శాస్త వైభవం - 7 - అచ్చంగా తెలుగు
శాస్త వైభవం - 7
శ్రీరామభట్ల ఆదిత్య 


7. వేద శాస్త:
ధర్మశాస్తుడి ఏడవ రూపమే వేద శాస్త స్వరూపం. స్వామి వారి మరొక పేరే 'సింహారూఢ శాస్త'. అయ్యనార్ అన్నా అయ్యప్ప అన్నా ఒక్కరే. కేరళ రాష్ట్రంలో ధర్మశాస్తుడు 'అయ్యప్ప'గా ప్రసిద్ధి చెందితే, తమిళనాడు రాష్ట్రంలో 'అయ్యనార్'గా పేరుగాంచాడు. వేదశాస్తుడు అమితమైన జ్ఞానానికి ప్రతీక. అందుకే ఆయన పేరు వేద శాస్త్రగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా వేడికరంపాళయంలో స్వామివారిని 'వేద నాయక' శాస్తుడిగా పూజిస్తారు. స్వామివారి చుట్టూ ఉండే నాలుగు వేపచెట్లు ఋగ్యజుస్సామాథర్వణ వేదాలకు ప్రతీకలు.

8. వీర శాస్త:
ధర్మశాస్తుడి ఎనిమిదవ రూపమే శ్రీ వీర శాస్త. స్వామి దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సన్నద్ధుడై ఉన్నట్టుగా అశ్వారూఢుడై చేత కత్తితో దర్శనమిస్తాడు. ఆది శంకరాచార్య విరచిత హరిహరస్తోత్రంలో స్వామిని గురించి ఉంటుంది.  కేరళ రాష్ట్రంలోని 'కుథిరన్' అనే ఊరిలో స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని వీరశాస్తుడిగా పూజిస్తారు.ఇంకా ఇక్కడ స్వామివారి అర్చన అన్నిరకాల దుష్టబాధల నుండి రక్షిస్తుంది. 
....స్వామియే శరణం అయ్యప్ప....
వచ్చే నెల శబరిమలై యాత్రా విశేషాలు మరియు మకరజ్యోతి దర్శనం గురించి తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Pages