శ్రీథరమాధురి - 69
(పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
ఒక కొడుకు తన ముసలి తండ్రిని
సాయంత్రం డిన్నర్ కోసం ఒక రెస్టారెంట్ కు తీసుకుని వెళ్ళాడు.
తండ్రి బలహీనంగా , ముదుసలిగా ఉండడం వల్ల, తినేటప్పుడు ఆహారాన్ని తన చొక్కాపై, ప్యాంటుపై పోసుకున్నాడు.
ఇతరులంతా ఆయన వంక చీదరగా చూడసాగారు, కొడుకు మాత్రం మౌనంగా ఉన్నాడు.
ఆయన తినడం పూర్తయ్యాకా, కొడుకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా, ఆయన్ను మౌనంగా వాష్ రూమ్ కు తీసుకుని వెళ్లి, ఆహారపు కణాల్ని దులిపేసి, మరకలు తుడిచేసి, తల దువ్వి, ఆయన కళ్ళజోడును సరిగ్గా పెట్టాడు. వారు బయటకు వచ్చాకా రెస్టారెంట్
మొత్తం మౌనంగా చూడసాగింది. ఆ విధంగా బాహాటంగా, ఎవరైనా తమను తాము ఎలా ఇబ్బంది పెట్టుకోకుండా ఉండగలరో వారికి అర్ధం
కాలేదు.
కొడుకు బిల్ కట్టేసి, తన తండ్రితో నడవసాగాడు.
ఆ సమయంలో అక్కడ భోంచేస్తున్న ఒక
పెద్దాయన అతన్ని పిలిచి, ఇలా అడిగాడు,”నువ్వేదో మర్చిపోయావని నీకు అనిపించటంలేదూ ?”
కొడుకు, “లేదు సర్, మర్చిపోలేదు,” అన్నాడు.
ఆ పెద్దాయన ఇలా జవాబిచ్చారు,”నువ్వు మర్చిపోయావు ! నువ్వు ప్రతి కొడుకుకు ఒక గుణపాఠాన్ని, ప్రతి తండ్రికి ఒక ఆశను వదిలి వెళ్తున్నావు, “అన్నారు.
మొత్తం రెస్టారెంట్ మౌనం వహించింది.
***
మాంచి జోక్...
తండ్రి : నాకు నలుగురు కొడుకులు ఉన్నారు.
మొదటివాడు – పి.హెచ్.డి
రెండోవాడు – ఎం.బి.ఎ
మూడోవాడు – ఇంజనీర్
నాలుగోవాడు – దొంగ
పొరుగింటాయన : ఆ నాలుగోవాడిని
ఇంట్లోంచి మీరు బైటికి ఎందుకు గెంటెయ్యరు?
తండ్రి – మా ఇంట్లో సంపాదించేది అతనొక్కడే. మిగతా వారంతా నిరుద్యోగులు !
***
ఆమె – గురూజీ, నాకు తపస్సు చెయ్యాలని ఉంది. మీరు
నాకు దిశానిర్దేశం చేస్తారా?
నేను – తప్పకుండా...
ముందు నువ్వు కొన్ని చిన్న పనులు
చేసి, వాటిని 100% ఆచరించాకా, నా వద్దకు తిరిగి రావాలి.
నీ అహాన్ని వదిలి, దైవేచ్చకు లొంగిపోవాలి.
నీకోపాన్ని వదిలి, బేషరతుగా, ఎవరెలా ఉంటే అలా అందరినీ
ప్రేమించాలి.
స్వార్ధాన్ని వదిలి జీవిస్తూ, ప్రపంచానికి సేవ చేసేందుకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి.
ఆ తర్వాత ఆరేళ్ళ పాటు నేనామెను
చూడలేదు. హఠాత్తుగా ఒకరోజున ఆమె నా వద్దకు వచ్చింది. మేము 4 గంటల పాటు మౌనంగా ఉన్నాము. తర్వాత, ఆమె నన్ను హత్తుకుంది, నేనామెతో ఇలా అన్నాను,’ తల్లీ, ఇప్పుడు దైవం నీతో మాట్లాడుతున్నారు, నువ్వు గమ్యాన్ని చేరావు.’
ఆమె – అవును గురూజీ, నేను దాన్ని
అనుభూతి చెందగలుగుతున్నాను.
ఆమె వెనక్కు వెళ్తూ ఉండగా, ఆ దిశలో నేను ముమ్మారు సాష్టాంగనమస్కారం చేసాను... ఒక యోగిని
జన్మించింది.
***
No comments:
Post a Comment