శాస్త వైభవం - 6 - అచ్చంగా తెలుగు
శాస్త వైభవం - 6
శ్రీరామభట్ల ఆదిత్య


5.సమ్మోహన శాస్త:
ఆ ధర్మశాస్తుడు ఐదో‌రూపం శ్రీ సమ్మోహన శాస్త. సమ్మోహన శాస్త ‌స్వరూపం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. స్మామిని పూర్ణాదేవి‌ మరియు పుష్కళాదేవితో పాటు పూజిస్తారు. స్వామి వారి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో ఉన్న కైవిళన్చేరి అనే ఊరిలో ఉంది. ఇక్కడ స్వామి వారిని 'కైవిడేల్ అప్పన్' అని పిలుస్తారు. స్వామి ఇక్కడ చతుర్భుజధారి. ఇక్కడ కృత్తిక నక్షత్రం రోజున విశేష పూజలు నిర్వహిస్తారు.  ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టబడినదట.
ప్రతి సంవత్సరం మార్చి నెలలోని చివరి ఆదివారం రోజున 'లక్షనామార్చన' నిర్వహిస్తారు. ఇది ఇక్కడ జరిగే అద్భుతమైన పూజగా చెప్తారు. ఇక్కడ స్వామితో పాటుగా 'కళ్యాణ వినాయకుడు' కొలువై ఉన్నాడు. వివాహ సంబంధమైన సమస్యలు ఉంటే ఈ స్వామిని దర్శిస్తారట.
6. సంతాన ప్రాప్తి శాస్త:

శుక్ర గ్రహానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఈ స్వామిని దర్శించుకోవడం మంచిదని చెబుతారు. స్వామి వారి అర్థాంగిని పేరు ప్రభావతీదేవి. అమ్మవారు మాణిక్య వీణతో దర్శనం ఇస్తుంది. ఈ కారణం చేతనే స్వామివారిని బ్రహ్మదేవుడి స్వరూపంగా కొలుస్తారు. స్వామికి సత్యకుడనే కుమారుడు కూడా ఉన్నాడు.

సముచయం మరియు శిల్పరత్నం అనే గ్రంథాలలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞపురుషుడి రూపంలో వచ్చి ఈ స్వామే దివ్య పాయసాన్ని దశరథుడికి ఇచ్చాడట. ఈ విషయం వాల్మీకి రామాయణంలో లేదు. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని ఆదూర్ అనే గ్రామానికి సమీపంలో ప్రభావతి దేవి సత్యకుడితో సమేతంగా ఉంటాడు.  పేరుకు తగ్గట్టుగానే స్వామిని సంతానప్రాప్తికై పూజించడం చాలా సత్ఫలితాలను ఇస్తుంది.
***

No comments:

Post a Comment

Pages