ఆత్మీయులు
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.
నా జీవిత బండికి కమ్ములు,
నా అన్నదమ్ములు.
నా పిడికెడు గుండెను
స్పర్శించే దమ్ములు,
నా అన్నదమ్ములు.
నా మనుగడ ముంగిటవీచే
మలయమారుతమ్ములు,
నా అన్నదమ్ములు.
నా అనుబంధపు భవనమ్ములు,
నా అన్నదమ్ములు.
నా ఆత్మీయతా కంటిచెమ్మలు ,
నా అన్నదమ్ములు,
ప్రేమకు పట్టుకొమ్మలు,
నా అన్నదమ్ములు.
నా హృదయ నందనాన
పూసిన పూల రెమ్మలు,
నా అన్నదమ్ములు .
***
No comments:
Post a Comment