కుహు కుహు - అచ్చంగా తెలుగు
 కుహు కుహు
ఓలేటి స్వరాజ్య లక్ష్మి 
      
 
పచ్చని చామంతులు ఆరేంజి రంగు ముద్దబంతులు తెల్లని మల్లెపూలు సన్నజాజులు ఇంకా రంగు రంగు పువ్వులన్ని వేరు వేరుగా ఏరి చాపనిండా పేరుస్తూ చక్కని దండగా గుచ్చుతోంది  రాజేశ్వరి. ఒక పక్క మామిడి కొమ్మలు పోగు పోసి ఉన్నాయి. పెద్ద పురికోసతో  మామిడాకుల్ని రింగులుగా అమర్చి  గుమ్మానికి  అమార్చడానికి సిద్ధంచేస్తోంది .

     వరండాలో పేపర్ చదువుతున్న రంగనాధామ్" రాజు! బజారుకెళ్లి తేవలసిన సరు కులేమైనా ఉన్నాయా?  ఇప్పుడే వెళ్లి సిద్ధాంతి గారిని పంచాంగం ఆడిగి తెస్తాను. అలాగే చంటిదాని అన్నప్రాసన ముహూర్తం కూడా పెట్టించి  వస్తాను. మరేమైనా ఉన్నాయా పనులు? " అంటూ కండువా భుజం మీద వేసుకొని బయటికి నడుస్తూ అడిగారు.

      రెండు రోజుల్లోనేగా పండగ. పెద్ద మనవరాలిదీ చంటి సమీరా పాపది పట్టు లంగాలు ఇచ్చా సుబ్బారావు టైలర్కి.కుట్టేస్తే తెచ్చెయ్యండి. మళ్ళీ వెళ్ళడం అవదు.బోల్డ్ పనులున్నాయి రేపు.సిద్ధు గాడి గొలుసు అన్న ప్రాసనకి వెండి పళ్లెం బంగారయ్య కొట్లో ఆర్డర్ ఇచ్చి వచ్చా .అవికూడా వస్తూ తెచ్చెయ్యండి. జాగర్త.  పక్కవాళ్ళ అబ్బాయి రమేషుని సాయం తీసుకొని వెళ్ళండి. అలాగే ఓ నాలుగు మామిడి పిందెలు కొత్త బెల్లం కొత్త చింత పండు పట్టుకురండి. వేప చిగురులు పువ్వులు సుబ్బి కి తెమ్మని చెప్పా ను. వెళ్ళిరండి." భర్తను తొందర చేసింది రాజేశ్వరి.

    సరే  వస్తాను. తలుపేసుకో" వీధి లోకి నడిచారు రంగ నాధం గారు.

.......................?..

పూ లన్ని దండలుగా గుచ్చి ద్వారానికి అందంగా అలంకరించి మామిడి తోరణాలు కూడా కట్టింది.ఇంటి ముందు చక్కని చుక్కల ముగ్గు తెల్లగా నల్లని గచ్చుపై మెరుస్తోంది. ఇల్లంతా చక్కగా నీట్ గా సర్ది  తృప్తిగా చూసుకుంది.  క్రితంసారి పెద్దాడి కొడుకు ఛీ ఈ ఉరేమి బాలేదు. బాత్రూమ్ లేదు.  మన ఊరు వెళ్లి పోదాం అని ఒకటే ఏడుపు. అందుకని ఈ సారి అన్ని సదుపాయాలు చేయించింది రాజేశ్వరి. పెరట్లో కమోడ్ టాయిలెట్ కట్టించింది. బెడ్ రూమ్  హాలు అన్ని సాధ్యమై నంత వరకు నీట్ గా సద్ధింది. కొత్త బెడ్ షీట్ లు కర్టన్లు తో గదులు అలంకరించింది. పిల్ల లంతా వచ్చే లోగా  మినపసున్ని కొబ్బరి జంతికెలు అరిసెలు చేగోడీలు  చంటి దానికోసం తెల్లావు పాలతో పాలకోవా  బిళ్ళలు చేసి డబ్బాలలో కెత్తి దాచి పెట్టింది. అమ్మాయికి జున్నంటే ప్రాణం. అప్పడు నల్లావు ఇవాలో రేపో ఆడ పేయ్యని వేస్తుందని చెప్పాడు. అది ఈనితే రేపే జున్ను చేస్తాను అనుకుంటూ  ఇంకా బోలెడు పనులున్నాయి అని తృప్తిగా ఇల్లంతా ఒక్కసారి చూసుకొని మురిసిపోయింది రాజేశ్వరి.

