చిన్ని చిన్ని ఆశ
రాజవరం ఉష
రుమ ను అందరూ అభినవ జానకి అంటూ ఉంటారు అంత బాగా పాడుతుంది చక్కని స్వరం తో..
ఆ వేళ ఆది వారం కావటం తో చక్క గా తలంటు పోసుకుని లేత గులాబీ రంగు చీర కట్టుకుని మాచింగ్ బ్లౌజ్ వేసుకుని, జడకు కుడివైపు గా ఓ పింక్ గులాబీ పెట్టుకుని తీరిగ్గా తన కొలీగ్ సుకన్య ఉంటున్న సమతా నగర్ కి ఆటో లో బయలు దేరింది.. పేద ఆడ పిల్లలకు చదువు, కంప్యూటర్ నేర్పటం ఓ తపస్సు లా చేస్తున్న సుకన్య అంటే తనకెంతో యిష్టం..ఆమె ఆఫీస్ లో చేరి రెండేళ్ళ యినది అంతే..అయినా తన కన్నా జూనియర్ అన్న భావన కలుగదు రుమకి.. ఎందుకంటే సుకన్య కి ఆమె భర్త ఉద్యోగం ఇచ్చారు ధనవంతులు వాళ్ళు అయినా మానసికఆనందం ఒక్క ధనం తోనే రాదు కదా! ఉద్యోగం లో చేరి కొంత బాధ మరచిపోయింది.. కానీ ఆమె ఆశయం పేద ఆడ పిల్లలకి చదువు చెప్పించాలి అనేది స్వత హాగా దాన గుణం కలిగిన తనకు ఎంతో నచ్చి తనతో ఇట్టే ఫ్రెండ్షిప్ చేసేలా చేసింది..ఒకరోజు తాను ఆఫీస్ వద్ద ఉన్న ఒక పెదరాలికి తను ఒక చీర, బ్లౌజ్ ఉన్న కవరు దానం చేయటం సుకన్య చూసి తనను అభినందించింది అదే తొలి పరిచయం ..
ఇంతలో ఆటో సమతా నగర్ లోని సుకన్య యింటి దగ్గర్లో ఆగింది ఆటో వానికి డబ్బులిచ్చి సుకన్య ను చూసి చేయ్యూపి గేట్ తీస్కుని లోపలికి వచ్చింది రుమ..
- పెద్ద మేడ ను చూస్తున్న తన ను సుకన్య ఆప్యాయం గా రిసీవ్ చేసుకుని క్షణాల్లో టీ, స్నాక్స్ తెచ్చింది..
నిన్న సాయంత్రం ఒక పాట ల పోటీ లో తను పాడిన పాట కి జడ్జి గారు తక్కువ మార్కులు వేసి వెరెవ్వ రికో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రుమ కి మొదటి సారి ఇలా అవ్వటం ఉస్సురని యిల్లు చేరిన రుమకు సుకన్య ఫోన్ ఎంతో ఊరట నిచ్చింది...ఆదివారం ఉదయం 11 కి రమ్మని సారాంశం... వెంటనే ఓకె చెప్పేసింది రుమ..
లోపలికి తీసుకెళ్ళి సుకన్య ఆ పేద పిల్లలకు పరిచయం చేసింది అక్కడ 15 ఏళ్ళ వయసు పిల్లలు ఒక పది మంది ఉన్నారు వారందరికీ రుమ ను పరిచయం చేస్తూ ఈ అక్క చక్కగా పాటలు పాడు తుంది మిమ్మల్ని చూడాలని ఎప్పు డూ అంటుంది..ఈ రోజు కుదిరింది ఇంత మంచి అక్క ను పరిచయం చేయటం అంది..
అందరూ ముక్త కంఠంతో శుభోదయం అక్కా! అని అచ్చ తెలుగులో అంటే చాలా ముచ్చటే సింది వారందరి ముఖాల్లో తన మీద ఉన్న ప్రేమ ప్రతిఫలి స్తోంది..ఆ సంతోషం చెప్పలేనిది... ఆసక్తిగా వారిని అందర్నీ పలుకరించి పేర్లు కూడా అడిగి తెలుసుకు న్నది..వారిలో ఒకరు రుమ ని పాట పాడమని అడిగారు సుకన్య కూడా ప్రోత్సహించింది కోకిలా రావమ్మా నా పాట వినవమ్మా..అంటూ 10 రోజుల్లో రాబోయే ఉగాది ని తలచుకుంటూ పాడిన ఆ పాట విని అంతా పరవశించి చప్పట్లు కొట్టారు..
ఆ పాట అడిగిన పాప ప్రక్క నున్న మరొక అమ్మాయి చెప్పింది అక్కా.. నిన్ను పాట పాడమన్న ఈమె కూడా బాగా పాడుతుంది అని.. ఏదీ ఒక పాట నా కోసం పాడు అన్నది రుమ.. సిగ్గు పడింది తను సుకన్య కూడా అడిగింది పాడు జ్యోతీ..అని పేరు అందం గా ఉంది అనుకుంది రుమ.. పెదవే పలికిన మాటల్లో ని తీయని పాటే అమ్మ! అని చాలా మంచి పాట క్లియర్ గా ఉంది నీ వాయిస్ మంచి సింగర్ అవుతావు నా లాగే .. పాడుతూ ఉండు.. అంది రుమ
అప్పుడు చెప్పింది సుకన్య.. జ్యోతి కి 10 వ యేటనే వాళ్ళమ్మ పై లోకానికి వెళ్లిపోయిందని వాళ్ళ నాన్న ఈ మధ్యే అడ్రెస్స్ తెలుసుకుని ఇక్కడ చదువు కోసం చేర్పించాడు అని... ఒక్కసారి మౌనం ఆవరించింది రుమ కు.. రుమ కి 15 వ ఏట నాన్న వెళ్లిపోయారు పైకి..అది గుర్తొచ్చింది అమ్మ లేకుంటే ఇంకెంత కష్టమో తెలిసి రుమ కళ్ళు చెమర్చాయి.. వెంటనే జ్యోతిని గుండెకు హద్దుకుని సుకన్య తో జ్యోతి చదువు కోసం ఆర్ధికం గా తను కూడా కొంత సాయం చేయ దలచా నని చెప్పింది పిల్లలంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు...
సుకన్య అలాగే రుమా.. అంది ..
రుమ తను తెచ్చిన మిఠాయిలు అందరికీ పంచింది ..అన్నెం పున్నెం ఎరుగని లేత వయసు పిల్లలకు ఇచ్చే సాయం తో భగవంతుడు హర్షిస్తారు అని స్వానుభవం కలిగింది రు మ కి ఇప్పుడు మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది .. ఏదో నిన్న కోల్పోయిన ఆనందం ఈ పిల్లలు తనకు ఇచ్చారు సుకన్య కి కూడా ఇదే ఆనందం ఉంది అని తెలుసు కుంది
తనను అభినందించిన పిల్లల కోసం ఈ ఉగాదికి ఏదైనా గుర్తుండేలా చేయాలి అని గట్టి సంకల్పం తో యిల్లు చేరింది రుమ.......
No comments:
Post a Comment