శివం - 57 - అచ్చంగా తెలుగు
శివం - 57
రాజ కార్తీక్ 


కల్పన భారతికి, నాకు గుడిలో జరుగుతున్న సంభాషణ ...
ఇంతలో కల్పన భారతి ఇంటికి రాలేదని ఇరుగు పొరుగు గుర్తించారు.
ఆ గుడిలో పని చేస్తున్న ఒకతను మాత్రం 'ఆమె గుడిలోనే ఉందా?' అని అనుకున్నాడు.‌ ఆమె బయటకు రావటం చుడ్లేదు. ఎందుకంటే తను ఎప్పుడు వచ్చినా తనకి ప్రసాదం ఇస్తుంది, అని ఖరారు చేశాడు.
మరి కొంతమంది మాత్రం 'అసలే ఆమె మానసిక స్థితి బాలేదు. ఏమన్నా జరగరానిది జరిగితే' అని ఆలోచిస్తున్నారు.
కానీ 'లేదు, గుడిలో ఉంది' అన్న అతని వాదనను అందరూ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ గుడిని  గ్రహణ సమయం అయ్యే వరకు మూసే ఉంచాలని అనుకున్నారు. గుడిలో ఉంటే ఒక్క పూటకి ఏమీ కాదు... అనింకొంత మంది తమకు తాము భరోసా పడ్డారు. 
గుడిలో...
నేను "చెప్పు తల్లీ, నా కోరిక తీరుస్తావా?"
క భా "నేను నీ కోరిక తీర్చటనికి నా దగ్గర ఏముంది? "
నేను "తల్లీ, నా మీద నీకు ఎందుకు ఈ కోపం?"
క భా "లేదు స్వామి నీ మీద నాకు ఏ కోపం లేదు. ఉన్నది నా తల రాత మీద విరక్తి మాత్రమే .."
పుట్టగానే తల్లిని దూరం చేశావు ,తండ్రిని అరకొరగా చేసి దూరం చేశావు. కాపలా కోసం చేసుకున్న నా తోడును దూరం చేశావు. నా బిడ్డను దూరం చేశావు. నా బిడ్డను నాకు చూపించి మళ్లీ ఆశ కలిగించావు .."
నేను "తల్లి !అవన్నీ నేను చేయలేదు .."
క భా "అవును స్వామి అన్నిటికీ కారణం నువ్వే, నువ్వే చేశావు అని కాదు. నా తలరాతను నేను తిట్టుకున్నా .‌ నువ్వు చేసింది ఏముందయ్యా ? అంత నేను చేసుకున్నా.‌ పొగరుగా ప్రవర్తించా. షరతులు పెట్టి,  ప్రేమించిన వాటిని, వారిని హింసించి, ఆత్మాభిమానం అని అనుకున్నా . నాకు తెల్సయ్యా, నన్ను అభిమానించిన వారిని బాధ పెట్టాను. నాలాంటి దానికి నువ్వు ఏమన్నా చెప్పినా, జరిగినా అది నా ఆత్మాభిమానానికి పెట్టిన పరీక్ష అని అర్థం చేసుకుంటాను. అందుకే వారి ఉసురు తగిలి ఎవరికి జరిగితే నాకు అర్థం అవుతుంది అని తలరాత నా బిడ్డకి నా..."అంటూ ఏడవటం మొదలు పెట్టింది. 
నేను "తల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు .."
క భా "సతి మాత చనిపోతే నువ్వు ఎందుకు ఏడ్చావు? "
నేను "తల్లి నువ్వు ఏమన్నా నాకు ఇష్టమే. సతి లేకపోతే సృష్ఠి సమతుల్యం దెబ్బ తింటుందని నేను కాపాడగలిగి కూడా మాట కోసం తనని రక్షించుకొలేక పోయానని... "
క భా "క్షమించండి స్వామి ..నీతో పోలిక పెట్టినందుకు..."
నేను "తల్లీ .. క్షమిస్తా కానీ నా కోరిక తీర్చు తల్లి "
క భా "చేయ గలిగితే ఎందుకు చేయను? "
నేను " తల్లి అన్నీ అన్నావు కానీ నీకు ఇంత చక్కని సంగీత పాటవాన్ని ఇచ్చాను, అది మాత్రం గుర్తు లేదా? "
క భా " అవును "మొహంలో ఆనందం ప్రతిబింబిస్తుండగా అంది‌.
నేను "తల్లీ, నువ్వు పాడటం మొదలు పెట్టిన నాటి నుండి నేను నీ పాట వింటూనే ఉన్నాను. నువ్వు పాడిన పాట శ్రావ్యత నా దాకా వచ్చింది. నీ పాట మరోసారి వినాలని ఉంది."
క భా "అవును స్వామి... జరిగిన చెడును నువ్వు ఇచ్చావని అన్నాను. తలరాత అన్నాను... కాని దీనిని కూడా నువ్వే ఇచ్చావని అనలేక పోయాను."
"అన్నా, అనకున్నా అది ఇచ్చింది నువ్వే "
నేను " కమ్మని కీర్తన ...కమ్మని స్వరాలాపన మొదల పెట్టు తల్లి."
క భా "అన్ని లోకాలకు వరం ఇచ్చే నువ్వు ఈ దీనురాలిని వరం కొరుకోవటం ఎందుకు స్వామి? నువ్విచ్చిన స్వరం... నీ స్వర అభిషేకం కోసమే. అనుమతి అడుగుతావెందుకు.."
ఇంతలో ఎందుకయినా మంచిదని కొంతమంది కాగడాలు పట్టుకొని ఆలయ పరిసరాల దగ్గరకు వచ్చారు.
ఏదో మాట్లాడ బోయిన కల్పన భారతీ కళ్ళ వెంట నీరు బొటబొటా వచ్చాయి ..
క భా " కనీసం నువ్వు కనపడిన ఆనందం కూడా నాకు లేకుండా ఉన్నాను.‌ ఏ తపస్సు చేశానో నాకు నీ దర్శనం అయ్యింది.‌ ఏ వరం పొందినా దొరకని నీతో నేరుగా మాటలే దొరికాయి. ఏ నోము నోచిన వారికి ఉంటుంది ఈ అదృష్టం? ఈ స్వరాభిషేకం నీకు చేయాల్సినా,  నీవే కోరి అడిగే వరం "
నేను "తల్లి అన్నిటికీ అతీతమైన ఒక ఆనంద స్థితి లోక నీ సంగీతం ఉంటుంది. ఆ స్థితి నీకు ఈ బంధాల వల్ల ఇయ్యడం అయ్యింది .."
కల్పనకు ఇప్పుడు నేను, తన ముందు ఉన్న ఆనందం పూర్తిగా తెలుస్తోంది.
తన మనసుకి హృదయానికి మధ్యలో ఉన్న భక్తి ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయి.
నేను "మొదలు పెట్టు తల్లీ..."
క భా "స్వామి నాకు నువ్వు చెప్పిన విధంగా చిన్న కోరిక తీర్చు "
నేను "చెప్పు తల్లీ తథాస్తు"
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages