జోక్స్ - తురగా శివరామవేంకటేశ్వర్లు
5. పశువుల డాక్టరుగా పనిచేస్తున్న పాపారావు చాలా కాలం తర్వాత మిత్రుడైన రంగారావు ని కలిశాడు. రంగారావు ఆప్యాయంగా కాగలించుకున్నాడు పాపారావు ని. పాపారావు "సంతోషం రా ! నన్నుమరచిపోనందుకు"అన్నాడు రంగారావుతో. "నిన్నెలా మరచి పోతానురా! ఏ పశు వును చూసినా నువ్వే గుర్తుకొస్తా వ్" అన్నాడు భుజం తట్టు తో రంగారావు.
6.కాలింగ్ బెల్లు మోగడంతో వీధి తలుపు తీసింది భద్రకాళి..ఎదురుగా లెదరు బాగ్ తో నుంచుని ఉన్న అతనిని అడిగిం ది. "ఎవరు నువ్వు? ఏమికావాలి ?"" అని
"X- సబ్బుల కంపెనీ సేల్సుమెన్ ని. మా సబ్బులు గురించి మీకు చెప్పి కొనమని అడగడానికి వచ్చాను." అన్నాడు.
"ఏమిటి మీ సబ్బుల గొప్ప "అంది భద్రకాళి.
"ఏమిటి అమ్మా! ఆల్లా అంటారు? సినీ తారల నందరూ మా సబ్బులే కొంటారు తెలుసా?"అన్నాడు.
"అయితే వాళ్ళ దగ్గరికే వెళ్లు. నేను సినీ తారను కాదు." అంటూ భళ్లున తలుపు మూసేసింది. భద్రకాళి.
7. డాక్టరు: ఏమయ్యా. మీనాన్న నేను వ్రాసిన మందులు వాడుతున్నాడా?
లేదండీ.
ఏం?
మీ బిల్లు కట్టిన రోజునే ఆయన రోగం కుదిరిపోయిందండి!
ఆ !.
8. “నువ్వు పండిత పరమేశ్వరావు కొడుకువు కదూ?” అడిగాడు రామేశం
“అవునండీ”. జవాబు
“సంతోషం. పండిత పుత్రుడవన్న మాట.” అన్నాడు రామేశం
వెంటనే చెంప చెళ్లుమనిపించి, “నన్ను పండిత పుతృడవంటావా”
అన్నాడా పుత్రుడు రామేశా న్నిఒక సామెత జ్ఞాపకమొచ్చి.
9. భర్త: ఏమిటే! ఈవేళ నన్ను కేకలుతో ఇల్లా ఉతికి ఆరేస్తున్నవ్?
భార్య: 3 రోజులనుంచి నా చీర లా నన్నే అంటిపెట్టుకుని ఇంట్లో కూర్చుంటే ఒక సారి ఉతుక్కోవద్దా.?
10. "ఏరా ! కాంతయ్య పరమ పిసినారి అన్నావు . ఏం . ఎందుకలా నిపించింది నీకు ?" అడిగాడు ఫ్రెండుని . ఓహ్ ! అదా . మొన్న నేను వాడింటికెళ్లినప్పుడు మందులు సంచిలో రెండు జ్వరం మాత్రలు 4 రోజుల్లో ఎక్సుపైర్ అయేవి కనపడితే తనకి వెంటనే జ్వరం వస్తే బాగుండునను కున్నాడు" చెప్పాడు ఫ్రెండు .
***
No comments:
Post a Comment