శ్రీథరమాధురి - 68 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 68

Share This
శ్రీథరమాధురి - 68
                     (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


వయసు పెరుగుతున్న కొద్దీ, జీవితంలో పొందిన అనుభవాల దృష్ట్యా పరిణితి పెరుగుతుందని ఆశిస్తారు. కాని, చాలాసార్లు ఈ సిద్ధాంతం వాస్తవానికి దూరంగా ఉండడం చూసాను. చాలామంది పెద్దలు పరిణితి లేకుండా ప్రవర్తిస్తారు, కుర్రాళ్ళు నమ్మదగ్గ విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి, వేలాది ఏళ్ళుగా ఆత్మ యొక్క పరిణితి ఇక్కడ ప్రముఖమైనదని, ఒక్క జన్మలో దేహం యొక్క వయసు లెక్కలోకి రాదనీ తెలుస్తోంది.

ఏదైనా మంచి అంశం ముగిసిపోతే, మరింత మెరుగైనది మొదలవుతుంది.
ఏదైనా మెరుగైనది ముగిసినప్పుడు, సర్వోత్తమమైనది మొదలవుతుంది.
ఏదైనా సర్వోత్తమమైనది ముగిసినప్పుడు, సంతృప్తి మొదలవుతుంది.
అన్ని ఆరంభాలకు ముగింపు ఈ సంతృప్తే !

మీరు వచ్చే ముందే దైవం వస్తారు,
మీరు ఈలోకంలోంచి వెళ్లాకే  దైవం వెళ్తారు,
మీరు ఎల్లప్పుడూ ఆయన హృదయంలోనే ఉన్నారు...
ఓ బుద్ధీ, నువ్వెందుకు దిగులు పడతావు?

ఆమె- గురూజీ, నాకు భగవద్గీతను వివరిస్తారా?
నేను – ఇప్పటికే  ఉన్న అనేక వివరణలతోనే అంతా గందరగోళానికి గురౌతున్నారు. ఈ అయోమయంలో నన్ను కూడా కలపాలని చూస్తున్నావా?

ప్రేమను మాటల్లో వ్యక్తపరచినప్పుడు, దాని సారాన్ని అది కోల్పోతుంది.

అతను – గురూజీ, భారత సర్వీస్ ఆఫీసర్ అయ్యేలా నన్ను దీవించండి.
నేను – నువ్వు కాకపొతే ఇంకెవరు అవుతారు?
తర్వాత అతను ఆఫీసర్ అయ్యాడు.
ఆ తర్వాత,
అతను నన్నిలా అడిగాడు – నా దృక్పధం ఎలా ఉండాలి?
నేను – నువ్వు చెయ్యగాలేంది, ఎవరు చెయ్యలేరు?


ప్రతివారి జీవితంలో కొన్ని చీకటి ఛాయలు ఉంటాయి. దాని గురించి దిగులుపడకండి. మీరు కర్తలు కాదు. అది దైవేచ్చ వలన అలా జరిగింది. చీకటి గతాన్ని మర్చిపోవడం నేర్చుకోండి. దాన్ని వదిలేసి, సాగిపోండి. మీ గురించి తక్కువగా భావించుకోకండి. మీ చీకటి గతాన్ని ప్రస్తావిస్తూ మీ ప్రస్తుతాన్ని పాడుచేసే అవకాశం ఎవరికీ ఇవ్వండి.

***

No comments:

Post a Comment

Pages