బహుమతి - అచ్చంగా తెలుగు
బహుమతి
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు




అక్షరాలను పేర్చి
వాక్యాల మాలలల్లి..
ఎన్ని పార్శ్వాలను స్పృశించారో!
ఎంతమందికి స్ఫూర్తినిచ్చారో!!
కొన్ని సంస్థలు..అపర సరస్వతి రూపాలు
పోటీలు పెట్టి..కవుల చేత కలాలు పట్టిస్తాయి
ఇచ్చే అంశాలన్ని మనసుకు పట్టించి
మేధో మథనంతో కాగితంపై రూపాన్నొందేలా చేస్తాయి
కవితల వరదలు పారిస్తాయి
అన్నింటిలో మేలిముత్యాలను ఏరి 
బహుమతులు ప్రకటిస్తాయి
అవేకదా కవులకు గుర్తింపు జ్ఞాపికలు
కలకాలం దాచుకునే శాలువలు
ఇళ్లల్లోని అరల్లో చోటు చేసుకునే 
బహుమతులు
కవుల సామాజిక స్పృహకు గీటురాళ్లు
సమాజానికి దిశానిర్దేశం చేసే వెలుగు దివ్వెలు!
***
  

No comments:

Post a Comment

Pages