జోక్స్ - తురగా శివరామవెంకటేశ్వర్లు
1.ఏవండీ.
పొద్దున్నించి ఏమీ తినకుండా ఒక గ్లాసుడు పాలు మాత్రం తాగి దేవుడు దగ్గర
కూర్చున్నారు. ఒంటిగంటయింది. లేవండి ఇంక. అరిచింది భార్య.
నేనేమిటో తెలుసా
నీకు? ఆరవతరగతి నుంచి పదవతరగతి
వరకు 'పాలు సంపూర్ణ
ఆహారము అందురు ఏల?' అన్న ప్రశ్నకు
సమాధానం వ్రాసి పూర్తి మార్కులు తెచ్చుకున్న వాడిని. నాఎదుట పాలుని అవమాన
పరుస్తావా? అంటూ తిరిగి అరిచాడు ఆకలితోభర్త .
2." ఏమిటే .
ఇంట్లో నాకు ఏపనీ చేసి పెట్టవు. కనీసం ఒక చొక్కా అయినా విస్త్రీ చేయవు."
విసుక్కున్నాడు భర్త. "ఏమండీ. మీసేవ
ఆఫీసులో చేసి చేసి ఇంట్లో కూడా మీ సేవ
ఎల్లా చేయగలనండి?" అంది భార్య.
"నోర్ముయి! ఆఫీసులో నా సేవ చేయడ మేమిటి?కసిరాడు భర్త. "అయో! అదికాదు. నేను మీసేవా
కేంద్రం ఆఫీసులో పనిచేస్తున్న సంగతి మరచి పోయారు" చెప్పింది వినయంగా భార్య.
3.” మీ పక్కన
ఉన్నది ఎవరు? అడిగాడు
వెంకటరావురావు సుబ్బారావుని. మన సంస్కృతం మేష్టారు అబ్బాయి. చెప్పాడు సుబ్బారావు.
ఈయన కీ సంస్కృతం వచ్చా ఏమిటి అడిగాడు మళ్లీ వెంకటరావు. అయ్యో. రాక పోవడమేమిటీ.
పండితుడు. కోపం వస్తే సంస్కృతంలో తిడతాడు.
చెప్పాడు గొప్పగా సుబ్బారావు.
4.సేల్సు మేన్ గా
నీ అనుభవం, సత్తా గురించి ఒక్క వాక్యంలో చెప్పు. ?
ఒక ఇంటర్వ్యూలో
ప్రశ్న .
గుండున్న వాళ్ళకి
దువ్వెన్నలు అమ్ముతాను సార్. జవాబు.
యు ఆర్ సెలెక్టెడ్. రెస్పాన్స్.
***
No comments:
Post a Comment