అంత్య ప్రాస కలిసేట్టు
పారనంది శాంతకుమారి.
రెండు చేతులు కలిస్తే చప్పట్లు,
రెండు నోర్లు తెరిస్తే ఇక్కట్లు.
రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు,
రెండు జీవితాలు కలిస్తే అగచాట్లు.
ఆదిలో అజ్ఞానంతో చేస్తే పొరపాట్లు,
తుదివరకు తప్పవు గ్రహపాట్లు.
తప్పులకై ఎంచుకుంటే తెరచాట్లు,
పొడుస్తాయి అవే భవితవ్యానికి తూట్లు.
రహస్యంగా చేస్తే చాట్లు,
అవే జీవితానికి పెద్దచేట్లు.
పదేపదే పొడిచి వెన్నుపోట్లు,
సంపాదించాలనుకుంటే కోట్లు,
తప్పవు ప్రమాదపు కాట్లు.
ఎక్కువగా కొంటె ప్లాట్లు,
ఆదాయపు పన్నుశాఖ చేయిస్తుంది ఫీట్లు.
పండగ రోజుల్లో తిన్న బొబ్బట్లు,
రుచిలో మిగిలిన వాటితో కడతాయి బెట్లు.
ప్రతిచిన్న విషయానికీ భార్యాభర్తలు పట్టుకుంటే సిగపట్లు,
వాళ్ళ జీవితాలు నరకాలకే డూప్లికేట్లు.
వంటింట్లో సరిగా కడగకుంటే ప్లేట్లు,
సుక్ష్మజీవులు పెరుగుతాయి అనేకరెట్లు.
మార్చుకోకుంటే దుప్పట్లు,
అనారోగ్యాలు వేస్తాయి మాట్లు.
అలా కాలుస్తూ ఉంటే సిగరెట్లు
గుండె పడుతుంది తూట్లు.
ఎక్కువగా తింటే స్వీట్లు...లాగిస్తే ప్లేట్లకు ప్లేట్లు
హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పడాలి పాట్లు.
చప్పట్లు కంటే ఎంతో బాగుంటాయి పుల్లట్లు.
మార్కెట్లలో కొన్నికొన్ని చోట్లు
విపరీతంగా ఉంటాయి రేట్లు.
శరీరంలో కొన్నిచోట్ల వచ్చేపోట్లు
ఆరోగ్యానికి మెల్లగా తెస్తాయి చేట్లు.
ఆలోచించకుండా వేసిన ఓట్లు
మన భవిష్యత్తును వేస్తాయి వేట్లు.
***
No comments:
Post a Comment