శ్రీధరమాధురి - 65 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 65

Share This


శ్రీధరమాధురి - 65
                      (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)






అతను – నా దయను బలహీనతగా భావిస్తున్నారు...

నేను – అయినా దయను కలిగి ఉండు.

అతను – నేను ఇతరులకు చేసే సాయం ఎవరూ గుర్తించట్లేదు, ఒప్పుకోవట్లేదు.

నేను – అయినా సాయపడుతూనే ఉండు.

అతను – నేను నిజాయితీగా, ముక్కుసూటిగా ఉంటాను. అయినా అంతా నన్ను మోసం చేస్తారు.

నేను – అయినా నిజాయితీగా ఉండు.

అతను – నేనివాళ చేసిన మంచిని, రేపు అంతా మర్చిపోతారు.

నేను – ఎల్లప్పుడూ మంచినే చేస్తూ ఉండు.

అతను – గురూజీ, నేనింకా దయగా, నిజాయితీగా, అందరికీ మంచి చేస్తూ, ఉండాలని మీరు ఎందుకు కోరుతున్నారు? సమాజం వీటికి విభిన్నంగా ఉంది కదా ?

నేను – ఇది చాలా సులువైన ప్రశ్న, నీవు చేసే మంచి పనులన్నీ నీకు, దైవానికి మధ్యన ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ గుర్తించి, బదులిస్తారు. అవి నీకూ, సంఘానికి మధ్య ఎన్నడూ జరుగవు.


***


గురువును మెప్పించేందుకు  మీరు వారి వద్దకు వెళ్ళకండి. మీ గొప్పలు ప్రదర్శించేందుకు మీరు గురువు వద్దకు వెళ్ళకండి. ఆయన ముందు మీరు చేసి చూపేది ఏమీ లేదు. గురువును ప్రభావితం చెయ్యడం సాధ్యం కాదు. గురువును మోసపుచ్చడం సాధ్యం కాదు. మీరు వారి వద్దకు వెళ్ళినప్పుడు, పూర్తి శరణాగతి భావంతో వెళ్ళండి. అత్యంత వినయంతో వెళ్ళండి. ఆ వినయంలో ఒక గొప్ప గౌరవం, ప్రేమ మాత్రమే కనబడాలి. మీరు అలా ఉండలేనప్పుడు, ముందుగా, మీరు గురువు వద్దకు వెళ్ళకపోవడమే మంచిది.


***


అతను – గురూజీ, నా భార్యతో నా అనుబంధాన్ని ఏర్పరచుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

ఓహ్, మనం ఎటు వెళ్తున్నాము? ఇతను భార్యతో తన అనుబంధాన్ని చక్కబరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. భార్య వద్ద ఉండాల్సింది స్వచ్చమైన ప్రేమ. కొన్నిసార్లు మీరు ఆమెతో విభేదించవచ్చు. ఆమె మీతో కొన్నిసార్లు విభేదించవచ్చు. ఇది సాధారణం. దీనికోసం ప్లాన్ చెయ్యడం, దాన్ని అమలు పరచడం అవసరమా? వ్యాపారంలో మీరు ఒక సంబంధం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాలి. భార్య భర్తతో, భర్త భార్యతో అనుబంధం ఏర్పరచుకోడానికి ప్రయత్నించేందుకు ఇదేమైనా వ్యాపారమా? ప్రేమను ప్లాన్ చెయ్యడం అవసరమా? ఇందులో ఒప్పందాలు ఏర్పరచుకోవాలా? భార్యాభర్తల మధ్యన మీరు నిబంధనలు విధించుకుని, పాటిస్తూ ఉన్నట్లయితే అదేమైనా కాంట్రాక్టా? ప్రేమ ఒక వ్యాపారమా? ప్రేమ కాంట్రాక్టా? ప్రేమ వీటన్నింటికీ అతీతమైనది కాదా? భార్యాభర్తల మధ్య ఉండే అటువంటి స్వచ్చమైన బేషరతైన ప్రేమలో సంబంధాలు ఏర్పరచుకునే ప్రశ్న ఎక్కడుంది? ప్రేమ అనేది త్యాగం, ఉన్నతమైన అవగాహన కాదా? అటువంటి పవిత్రమైన సంగమంలో ఉన్న భార్యా, భర్తా ఒకరికోసం ఒకరు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండే నమ్మకాన్ని కలిగి ఉండరా? ఈ రోజుల్లో పిల్లలు ఎటు పోతున్నారో నాకు తెలియట్లేదు. దైవానికి మా ప్రార్ధనలు.


***


నేను ‘నాయకత్వం’ గురించి ప్రేక్షకులను అడిగినప్పుడు, నాకు కొన్ని ఆసక్తికరమైన జవాబులు దొరికాయి.


1.   నాకొక టీం (బృందం)కు నాయకత్వం వహించాలని ఉంది.


2.   నేనే అందరి దృష్టినీ ఆకర్షించాలని నాకుంది, అందుకే నాకు నాయక పాత్ర కావాలి.


3.   నేనే నాయకుడినైతే, నేను శక్తివంతుడిని అవుతాను.


4.   నేను టీం కు మంచి మార్గదర్శకత్వం వహిస్తాను.


5.   నేను ఎన్నికలలో పెద్ద ఎత్తున పాల్గొనవచ్చు.


6.   నాయకుడిగా, ప్రజలను సంబాళించడం ఎలాగో నాకు తెలుస్తుంది.


ఇలా నాకు 30 విభిన్నమైన జవాబులు అందాయి.  ప్రేక్షకులు అందరూ 35 ఏళ్ళు పైబడినవారే !


ఒక ప్రేక్షకుడు తన 8 ఏళ్ళ పాపను తీసుకుని వచ్చాడు.


ఆ పాప చివరికి చాలా మంచి సమాధానం ఇచ్చింది.


పాప ఇలా అంది, ‘ గురూజీ, ఒక నాయకిగా నేను చెప్పుకోదగ్గ మార్పును తీసుకుని వస్తాను.’


నేను ఆనందంతో చప్పట్లు కొట్టి, ఆ పాపను హత్తుకున్నాను.




***

No comments:

Post a Comment

Pages