క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుల' ఆరంభం ! - అచ్చంగా తెలుగు

క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుల' ఆరంభం !

Share This
క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుల' ఆరంభం !
పి.వి.ఎల్.సుజాత 


క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవులంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపు కునేందుకు సంప్రదాయ వేడుకలో భాగంగా క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులను రూపొందించడం జరిగింది. ఈ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు మొట్టమొదట పాశ్చాత్య దేశాల్లో తయారు చేయబడ్డాయి. 

పూర్వం వాణిజ్య పరమైన కొటేషన్స్ తో గ్రీటింగ్ కార్డులను రూపొందించేవారు. తరువాత జీసెస్ జనన చిత్రాలతో, క్రైస్తవ చిహ్నాలతో, శాంతి సందేశాలతో, బైబిల్ లోని బొమ్మలతో, తెల్లని ఎగిరే పావురాలతో, శాంతా క్లాజ్ బొమ్మలతో  క్రైస్తవ సంప్రదాయబద్ధంగా రూపొందించేవారు. అవి కాలానుగుణంగా హోలీ బబుల్స్, క్రిస్మస్ ట్రీస్, బెత్లెహాం స్టార్స్ మరియు పశువుల పాకలో మెరిసే పెద్ద నక్షత్రం లాంటి చిత్రాలతో క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ ఎంతో ఆకర్షణీయంగా నేడు మార్కెట్లో లభిస్తున్నాయి. అధికారిక క్రిస్మస్ కార్డు లు 1840 వ సంవత్సరంలో విక్టోరియా రాణీతో ప్రారంభమయ్యాయి. బ్రిటీష్ రాజ కుటుంబంలో జరిగే క్రిస్టమస్ వేడుకల సందర్భంగా  దేశవ్యాప్తంగా గ్రీటింగ్స్ తెలపడం జరిగింది. ఆ తరువాత   ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి క్రిస్మస్ గ్రీటింగ్  కార్డు 1843  లో హెన్రికోల్ కోసం జాన్ కాల్కాట్ హర్బీ అనే అతను రూపొందించాడు. 1840 నుండి 1890  వరకు ఉన్న మధ్య  కాలమంతా క్రిస్మస్ కార్డు ల స్వర్ణ యుగమని చెప్పొచ్చు. మైకేల్ మేయర్ ఇంగ్లాండ్ యొక్క జేమ్స్ తన కుమారుడు హేన్రి ఫెడరిక్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లో క్రిస్మస్ శుభాకాంక్షలను మొదటిసారి రికార్డ్ క్రిస్మస్ కార్డుల ద్వారా పంపాడు. వారు విలీనం, రోసికౄషియన్ చిత్రాలను గ్రీటింగ్ పదాలతో -''ఒక పవిత్రమైన రాజు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం అత్యంత సంతోషకరమైన వేడుక అని ఇలా రికార్డ్ కార్డు తో గ్రీటింగ్స్ తొలిసారి అందజేయడం జరిగింది. గ్రీటింగ్ కార్డులు ప్రారంభదశలో మతపరమైన ఇతి వృత్తాలతో కూడిన కార్డులు  చాలా అరుదుగా అమ్ముడుపోయాయి. తరువాత కొంత మార్పు చేర్పులు చేసి  రకరకాల పువ్వులు, యక్షిణులు, దేవదూతలు, అద్భుతమైన సీనరీలు, జలపాతాలు, డిజైన్లు మొదలైన వాటిపై  క్రిస్మస్ కొటేషన్స్ ముద్రించేవారు. కావున  వాటిని అందరూ ఇష్టపడ్డారు. ఆ తరువాత పిల్లల కోసం కార్టూన్ బొమ్మలు, జానపద చిత్రాలు, హాస్యబొమ్మలు, జంతువుల సంభాషణలతో వచ్చిన క్రిస్మస్ కార్డ్స్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ గ్రీటింగ్ కార్డులను 1873 వ సంవత్సరంలో లిథోగ్రాఫ్ సంస్థ ప్రాంగ్ మేయర్ బ్రిటన్ లోని ప్రసిద్ధ మార్కెట్ ప్రింటర్ అప్పట్లోనే ఐదు మిలియన్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులను తయారుచేసి అమ్మింది. తరువాత ఆ కార్డుల యొక్క ప్రజాదరణ రాను రాను తగ్గిపోయింది. 1923 వ సంవత్సరం నాటికి ఎన్విలాప్ల కార్డులు మార్కెట్లో కి వచ్చాయి. వీటిపై అడ్రెస్ రాసి తగిన స్టాంపులు అంటించి పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునేవిధంగా అందరికి అందుబాటులో ఉండేవి. అందువల్ల  ఇవి కొంతాకాలం బాగా  ప్రాచుర్యాన్ని పొందాయి. 

ఇటీవల దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి , అక్షరాలు చేత్తో రాసే పనిలేకుండా సెల్ ఫోన్ల ద్వారా, వాట్స్ , ఇ - మెయిల్స్, ట్విటర్, ఫేస్బుక్, ఎస్.ఎం.ఎస్, ఎం.ఎం.ఎస్, ఇన్స్టా గ్రామ్, ఈ-కార్డుల  ద్వారా ఉచిత సందేశాలను శుభాకాంక్షలను పంపించుకునే సౌలభ్యం  వెబ్ సైట్లు కల్పించడం మూలానా గ్రీటింగ్ కార్డ్స్ డిమాండ్ తగ్గి డైరెక్ట్ గా విషెస్ అందజేసుకుంటున్నారు. 

హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ టూ అల్.
***

No comments:

Post a Comment

Pages