వరంలాంటి జీవితం
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఎప్పుడన్నా..
కాస్త సమయం చిక్కినప్పుడు
మనసు తోటలో అలా అలా విహరిస్తే
అందమైన పూలమొక్కలు
గంధపు సువాసనలు
విరిసిన ఇంద్రధనుస్సులు
కోకిల కూజితాలు
నడయాడే నెమళ్లు
ఓహ్! నా మనస్సే స్వర్గమన్నది
అనుభవంలోకి వస్తుంది
ఈ మధురానుభూతి కోసం
నేనెంత కష్టపడ్డానో..
ఊహ తెలిసినప్పటి నుంచి
మనసులోకి ముళ్లూ, రాళ్లూ చేరకుండా
మురికినీళ్లకు ఆవాసం కాకుండా
కౄర జంతువులు విహరించకుండా
అప్రమత్తంగా ఉన్నాను
అందుకే
తనువూ మనసుల ప్రశాంతతతో
వరంలాంటి జీవితాన్ని
సంతోషంగా అనుభవిస్తున్నాను
అనుభూతిస్తున్నాను.
***
No comments:
Post a Comment