కనులు మూసుకుని
మంచాన్ని జో కొడుతున్నా!
నిద్ర నన్నులాగుతుందా
నేను నిద్రను లాగుతున్నానా
తర్జనభర్జన !
ఒంటరిగా నడక !
కలో నిజమో!
అక్కడో నందనవనం
తీరొక్కపూలతో కన్నుగీటింది.
సన్నజాజులు,గొండుమల్లెలు,
గులాబీలు,నిత్యమల్లెలు,
చేమంతులు,బంతులు,
కనకాంబరాలు
ఎన్నికోసి దోసిటపట్టినా
దోసిలినిండదు
కోసిన కుసుమాలన్ని
తిరిగి తల్లిచంకనెక్కుతున్నాయ్
కనకాంబరాలు తప్ప!
కనకాంబరాలు తెస్తానన్నారు?
ఆకాశవాణిలో పిలుపులా
చెవిని ముద్దాడుతున్న మధురస్వరం
దోసిటీలో కనకాంబరాలు కనుమరుగై ముద్దబంతిలా కళ్లెదుట నా శ్రీమతి
ఇంకా చురుకెక్కని ఉషా కిరణాలంత
చల్లనిచూపుల అలకబూని!
***
No comments:
Post a Comment