ఈ దారి మనసైనది - 22 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 22



అంగులూరి అంజనీదేవి


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ. తాజ్ మహల్ చూస్తూ ఉంటారు.)  
 అబ్బాయిలందరు నడిచి మంచుకొండలపైకి ఎక్కారు. కొండపైకివెళ్తున్న కొద్ది ఆక్సిజన్ సరిపోదు. కాబట్టి, ఆయాసం వస్తుందని అమ్మాయిల్ని గుర్రాలపై పైకి రమ్మన్నారు.

"నా వల్ల కాదు నేను పైకి రాను, ఇక్కడే వుంటాను."అంటూమన్విత ఓ చోట కూర్చుంది. ఇంకా కొంత మంది అమ్మాయిలు కూడా అలాగే అన్నారు.
దీక్షిత మాత్రం పైకి వెళ్లింది.
అక్కడికెల్లాక అబ్బాయిలు, అమ్మాయిలు మంచుగడ్డలతో ఆడుకున్నారు. క్లాస్ మెట్స్అయినందువల్ల వాళ్లలో ఎటువంటి నెగటివ్ఫీలింగ్స్ లేనందువల్ల ఆ వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అనురాగ్ ఆ మంచుతో ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మకి తన ఊపిరితో జీవం పోసి, ఆ బొమ్మ చేతిలో ఒక లవ్ సింబల్ పెట్టి ఆ సింబల్లో తన మనసును నింపి దీక్షితకి ఇచ్చి ప్రపోజ్ చేశాడు.
ప్రకృతిలో ప్రతి అణువు తమని ఆశీర్వదిస్తున్నట్లే అతని ఊహ...
దీక్షిత తన అందమైన కనుదోయిని ఆ బొమ్మ పై నిలిపి. ఇన్ని రోజులు తన తల్లి దండ్రులు... పిల్లల చదువులు ఒక దారికి రాలేదని బాధపడు తుండడం వల్ల, అన్నయ్య మహధీర్ఎం.బి.ఎ. పూర్తయ్యి జాబ్ సర్ఫింగ్లో వుండటం వల్ల తన ప్రేమ విషయం తెలిస్తే డిస్టర్స్ అవుతారని ఎటూ తేల్చుకోలేకపొయింది. కానీ ఇప్పడు మహధీర్కి వరంగల్ లోనే మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. తల్లి దండ్రులు కూడా ఇప్పడిప్పడేకాస్త్ర రిలీఫ్ గా ఫీలవుతున్నారు. ఇంక తనకి అభ్యంతరం ఏముంటుంది?
అనురాగ్ లో  లేని క్వాలిటీ కానీ, తనకి నచ్చని హాబీస్ కాని ఏమున్నాయి? అంతా ఓ.కె. అని తనలో తాను ఆలోచించుకుంటుంటే....
ఒక్క క్షణం అనురాగ్ కంగారు పడి ...
“నీకు ఇష్టం లేక పోతే.. " అంటూ బొమ్మ మీద చేయి వేశాడు.
తన విలువైన జీవితం ఎక్కడ చేయి జారిపోతుందోనని ఆత్రుతగా.... తనకి ఇష్టమే అన్నట్లుగా అతని చేయివిూదచేయివేసూ,ఈ అద్భుతమైన క్షణాల కోసమే ఎదురుచూస్తున్నదానిలా అపూరూపంగా, అపూర్వంగా నవ్వింది.
ఆ చూపు, ఆ నవ్వు అనురాగ్ కి జీవితంలో ఎప్పడూ మరచిపోలేని విధంగా హత్తుకు పోయాయి.
గుప్పెడు అనుభూతికోసం హృదయాన్ని పోగొట్టుకునే ఏ క్షణమైనా మధురమైందే. ప్రతి క్షణం ఆ అనుభూతిలో మునగాలని ఎవరికైనా వుంటుంది. ఆ అనుభూతిని కోరుకుంటూ... ఆ బొమ్మను కరిగిపోకుండా జాగ్రత్తగా పట్టుకొన్నారు.
సాయంత్రం నాలుగుగంటలకి .  అక్కడే వున్న పారాషూట్లను ఎక్కారు.
ఆరుగంటలకి హోటల్ కి వచ్చాక కొంత మంది అబ్బాయిలు,అమ్మాయిలు రివర్ రాఫ్టింగ్ చేశారు.
తర్వాత పక్కనే వున్న ఇండో టిబెట్ జవాన్స్ ట్రైనింగ్సెంటర్ ను చూసి...
ఉదయం ఆరుగంటలకి హరిద్వార్ చేరుకున్నారు.
హోటల్లో ప్రెష్అప్ అయి టెంపుల్కి బయలుదేరారు.
టెంపుల్కివెళ్లేదారిలో.... గంగానది పరవళ్ళు తొక్కుతూ తన మధ్యలో వున్న శివుని పాదాలను తాకుతూ, వేగంగా ప్రవహిస్తూ, ఆటెంపుల్ వున్న కొండలోంచివెళ్తోంది.
దైవదర్శనం కోసం "రోప్ వే “ లో కొండ పైకి వెళ్లారు.
ఆ వుణ్యస్థలంలో ఉదయం వచ్చిన స్వాములు, భక్తులు సాయంత్రం ఆరుగంటలవరకు అక్కడే వుండి స్నాన గట్టాల్లో స్నానాలు ముగించుకొని "దీపార్బన" కోసం అలాగే కూర్చున్నారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages