శ్రీవీరనారాయణ శతకము - రావూరి సంజీవకవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవిపరిచయము:
శ్రీవీరనారాయణ శతకకర్త రావూరి సంజీవకవి గుంటూరు మండలమునందలి రావూరు నివాసి. సాంఖ్యాయాన గోత్రుడు. ప్రథమశాఖ నియోగి బ్రాహ్మణుడు. రావూరి రఘుపతి పౌత్రుడు. గురవకవీంద్ర పెదమాంబల ద్వితీయ పుత్రుడు. అన్న మృతుంజయుడు. తమ్ముడు రఘునాధుడు. శతకాంతమున తనగురించి తాను ఈ విధంగా చెప్పికొనినాడు.
సీ. శ్రీకృష్ణపదయుగాశ్రితుఁడ సాంఖ్యాయన, గోత్రుఁడ రఘుపతి పౌత్రుఁడ గుర
వకవీంద్ర పెద్దమాంబాపుత్రుఁడ రఘునా, థునకుఁ బూర్వజుఁడ మృత్యుంజయున క
నుజుఁడ రావూరువంశజుఁడ ననుమకొండ, సౌంజ్ఞగల్గిన యాదిశాఖను వెల
సినవా@డ జాతకసిద్ధాన్తముఖకళా, చతురుఁడ నుభయభాషావిశేష
తే. రసగుణాలంకృతి కవిత్వరసికుఁడ విర
చించితి భవచ్ఛతకము సంజీవకవిని
కుంఠితాశ్రిత భవభూక కొలిపాకపురనివాస
వీరనారాయణ! ముకుంద! విశ్వతుంద!
ఈకవి బహుగ్రంధకర్త గా తెలిస్తున్నదికానీ ఒక్క వసుదేవనందన శతకము, వీరరాఘవ శతకము, రుక్మిణీపరిణయము మాత్రమే లభ్యము. ఈ కవి ఈశతకమును క్రీ.శ. 1720 ప్రాంతాలలో తన 20 వ యేట రచించినట్లు చెప్పికొనాడు.
శతక పరిచయం:
" కొలిపాక (కొలనుపాక) పురనివాస వీరణరాయణ! ముకుంద! విశ్వతుంద!" అనే మకుటంతో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. 109 గునుగు సీసపద్యాలతో రచింపబడినది. శ్రీకృష్ణలీలలు ప్రధానాశముగా ఈశతకం సాగుతుంది. దశావతార వర్ణన, యోగ సబంధిత వివరాలు కూడా ఈశతకంలో మనకు కనిపిస్తాయి.
కొన్ని పద్యాలను చూద్దాము.
సీ. కృష్ణాయ విష్ణవే జిష్ణవే హరయే స్వ, యంభువే శంభవే హారిణే త్రి
విక్రమాయ స్వభువే విభవే చక్రి, ణే సంఖినే శార్జ్గణే దివే భు
వే! మాధమాయస్థనిష్ఠాయ భక్తరా, యేగరిషాయ సురేశ్వరాయ
యాతుద్విషే నవనీతముషే శ్రీసు, రాజ్ఞే భగవతే ధరాధరాయ
తే. మునివరాయచ తుభ్యం నమో నమో య
టంచు నతిసల్పెదను పరా కతులనంద
కలవితారిశిరశ్శాక కొలనుపాక .....
సీ. గట్టిగ నీపాదకమలమేపట్టితి, సత్యము సత్యము సందియంబు
లేశమైనను లేదు లేదు దీనికి నగ్ని, ముట్టెద బామును బట్టెద నిఁక
నేమి సర్వజ్ఞుఁడ వీ వెఱుంగవె నాయె, డ పరాకు గాక యా యిపుడు పాల
ముంచెదవో నీట ముంచెదవో నీకె, తెలియున్ననన్యగతికుఁడ నొరుల
తే. వేఁడ నీవాఁడ నోమాయలాడ స్వభుజ
మండలితధనుర్గతకాండ భను
కుండలిత దైత్యఘనఘూక! కొలనుపాక ....

సీ. గండుతేటులలీల గ్రాలుముంగురులు భు, గ భుగ పరిమళించు గస్తురితిల
కపునెన్నుదురు చొక్కటపు చెక్కిళులు మావి, తలిరుబో ల్మోవి మొసళిలహొయలు
గులుకుప్రోగులు సిరి బెళుకు వీనులు సింగి, ణులరంగు నగుకన్బొమ్మలు చకచక
దళుకు లొలుకు తలిదమ్మిరేకులవంటి, కన్నులు సంపఁగి కళికబోలు
తే. నాసికము మొల్క లెత్తెడి నగవు గలిగి
నట్టి నీమోముఁ జూపవే యసురవిసర
దళనచంచచ్ఛరానీక కొలనుపాక ...
దశావతార పద్యాలను కొన్ని చూద్దాము
సీ. మలరాచకవ్వము జిలువరాయాకత్రాఁ, టను బట్టి పాలకడలి పనఁటి నొ
కకడను సోఁకుమూఁకలు రెందవయెడను, జేజేలు గొని నీరుజిలుకఁగ గుభ
గుభగుభ ధ్వనుల నక్కొండమున్నీటిసు, డిని గ్రుంకుచున్న కఠినకపాల
మునఁ దాల్చి యుద్ధరించిన నీదుకమఠావ, తారము వారము వారము నెద
తే. నెంతు సంతత దశదుశాక్రాన్తస్తదైత్య
హసన జననప్రతాప మహాప్రదీప్త
జలరుహాప్తారుణాలోక కొలనుపాక.....
సీ. దనుజరాజు సభాభవనఘనస్తంభము, పెటపెటబగులించె వెడలి కహక
హాట్టహాసార్భటి సరిమురి దశదిశల్, గలఁగ జగద్భయంకరనృసింహ
రూపముతో సుతద్రోహియైన కనక, కశిపు రక్కసుఁబట్టి కఱచి చఱచి
ఖరనిశాతనఖరాఖండశస్రేముల ఖ, సిక్కు ఖసిక్కునఁ జించి ద్రుంచి
తే. మించి ప్రహ్లాదుఁ గాచి మన్నించి యలుక
డించిన మహాత్ము నిన్నుఁ బఠింతు గీర్తి
గుంభితాకుంభినీనాక కొలనుపాక ......

ఇటువంటి చక్కని గునుగు సీసపద్యములతో కూడిన ఈశతకంలో ఫిరంగీ వంటి అన్యభాష పదములను కూడా కవి సమయానుకూలముగా ప్రయోగించినాడు. కవి సంస్కృత ఆంధ్ర భాషా ప్రవీణుడు కనుక ఈశతకంలో ఈరెండు సమపాళ్ళలో మనకు కనిపిస్తాయి. భాష ప్రవాహంలో సాగిపోతుంది.
ఇంతచక్కటి శతకాన్ని మీరూ చదవండి ఇతరులచే చదివించండి.
ఇంతచక్కటి శతకాన్ని మీరూ చదవండి ఇతరులచే చదివించండి.
***
No comments:
Post a Comment