శ్రవణ పురాణం - అచ్చంగా తెలుగు
 శ్రవణ పురాణం  
  -ఆదూరి.హైమావతి.     
       

అనగనగా ఒక ఊర్లో ఒక పౌరాణికుడు ఉండేవాడు.ఆయన అనేక శాస్త్రాలు చదివి ఊరూరా తిరిగి అలయాల్లో పురాణం చెప్పేవాడు. ఊరివారిచ్చిన సొమ్ముతో జీవనం  సాగించేవాడు.
           ఒక మారు ఒక ఊర్లో రామాలయంలో ఉత్సవాలు జరుగుతుండగా , ఊరిపెద్దలు ఆపౌరాణికుని గురించీ విని  ఒక వారంపాటు ఆలయంలో సప్తాహం చేయను ఒప్పించారు.
       ఆ ఊరి రామాలయంలో ఆ పౌరాణికుడు మొదటిరోజు పురాణం మొదలు పెట్టేసమయానికి అర్ధ గంటముందే ఒక వనిత వచ్చి మొదటి వరుసలో కూర్చుంది. ఆమెభర్త ఆ మధ్యే మరణించగా పురణ మన్నా వింటే మనస్సు నెనెమ్మ దిస్తుందని వచ్చి కూర్చుంది.
             అలాప్రతిరోజూ పురాణం  మొదలయ్యేముందే ఆమె శ్రధ్ధగావచ్చి మొదటి వరుసలోకూర్చుని పౌరాణికుడు పురాణం  చెప్తూ , మధ్యమధ్యలో పద్యాలూ, పాటలూ పాడుతుండగా ,చెప్పినంతసేపూ వలవలాఏడుస్తూ ఉండటాన్ని ఆయన గమనించాడు .
       సప్తాహం ఐన చివరి రోజున పూర్ణాహుతి కాగానే తీర్ధాన్ని తీసుకుని ఆమె వద్దకు వచ్చి , అందరితో "అయ్యలారా! ఈమె ప్రతిదినం ముందేవచ్చి కూర్చుని పురాణాన్ని శ్రధ్ధగావిని కంటనీరు కారుస్తూ కూర్చుంది. అందు వల్ల మొదటి తీర్ధం ఇవ్వను ఈమె అర్హురాలు.తల్లీ! ఎన్నెన్నో ఊర్లు తిరి గానుకానీ  నీ అంత భక్తురాలిని నాజన్మ లో చూడలేదు. పురాణం నీకు అంత బాగా నచ్చిందాతల్లీ!" అని అడి గాడు పౌరాణికుడు.
ఆమె కళ్ళు ఒత్తుకుంటూ " అయ్యా! మీరు పురణమే చెప్పారో, రామాయణ మే చెప్పారో నాకు తెలీదు. మీరు ఆగ్రంధానికి కట్టిన నల్లని త్రాడు చూసి, మా ఆయన కట్టుకున్న  మొలత్రాడు గుర్తువచ్చి రోజూ మీరు పురాణం చెప్తున్నంతసేపూ ఆత్రాటిని చూస్తూ మా ఆయన్ని గుర్తుతెచ్చుకుని ఏ డుస్తూ ఉన్నాను." అనిచెప్తుంది.
ఆమె మాటలకు అంతా తెల్లబోయరు.
మనసు దైవం మీదకుపోనపుడు  ఎక్కడకూర్చున్నా ఒకటే. చిత్తాన్ని స్వాధీనపర్చుకోను పురాణాలకే వెళ్ళక్కరలేదు.
                                             ***

No comments:

Post a Comment

Pages