.............................

వీధి గేట్ చప్పుడవటం తో  గబ గబ బయటకి వచ్చి భర్త చేతుల్లో  బరువు సంచీలు అందుకొని లోపలికి నడిచింది. " అబ్బాబ్బాబ్బా. రేట్లు మండి పోతున్నాయే. ఒక్క మామిడి పింది పది రూపాయలు. కొత్తచింతపండు కేజీ అరవై రూపాయలు. బెల్లంకుడా  ఎక్కడా దొరకలేదు. ఎలాగో వెదికి ఓ పావుకేజీ తెచ్చాను. ఇదిగో మనవడి గొలుసు. మనవరాలి వెండికంచం. బీరువాలో పెట్టు జాగర్త గా.  ఇవిగో పట్టు లంగాలు జాకెట్లు.  కుట్టు కూలీయే వెయ్యి రూపాయల ట. పట్టణాలని మించి పోతున్నాయి పల్లెలు.  ఏమి పండుగలో ఏమిటో" పెరట్లోకెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి తుండుగుడ్డతో మొహం తుడుచు కుంటు అన్నారు రంగనాధము గారు.

" సరే లెండి. అస్తమానం ఖర్చు పెడతామా ఏంటి. పెద్దాడి కూతురికి సమత్త కి చిన్నాడు కొడుక్కి  దంజెమ్ పోగు వేసే టప్పుడు కొనచ్చు.ఇప్పుడు అమ్మాయి పిల్లలకి కేగా కొన్నది. పిల్లలు పుట్టి ఇన్నాళ్లకు వస్తోంది పిల్ల. ఈ మాత్రం బంగారం కొనక పోతే ఏం బాగుంటుంది. ఇంతకు పిల్లలు మళ్ళీ ఫోనన్న చేశారా లేదా"  భర్తకి అన్నం వడ్డిస్తూ  అడిగింది రాజేశ్వరి.ఆ!  ఉగాది నాడే పొద్దున్నే వస్తానని ఫోన్ చేసాడు చిన్న. వైజాగ్ వరకు ఫ్లయిట్ లో ట. అక్కడినించి కారులో వస్తారుట. పెద్ద వాడు కోడలు అమ్మాయి పిల్లలు రేపు మధ్యాన్నం కి వస్తారుట. చెప్ప మన్నారు"  భోజనంచేసి చెయ్యి కడు క్కొంటు అన్నారు ఆయన.

....................

