శివం- 54 - అచ్చంగా తెలుగు
శివం - 54
రాజ కార్తీక్



(కల్పన భారతీ ఋణను బంధాలు తీరిపోయాయి. తన భర్త బిడ్డలకు అంతిమ యాత్ర కర్మ పూర్తి అయ్యింది.)
రోజులు గడవ సాగాయి. కల్పన ఇంటి నుండి బయటకు రాలేదు. అందరికీ ఆమెను మరోసారి ఓదార్చి తిరిగి మళ్లీ మామూలు జీవితానికి అలవాటు చేయాలి అని ఉండేది. కొంత మంది ముత్తైదవులు ఆమెను ముత్తైదువగా అలంకరించి, కల్పనకి ఐదవ తనం పూర్తిగా దూరం చేసే రోజు వచ్చింది.
తన భర్త, బిడ్డ అంతిమ యాత్రలో ఏడ్చిన కల్పన అప్పటి నుండి ఇంకా ఏడవలేదు. ముభావంగా ఉండి పోయింది. తన బొట్టు తీయబోయే సరికి, ఎప్పటి నుండో అగిన కన్నీరు మళ్ళీ వెల్లువలా మొదలయ్యింది.
తన కన్నీటితో పాటు తన అయిదవ తనం కూడా పూర్తిగా పోయింది.
అంతా అయిపోయింది.
కొన్ని రోజులు గడిచాయి..
శ్రావణ శుక్రవారం ...
అందరూ ఎంతో బాగా నోములు వ్రతాలు చేస్కొని అలంకరించుకొని ఉన్నారు.
కల్పన భారతీ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందరూ ఆమె బయటకు వస్తుందేమో అని చూశారు.
అంతా బాగుంటే ఈ శుక్రవారం తను వ్రతం చేస్కోవాలి. కానీ కల్పన భారతికి ఈ విధంగా జరిగింది.
తెల్లని చీరలో కల్పన భారతీ...కళకళలాడే చిట్టి తల్లి బోసి మెడతో, గంగాభాగీరధి  సమానురాలిగా మారింది.
ఆ రూపంలో ఎప్పుడు, ఎన్నడూ లేనంతగా గుండె రాయి చేసుకుంది. అలవాటు లేని తన మొహం చూసి అందరూ డీలా పడ్డారు.
వచ్చిన పెను గాలికి పసుపు, కుంకుమ, పూలు అన్నీ వచ్చి సరిగ్గా కల్పన ముందు పడ్డాయి. తనని తకటం ఇష్టం లేనట్టు.
కల్పన భారతీ మనసులో తెలియని ఆవేదన. ఇక ఎవరేమి అనుకుంటే ఏమిటి అంతా అయిపోయాక? అని నిర్వేదం.
తన పాదాలు ఇదివరకు తన వారి మృత దేహాల దగ్గర ఆగాయి. మళ్లీ ఇప్పుడు తన పాదాలు మరో ప్రయాణానికి సిద్దం అయ్యాయి.
తనకు ఎంతో స్వాంతన చేకూర్చే సంగీత పాఠాలు చెప్పడానికి మళ్లీ బయలు దేరింది.
చూడండి భక్తు లారా!
జీవితంలో ఏది ఏమైనా మీ ప్రయాణం అపకండి. మీ లక్ష్యం మీ జీవితంలో జరిగిన దురదృష్టాలతో అగిపోకూడదు. నన్ను నమ్మి మీ లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయండి . మానవత్వాన్ని, నిజాయతీని, భక్తిని, పాటించండి. మీ బాహ్యా లక్ష్యాలకు కృషి చేస్తూ, మీ మనసులో నాకు ఆలయం కట్టండి. కొలువయ్యి మీ ఇహపరాలు చూస్తాను.

అడుగు అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్న కల్పన భారతీ, ఇది వరకు తాను ఎలా ఉందో, ఇప్పుడు తాను ఎలా ఉందో అర్దం చేసుకుంటోంది.
తాను ఎవరినైతే  అవమానిచిందో, వారే తనకి చివరికి గతి అయ్యే సరికి తను ఇదివరకు చేసింది ఎంత తప్పో పూర్తిగా అర్దమయ్యింది. 
అలా కల్పన భారతీ పూర్తిగా స్వచ్ఛమైన మనసుతో చూడటం మొదలు పెట్టింది. 
కల్పన భారతీ రాకను చూసి, ఆలయంలో మళ్లీ సంగీత పాఠాలు మొదలయ్యాయని తెల్సుకుని, అందరూ తమ పని తాము మొదలు పెట్టారు.
క్రమేణా కల్పన భారతీ కీర్తనలలో ఇదివరకు కన్నా భక్తి  వెల్లువ పొంగి పోయింది. తను అకుంఠిత దీక్షతో సాధన చేసేది, చేయించేది. తనకున్న నేస్తం, సాయం - దైవం, సంగీతం మాత్రమే.
మనసులో ఏ కోరికా లేకుండా నాకు నమస్కరించి తను స్వర ప్రార్థన మొదలు పెట్టేది.
తన పాటకు ప్రకృతి, పశు పక్ష్యాదులు కూడా పులకించేవి.
సంగీతం, సంగీతం, సంగీతం మాత్రమే కల్పన భారతీ భాష.
ప్రతి ఒక్కరూ కూడా కల్పన భారతిలో వచ్చిన మార్పు చూసి, ఆమెకు నెమ్మదిగా దైవత్వం వచ్చిందని అనుకోవడం మొదలుపెట్టారు.
కీర్తన మధ్యలో ఎన్నో సార్లు తన కంఠ స్వరం తడి అరిపోయి, శోక రాగం విన పడేది.
విద్యార్థులు కూడా ఆమె స్వరంలో మార్పు గమనించి ముభావంగా ఉండేవారు.
గుడిలో మాత్రం .."ఆమె గాత్రం .. పరమేశ్వరుడి కోసం "అనుకో సాగరు.
ఆ చిట్టి తల్లి ఆక్రందన నన్ను చేరింది.
ఇక తనను నేను సముదాయించాలి.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages