అంతర్లీన సర్పం - అచ్చంగా తెలుగు
"అంతర్లీన సర్పం "
  సుజాత తిమ్మన ..




జ్ఞాన సరస్వతమ్మ కరుణ వలన

పుట్టుకతో అబ్బిన భావ ప్రకటన జ్ఞానాన్ని ..

జీవన గతిలో మనుగడ కోసం

అక్షరాలలో అంతరాన్ని నొక్కేసి..

సత్యాన్వేషణల మార్గాలను ..

బోధన చేస్తూ..

మంచితనానికి మహిమలను

ఆపాదించుకుంటూ..

అద్భుతమైన అల్లికల సోపానాలు వేస్తారు..

పుస్తకరూపంలో ..
అంతర్లీనంగా ఆ మనిషనే

పుస్తకాన్ని తెరిచి చూస్తే..

కనిపిస్తుంది ఒక కాల సర్పం..

అమృతపు వాక్కులలో...

చిందే విషం..

అక్షర మాలికలు అందంగా ఉన్నాయని

ఆశతో చేత బట్టితే...

ఆ పాము కాటుకు బలి అయి..

అవుతాము నిర్జీవం...
విషయాన్నీ గ్రహించి ..

విషమాన్ని విడవాలి..

సమయాన్ని సమీకృతం చేసుకుంటూ..

మన దారి నడవాలి..

విషపు కోరలు వెంటపడినా..

వినమ్రతతో గెలవాలి...

నిత్య సత్యంలో నిలిచి ..

నిజాయితీగా మెలగాలి..

ఏ రక్కసి సర్పమైనా ..

నాగేంద్రుడై దీవించాలి..!!
******


No comments:

Post a Comment

Pages