వికారి నామ సంవత్సరం.ఉగాది.  పండగ వచ్చేసింది. తెల్లారి లేచి స్నా నాదు లు ముగించి అమ్మవారికి ఉపారాలు తీసి ఉగాది పచ్చడికోసం మామిడి తురుము చింత పండు రసం కొత్తబెల్లం కొబ్బరి తురుము తీసి చెరుకు ముక్కలు ద్రాక్ష పళ్ళు కలిపి వేప పువ్వు వేసి చిన్న పండుమిరప తుంచి ఉప్పువేసి బాగా కలియబెట్టి పెద్ద వెండి గిన్నెలో మూతపెట్టి దేవుడికి పూజాదికములు ముగించి నివేదన చేసి భక్తిగా నమస్కరించింది పిల్లలంతా సుఖంగా ఉండాలని. పువ్వులు కళ్లకద్దుకొని ముడిలో పెట్టుకొంది. అప్పటికి అప్పుడే పదకొండు గంటలు అయ్యింది. నిన్ననే  వస్తానన్న అమ్మాయి పెద్దాడు పిల్లలు ఇప్పటికి రాలేదు. రాత్రంతా ఒకటే కంగారుతో నిద్ర పట్టలేదు. భయంగావుంది. చిన్నాడు ఇంకా ఇప్పటికి చేరలేదు. రాజేశ్వరికి ఒకటీ బెంగ గా ఉంది.  చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తోంది . వండిన వన్నీ చల్లారి పోతున్నాయి.  ముక్కల పులుసు మళ్ళి వేడి చేసింది. జున్ను ఫ్రిజ్ లోంచి తీసి బయట పెట్టింది.  అన్నం కూడా మళ్లీ కుక్కర్లో వేడిచేసి పెట్టింది. ఉహు......సాయంత్రం కావస్తోంది. ఎవ్వరు రాలేదు.  నిరాశగా గేట్ వైపే చూస్తూ ఉంది ఆమె. గేట్ చప్పుడైంది. ఆశగా చూసింది రాజేశ్వరి. చూడు రాజీ ఎవరు వచ్చారో.భర్త భుజం కుదిపి తట్టి లేపుతుంటే కళ్ళు నులుముకొని అయో మయంగా చూసింది. అమ్మమ్మా అంటూ నానమ్మ తాతయ్య అంటూ పిల్లలంతా చుట్టూ ముగారు. వెనకాలే ఆశ్రమం డైరెక్టర్ పరమేశం డాక్టర్ రాఘవయ్యగారు వచ్చి అమ్మా. కాస్త ఆలస్యం అయ్యింది .మీ చేతి ఉగాది పచ్చడి తినాలని మేమంతా ఎదురు చూస్తున్నాం. మీ చేతి వంటలు తినాలని ఉవ్విళ్లూరుతున్నాం. మరి ఆలస్య మెందుకు. వడ్డించండి. ఇదిగో పిల్లలు పెరట్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కు రండి. వెళ్ళండి వెళ్ళండి అంటూ పిల్లలను తొందరచేశారు పరమేశంగారు. పద రాజీ పిల్ల లంతా వ చేశారుగా  . పద పద అన్ని వడ్డించు.  ముందు ఆ ఉగాది పచ్చడి అందరికి చేతుల్లో వెయ్యి" తొందరచేశారు రంగ నాధంగారు. రాజేశ్వరమ్మ లోపలికి నడిచింది. డాక్టర్ గారు మీరుకుడా వెళ్ళండి అని సైగ చేశారు రంగ నాధం గారికి.పరమేశం పిల్ల లందరిని వరసగా కూచో బెట్టారు. రాజేశ్వరి అందరి చేతుల్లోనూ ఉగాది పచ్చడి వేసింది. అందరూ ఇంకా ఇంకా కావాలి అని గొడవ చేశారు. తరవాత రాజేశ్వరి వడ్డించిన పంచ భక్ష పరమాన్నాలు ఆప్యాయంగా ప్రేమగా తిన్నారు.  భర్త తెచ్చిన కొత్త బట్టలు పిల్ల లందరికీ పంచింది రాజేశ్వరి.  ప్రేమగా అందరిని ముద్దు పెట్టుకొంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా డాక్టర్ గారిని చూసి కృతజ్ఞతగా నమస్కరించింది.రంగ నాధం కూడా థాంక్స్ పరమేశం గారు. మీ మేలు ఎన్నటికీ మరిచిపోము. రెండేళ్ల క్రిందట ఉగాది పండక్కి వస్తూ కారు ప్రమాదం లో మరణించిన తన పిల్ల లందరు ఇంకా బతికే ఉన్నారని షాక్ కి గురియైన  తన భార్య  మతి మరుపు తో ప్రతి సారి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు  చెయ్యడం నిరాశ చెందటం చూసి డాక్టర్ గారు పరమేశం తో చెప్పి  ఆశ్రమం పిల్ల లందరిని తెచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టించడం బట్టలు ఇప్పించడం  దాంతో రాజేశ్వరి అన్ని   మరచిపోయి మాములుగా ప్రవర్తించడం ఇవన్నీ  అలవాటు అయి పోయాయి రంగ నాధం గారికి.

వస్తాం అమ్మమ్మ వస్తాం తాతయ్య బై బై  అంటూ పిల్లలంతా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్లి పోయారు.

పెరట్లో నల్లావు దూడ " అంబా" అంటూ అరుస్తోంది. ఆవు చుట్టూ పడుతూ లేస్తూ  వచీ రాని నడక తో దాని చుట్టూ తిరుగుతోంది. కొత్త మామిడి చిగురులు తిన్న కోకిలమ్మలు మామిడి చెట్టు కొమ్మపై కుహు కుహు అని అని  తీయ్యగా కూస్తున్నాయి. వసంత రాగం లా వినిపించాయి ఆ  కుహు రాగాలు రాజేశ్వరికి రంగ నాధం గారికి. ఆప్యాయంగా భార్యని దగ్గరకు తీసుకున్నారు ఆయన తృప్తిగా. చైత్ర పాడ్యమి వికారి నామ  సంవత్సరాది ఆరంభ మైంది ఆనందంగా. కుహు....కుహు..
                                   ***

No comments:

Post a Comment

Pages