్పన వైపు దీనంగా చూసాడు అతను .ఏడుస్తున్న కల్పన కూడా అతని వైపు చూసింది. అతను అన్న మాటలు ఆమెకు గుర్తుకువచ్చాయి.
"కల్పన భారతి నీవు ఆడదానివి కాబట్టి నిన్ను వదిలేసాము. అదే నువ్వు మగవాడివి అయితే నీకు అన్ని రకాలుగా మేమంటే ఏంటో తెలేసేది. అసలు అవతలి మనిషి చెప్పేది వినకుండా, మేము ఏమి చేయకుండానే, నీవు ఎదో ఊహించుకొని, అది నిజం అనుకునే మానసిక వికలంగురాలివి నీవు. స్త్రీ సమానత్వం, స్వేచ్ఛ అని మాటలు చెప్పే నీవు స్త్రీవనే కారణంగా, వారిని గౌరవంగా చూసే మా గుణంవల్ల, నీ పరువు తీయకుండా వదిలేసాము. "
కానీ అతను చూసే చూపులో ఇదివరకటి కోపంలేదు. "అయ్యో నీకు ఎంత జరగరానిది జరిగింది  "అనే బాధ తప్ప.
ఏదయితే నేమి, అంతా గడిచిపోయింది, జరిగిపోయింది, ఐపోయింది. కల్పన భారతి మనసు, జీవితం, భవిష్యత్తు అంతా ముక్కలు ఐపోయింది.
తన భర్త మృతదేహం కన్నా తన బిడ్డ దేహం మరీ పాడైపోయింది. అది సుస్పష్టంగా కనపడుతోంది.
ఆ చిట్టి తల్లికి అంత ఏడవటానికి ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో, మాటిమాటికి తన స్వరం పెంచుకుంటూ పోయింది. ఆ రోదనలో తను వేదనతో పాడిన రాగం నాకు వినపడింది.
కల్పన భారతి మనసులో మాత్రం " దేవుడు ఏమి చేయడు ,నమ్ముకున్న వాళ్ళని ఏడిపించటం తప్ప ..."అని అనుకుంటోంది.
ఎవరో కొంతమంది వచ్చి భారతిని లేపి "ఊరుకో అమ్మ, ముందు కనీసం మనసారా చివరి చూపు ఐనా చూసుకో. కాసేపు ఉంటే  కుళ్ళిపోతాయి, వెంటనే తీసుకుపోవాలి, " అన్నారు.
వారందరు పట్టుకొని, దగ్గరకు తీసుకుని  వెళ్లారు. బేల చూపులతో చూసింది వారి దేహాలను...
కల్పన భారతి గుండెలు బాదుకుంటూ "చిట్టి తండ్రి! నా వల్లే నీకు ఇలా అయ్యింది రా . దేవుడా! నా ప్రాణాన్ని తీసుకొని, వీడని బతికించు," అని వేడుకుంటోంది.‌ ఎంత మంది ఊసురు పోసుకున్ననో అవన్నీ నీకు తగిలి  ఇలా అయ్యావు రా ..ఏవండి ఏవండి నన్ను వదిలేసి వేల్లిపోయరా ..నన్ను కూడా మీతో తీసుకు పొండి..ఏంటి ఈ కర్మ నాకు? నేను ఒక దరిద్రురాలను. పుట్టకుతో తల్లిని తర్వాత తండ్రి ని, తర్వాత నా మాటలతో అందర్నీ దూరం చేసుకున్నాను. ఇటువంటి  తలరాత నాకు దేవుడు రాసినందుకు నా మీద నాకే  అసహ్యం పుడుతోంది .." అని రోదించసాగింది.
ఎవరు ఎన్ని చెప్పినా  విధి రాత మారదు కదా! ఎవరో ఒకరిద్దరు మహా పుణ్యపురుషులకు తప్ప, మృత్యువును ఎవరు ఎదిరించగలరు ? మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకనాడు మృత్యుదేవత ఊడిలో నిదురపోక తప్పదు కదా , వెనకోముందో .
కల్పన భారతి "ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధపడ్డావు చిట్టి తండ్రి .అయ్యో, అయ్యో, అయ్యో అని "హృదయవిదారకంగా  ఏడుస్తోంది. తన గొంతు పెగలలేదు .
అక్కడికి వచ్చిన వారందరు సాయంగా, జరగవల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏడిచి, ఏడిచి సొమ్మసిల్లి పడిపోయింది చిట్టితల్లి.
వారి మృత దేహాలను సంస్కరించేందుకు స్నానాలు చేయిస్తున్నారు...
తన బిడ్డ దేహానికి స్నానం చేయిస్తుండగా, మళ్ళీ తను తన బిడ్డతో ఆడుకున్న వన్నీ గుర్తు చేసుకొని, కుళ్ళి కుళ్ళి ఏడిచింది.
ఇక చెప్పటానికి నాకు కూడా ఏమి రావట్లేదు. తన బాధ చూసి ఎంతో కలవరపడ్డాను నేను. 
అంత ఐపోయింది. అంతా... కల్పన భారతి జీవితమంతా, తన ఆశలంతా, తన గమ్యాలంతా, తన తీరాలంతా, తనంతా ఆవిరైపోతోంది.
చివరిగా ఏడుకట్ల సవారీ కట్టి తీసుకువెళ్ళబోతుండగా, గుమ్మం దగ్గర గుండెలు బాదుకొని ఏడిచింది. అయ్యో అయ్యో ..ఏమి కర్మ కర్మ అని తల కొట్టుకుంటోంది.‌ కొన్ని నిముషాలు పోతే ఇక కల్పన భారతి ఉన్న ఆ కొద్ది రూపు రేఖలను కూడా చూడలేదు ..
ఎవరు లేని కల్పన భారతికి ..ఇదివరకు తను అవమాని౦చిన వారు తోడుగా ఉండి, ఆ అనాధ సంస్కారం చేసారు.
అలా కల్పన భారతికి ఉన్న ఋణాను బంధాలు  తీరిపోయాయి.
(సశేషం)

No comments:

Post a Comment

Pages