ఆర్తి - అచ్చంగా తెలుగు
demo-image
ఆర్తి 
-సుజాత. పి.వి. ఎల్.


ws2

సంతోషాలన్నీ
నీతోపాటే
రెక్కలొచ్చిన
పక్షుల్లా ఎగిరిపోతుంటే
నా విషాదం సహజమే కదా!

మన ప్రణయ శ్వాసలన్నీ
దీర్ఘ నిట్టూర్పులో
కొట్టుకుపోతుంటే. .
నా ఆర్తి సమంజసమే కదా!

నా ఆనoదం
నీ వియోగంలో ఆవిరైపోతుంటే..
బరువెక్కిన రెప్పలని
బలవంతంగా మూసేయడమే
సబబు కదా!
*****

Comment Using!!

Pages